Lady: సావిత్రి భర్త 10 ఏళ్ల క్రితమే చనిపోయాడు, ప్రియుడితో ఎంజాయ్ చేసింది, ఆసుపత్రి పక్కనే బిడ్డ సేల్!
బెంగళూరు/ మంగళూరు: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసింది. దంపతులకు పిల్లలు పుట్టలేదు. కొన్ని సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయి తల్లిదండ్రులతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నది. పుట్టింటిలో ఉంటున్న మహిళ ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని గర్బవతి అయ్యింది. కుటుంబ సభ్యులకు, బంధువులకు ఆమె గర్బవతి అయిన విషయం రహస్యంగా దాచిపెట్టింది. ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే పరువు పోతుందని భయపడింది.
ఆశా కార్యకర్త సహాయంతో వేరే మతానికి చెందిన వాళ్ల దగ్గర కొన్ని వేల రూపాయలు తీసుకుని పసిబిడ్డను అమ్మేసింది. పురిటి బిడ్డను అమ్మేసిన తల్లి సైలెంట్ గా ఇంటికి వెళ్లింది. ఈ విషయం లీక్ కావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అక్రమ సంబంధం కారణంగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లి వారం రోజులు కాకుండా బిడ్డను అమ్మేసి చేతులు దుపులుకుందని వెలుగు చూడటం కలకలం రేపింది.
Hindi: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ అజ్ఞానంలో ఉన్నారు, మాజీ ఎంపీ, నటి రమ్యా ఫైర్, నిద్రలేవండి సార్!

10 ఏళ్ల క్రితం భర్త చనిపోయాడు
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని హళియాళ తాలుకా, తట్టిగేరి గ్రామ పంచాయితీ సమీపంలోని గౌళివాడ గ్రామంలో సావిత్రి అనే మహిళ నివాసం ఉంటున్నది. వివాహం చేసుకున్న సావిత్రి ఆమె భర్తతో కాపురం చేసింది. సావిత్రి దంపతులకు పిల్లలు పుట్టలేదు. 10 సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో సావిత్రి ఆమె గౌళివాడ గ్రామంలోని పుట్టింటికి వెళ్లిపోయి తల్లిదండ్రులతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నది.

ప్రియుడిని సెట్ చేసుకుని తల్లి అయ్యింది
పుట్టింటిలో ఉంటున్న సావిత్రి భర్త లేకపోవడంతో విరహంతో రగిలిపోయింది. పుట్టింటిలో ఉంటున్న సావిత్రి ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. మూడు సంవత్సరాల నుంచి ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న సావిత్రి గర్బవతి అయ్యింది. కుటుంబ సభ్యులకు, బంధువులకు గర్బవతి అయిన విషయం తెలీకుండా సావిత్రి చాలా రహస్యంగా దాచిపెట్టింది.

బిడ్డ పుట్టిన ఆరు రోజులకే అమ్మేసిన తల్లి
ఏప్రిల్ 20వ తేదీన హళియాళ తాలుకా ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన సావిత్రి ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే తన పరువు పోతుందని భయపడింది. ఓ మహిళ సహాయంతో యల్లాపుర తాలుకాలోని కిరువత్తి గ్రామంలో నివాసం ఉంటున్న వేరే మతానికి చెందిన రహత్ పటేల్, అబ్దుల్ రహీమా దంపతుల నుంచి రూ. 25 వేల రూపాయలు తీసుకుని వాళ్లకు ఆరు రోజుల ముందు పుట్టిన పసిబిడ్డను అమ్మేసింది.

అసలు మ్యాటర్ లీక్
పురిటి బిడ్డను అమ్మేసిన సావిత్రి సైలెంట్ గా ఇంటికి వెళ్లింది. ఆశా కార్యకర్తలు సావిత్రికి పుట్టిన బిడ్డ ఎలాగుంది అని ఆరా తియ్యడానికి ఆమె ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో బిడ్డ మాయం అయిన విషయం వెలుగు చూసింది. ఆశా కార్యకర్తలు ఫిర్యాదు చెయ్యడంతో రంగంలోకి దిగిన ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు బిడ్డను అమ్మేసిన సావిత్రి, బిడ్డను అక్రమంగా కొనుక్కున్న రహత్ పటేల్, అబ్దుల్ రహీమా దంపతులు, మీడియేటర్లు భయ్యాజాన్, ఆశా కార్యకర్త రోజి లూయిస్ అనే ఐదు మందిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.