• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Lady leader: పట్టపగలు మాజీ లేడీ కార్పోరేటర్ దారుణ హత్య, నిన్న భర్త, నేడు బార్డీగార్డు స్కెచ్ తో !

|

బెంగళూరు/చెన్నై: దేశ ఐటీ రాజధాని బెంగళూరులో పాతకక్షలు భగ్గుమన్నాయి. బెంగళూరులో మాజీ లేడీ కార్పోరేటర్ ను పట్టపగలు అతి దారుణంగా చంపేశారు. కరోనా వైరస్ కారణంగా పనిలేకుండా పస్తులు ఉంటున్న పేదలకు అన్నదానం చెయ్యడానికి వెళ్లిన మాజీ లేడీ కార్పోరేటర్ రేఖాను అతిదారుణంగా చంపేశారు. ఎవరైతే తన ప్రాణాలు కాపాడుతాడని పూర్తిగా నమ్మిన బాడీగార్డు అతని బంధువులతో కలిసి అతికిరాతకంగా మాజీ కార్పోరేటర్ రేఖను చంపించేశాడు. మూడు సంవత్సరాల క్రితం మాజీ కార్పోరేటర్ రేఖా భర్త కదిరేష్ కూడా ఇదే తరహాలో దేవాలయం ఆవరణంలో దారుణ హత్యకు గురైనాడు. ఇప్పుడు రేఖాను కూడా చంపేయడంతో ఆమె వర్గంలోని నాయకులు, అనుచరులు హడలిపోయారు.

Illegal affair: ఎర్రగా, బుర్రగా ఉన్నానని భార్యకు బలుపు, ప్రియుడితో ఎస్కేప్, భర్త కేసు పెడితే !Illegal affair: ఎర్రగా, బుర్రగా ఉన్నానని భార్యకు బలుపు, ప్రియుడితో ఎస్కేప్, భర్త కేసు పెడితే !

కరోనా కారణంగా పేదలకు అన్నదానం

కరోనా కారణంగా పేదలకు అన్నదానం


ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని ఛలవాదిపాళ్య మాజీ కార్పోరేటర్ (BJP) రేఖా కదిరేష్ ప్లవర్ గార్డెన్ లో నివాసం ఉంటున్నారు. కరోనా వైరస్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు మాజీ కార్పోరేటర్ రేఖ కదిరేష్ ప్రతిరోజు అన్నదానం చేస్తున్నారు. ప్లవర్ గార్డెన్ లోని రేఖ కదిరేష్ కార్యాలయం దగ్గరే రోజూ అన్నదానం జరుగుతోంది.

అక్కా..... అని బయటకు పిలిచారు

అక్కా..... అని బయటకు పిలిచారు


గురువారం (ఈరోజు) ఉదయం 9.30 గంటల సమయంలో రేఖ కదిరేష్ ప్లవర్ గార్డెన్ లోని ఆమె కార్యాలయానికి వెళ్లింది. తరువాత కార్యాయంలో శుభ్రం చేసే వ్యక్తి వెళ్లాడు. కార్యాలయం బయట రేఖా కదిరేశన్ బాడీగార్డు ఉన్నాడు. ఉదయం 10. 30 గంటల సమయంలో అక్క అంటూ బయట నుంచి ఇద్దరు పిలిచారు. రేఖా కదిరేష్ కార్యాలయంలో నుంచి లేచి బయటకు వెళ్లింది.

 నిమిషంలో నరికేశారు

నిమిషంలో నరికేశారు


కార్యాలయం నుంచి రేఖా కదిరేష్ బయటకు వచ్చిన వెంటనే అక్కడ ఉన్న ముగ్గురు ఒక్కసారిగా కత్తులతో ఆమెను నరికేశారు. కిందపడిన రేఖా కదిరేష్ గొంతుకోసేశారు. నిమిషంలోనే పనిముగించుకున్న నిందితులు అక్కడి నుంచి పరారైనారు. అప్పటికే అన్నదానం చెయ్యడానికి అక్కడ పలావ్ తయారు చేసిన వంటపాత్రలు తెచ్చిపెట్టారు.

