Killer: ఫేమస్ వాస్తు శాస్త్రజ్ఞుడు దారుణ హత్య, 40 సెకన్లలో 60 కత్తిపోట్లు, పట్టపగలో స్టార్ హోటల్ లో కలకలం!
బెంగళూరు/ హుబ్బళి: ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఞుడిని అతికిరాతకంగా హత్య చేశారు. 40 సెకన్లలో 60 సార్లు పొడిచి చంపారంటే ఆయన మీద ఎంతకసి ఉందో అర్థం చేసుకోవచ్చు. కర్ణాటకలోని హుబ్బళిలోని ప్రెసిడెంట్ హోటల్ లో ఉన్న ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఞుడు చంద్రశేఖర్ గురూజీ అలియాస్ చంద్రశేఖర్ అగడిని అతి దారుణంగా హత్య చేస్తున్న సమయంలో హోటల్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఞుడు చంద్రశేఖర్ గురూజీని హత్య చేసిన నిందితులు హోటల్ నుంచి దర్జాగా బయటకు వెళ్లిపోతున్న సమయంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాస్తు శాస్త్రజ్ఞుడు చంద్రశేఖర్ గురూజీని కిరాయి హంతకులు హత్య చెయ్యలేదని, ఆయన మీద పగతోనే చంపేశారని హుబ్బళి-ధారవాడ జంట నగరాల పోలీసు కమీషనర్ లాబూరామ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Comments
killer killed private hotel hubballi road karnataka bengaluru family murder sp cctv చంద్రశేఖర్ ప్రైవేట్ హోటల్ హుబ్బళి రోడ్డు కర్ణాటక బెంగళూరు ఫ్యామిలీ హత్య ఎస్పీ సీసీటీవీ
English summary
Killer: Saral Vastu exponent Chandrashekhar Guruji alias Chandrashekhar Angadi was killed in broad daylight at a private hotel on Hubballi-Dharwad Road in Karnataka's Hubballi.
Story first published: Tuesday, July 5, 2022, 15:33 [IST]