 దారిలోనే ప్రాణం పోయింది

దారిలోనే ప్రాణం పోయింది


కిందపడిపోయిన రేఖా గొంతు తెగిపోవడంతో కేకలు వెయ్యలేకపోయింది. విషయం గుర్తించిన స్థానికులు రేఖాను కెంపేగౌడ ఆసుపత్రికి తరలించారు. గొంతు పూర్తిగా తెగిపోవడం, శరీరం మీద కత్తిపోట్లు ఎక్కువ పడడటంతో చికిత్స విఫలమై రేఖా ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు. మాజీ కార్పోరేటర్, కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకురాలు రేఖా కదిరేష్ హత్యకు గురి కావడం కలకలం రేపింది.

సీసీటీవీ కెమెరాలు పైకి, పక్కకు తిప్పేసి పక్కాప్లాన్ తో హత్య

సీసీటీవీ కెమెరాలు పైకి, పక్కకు తిప్పేసి పక్కాప్లాన్ తో హత్య


రేఖా కదిరేష్ కార్యాలయానికి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రే రేఖా కార్యాలయానికి ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పైకి, పక్కకు తిప్పేశారని బెంగళూరు సిటీ అడిషనల్ పోలీసు కమీషనర్ మురుగన్ మీడియాకు చెప్పారు. పక్కాప్లాన్ ప్రకారమే మాజీ కార్పోరేటర్ రేఖా కదిరేష్ ను హత్య చేశారని అడిషనల్ పోలీసు కమీషనర్ మురుగన్ అన్నారు.

 రేఖాకు ఆమె బాడీగార్డు యముడు ?

రేఖాకు ఆమె బాడీగార్డు యముడు ?

మాజీ కార్పోరేటర్ రేఖా కదిరేష్ కు ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉండటంతో ఆమె పీటర్ అనే బాడిగార్డును పెట్టుకున్నారు. గురువారం ఉదయం 10.30 గంటల వరకు రేఖా కార్యాలయం బయట ఆమె బాడీగార్డు పీటర్ ఉన్నాడు. ఉదయం 10.35 గంటలకే రేఖా కదిరేష్ మీద ముగ్గురు దాడి చేసి నరికేశారని ప్రత్యక్షసాక్షలు అంటున్నారు. రేఖాను ఆమె బాడీగార్డు పీటర్, అతని బంధువు స్టీఫెన్, సరేష్ అనే ముగ్గురు కలిసి హత్య చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రేఖా భర్తను ఇలాగే చంపేశారు

రేఖా భర్తను ఇలాగే చంపేశారు

ఛలవాదిపాళ్య మాజీ కార్పోరేటర్ రేఖా భర్త కదిరేష్ కూడా గతంలో ఇలాగే దారుణ హత్యకు గురైనాడు. 2018 ఫిబ్రవరి 7వ తేదీన ప్లవర్ గార్డెన్ లోని దేవాలయం ఆవరణంలోనే కదిరేష్ ను శోభన్, స్టీఫెన్ వారి అనుచరులు అతిదారుణంగా నరికి చంపేశారు. కదిరేశన్ హత్య కేసులో జైలుకు వెళ్లిన స్టీఫెన్ ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చాడు. భర్త కదిరేష్ ను చంపిన స్టీఫెన్ అతని అనుచరులు ఇప్పుడు బాడీగార్డుతో కలిసి రేఖాను కూడా దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

కాంట్రాక్టు పనుల వివాదం !

కాంట్రాక్టు పనుల వివాదం !

ఛలవాదిపాళ్య వార్డులో కాంట్రాక్టు పనులు కేటాయించే విషయంలో రేఖా కదిరేష్ వర్గీయులకు, ప్రత్యర్థులకు వివాదం జరుగుతోందని, అదే విషయంలో కక్ష పెంచుకున్న ప్రత్యర్థులు మూడు సంవత్సరాల క్రితం కదిరేష్ ను, ఇప్పుడు ఆయన భార్య, మాజీ కార్పోరేటర్ రేఖాను అతిదారుణంగా హత్య చేశారని పోలీసు అధికారులు అంటున్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకురాలు బెంగళూరులో పట్టపగలు హత్యకు గురికావడం కలకలం రేపింది.

English summary
Lady leader: BBMP BJP Ex Corporator Rekha Kadiresh murdered by gang in Bengaluru City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X