బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady SI: సౌమ్య స్కెచ్, 15 రోజుల్లో పెళ్లి, లగ్జరీ లైఫ్ కోసం రూ. లక్ష లంచం, మేడ మీద నుంచి మేడమ్ జంప్, కాళ్లు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: లేడీ ఎస్ఐ మేడమ్ కు 15 రోజుల్లో పెళ్లి జరగాలి. చోరీ చేసిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడని అరెస్టు అయిన వ్యక్తిని కేసు నుంచి తప్పించాలంటే ఏకంగా రూ. 1 లక్ష లంచం ఇవ్వాలని నిందితుడి భార్యను లేడీ ఎస్ఐ డిమాండ్ చేసింది. లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చెయ్యడంతో లేడీ ఎస్ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ మేడ మీద నుంచి కిందకు జంప్ చెయ్యడంతో కాళ్లు విరిగిపోయాయి. 15 రోజుల్లో కాళ్లకు పారాణి వేసుకుని పెళ్లి మండపంలో కాలు పెట్టాల్సిన లేడీ ఎస్ఐ కాళ్లు విరగొట్టుకుని కటకటాలపాలైయ్యింది. లగ్జరీ లైఫ్ కోసం రూ. లక్షం లంచం తీసుకున్న మేడమ్ మానం మర్యాదతో పాటు ఉద్యోగం పోయింది.

Bigshots: ఫైవ్ స్టార్ ఆంటీలు, పానీపూరి అమ్మాయిలు, ఏంకావాలో చెప్పండి, స్కెచ్ వేస్తే ఆ కిక్కేవేరప్ప, హా!Bigshots: ఫైవ్ స్టార్ ఆంటీలు, పానీపూరి అమ్మాయిలు, ఏంకావాలో చెప్పండి, స్కెచ్ వేస్తే ఆ కిక్కేవేరప్ప, హా!

రెండు ఏళ్ల క్రితం ఎస్ఐ ఉద్యోగం

రెండు ఏళ్ల క్రితం ఎస్ఐ ఉద్యోగం

బెంగళూరు సిటీలోని చెన్నై రహదారి (పాత మద్రాస్ రోడ్డు)లోని బయ్యప్పనహళ్ళి పోలీస్ స్టేషన్ లో చిక్కబళ్లాపురంకు చెందిన సౌమ్య అలియాస్ మేడమ్ సౌమ్య లేడీ ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నది. మూడు సంవత్సరాల క్రితం సౌమ్యకు లేడీ ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. రెండు సంవత్సరాల క్రితం బయ్యప్పనహళ్ళి పోలీస్ స్టేషన్ లో సౌమ్యకు పోస్టింగ్ వచ్చింది.

15 రోజుల్లో మేడమ్ పెళ్లి

15 రోజుల్లో మేడమ్ పెళ్లి

చిక్కబళ్లాపురంకు చెందిన సౌమ్య తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, హిందీ బాషలు చక్కగా మాట్లాడుతుంది. తెలుగు వాళ్లు ఎక్కువ శాతం ఉన్న కేఆర్ పురం సమీపంలోని బయ్యప్పనహళ్ళి పోలీస్ స్టేషన్ లో సౌమ్య ఉద్యోగం చేస్తోంది. ఇప్పటికే పెళ్లి కుదిరిన సౌమ్య 15 రోజుల్లో పెళ్లి చేసుకుని అత్తగారింటిలో అడుగుపెట్టడానికి సర్వం సిద్దం చేసుకుటోంది.

దొంగ చిక్కాడా ? పట్టుకుని పీడించారా

దొంగ చిక్కాడా ? పట్టుకుని పీడించారా

చోరీ చేసిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడని ఆరోపిస్తూ ఓ వ్యక్తిని నాలుగు రోజుల క్రితం బయ్యప్పనహళ్ళి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భర్త మొబైల్ ఫోన్ చోరీ చెయ్యలేదని, అతన్ని విడిచిపెట్టాలని అతని భార్య పోలీసులను వేడుకుంది. చోరీ చేసినా, చోరీ చేసిన వస్తువులు కొనుగోలు చేసినా నేరం చేసినట్లే, అతన్ని మాత్రం వదిలిపెట్టమని లేడీ ఎస్ఐ సౌమ్య, హెడ్ కానిస్టేబుల్ జేపీ. రెడ్డి, కానిస్టేబుల్ కుమార్ తేల్చి చెప్పారు.

 రూ. లక్ష లంచం డీల్ చేసిన మేడమ్ సౌమ్య

రూ. లక్ష లంచం డీల్ చేసిన మేడమ్ సౌమ్య

చోరీ కేసులో అరెస్టు అయిన వ్యక్తిని కేసు నుంచి తప్పించాలంటే రూ. 1 లక్ష లంచం ఇవ్వాలని లేడీ ఎస్ఐ సౌమ్య బాధితుడి భార్యను డిమాండ్ చేసింది. రూ. లక్ష లంచం ఇచ్చుకోలేని నిందితుడి భార్య ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఏసీబీ అధికారులు నిందితుడి భార్యకు లక్ష రూపాయలు ఇచ్చి లేడీ ఎస్ఐ సౌమ్యకు ఇవ్వాలని చెప్పింది. నిందితుడి భార్య లక్ష రూపాయలు తీసుకుని బయ్యప్పనహళ్ళి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.

మేడ మీద నుంచి మేడమ్ జంప్... కాళ్లు ఢమాల్

మేడ మీద నుంచి మేడమ్ జంప్... కాళ్లు ఢమాల్

పోలీస్ స్టేషన్ లోని మేడ మీద ఉన్న ఇనుప పెట్టెలో రూ. లక్ష పెట్టాలని లేడీ ఎస్ఐ సౌమ్య చెప్పింది. అదే సమయంలో నిందితుడి భార్య వెంట మారు వేషంలో సినిమా స్టైల్లో పాత బట్టలు వేసుకుని, చింపిరి జుట్టుతో మఫ్తీలో వెళ్లిన ఏసీబీ అధికారులు లేడీ ఎస్ఐ సౌమ్య, హెడ్ కానిస్టేబుల్ జేపీ. రెడ్డి, కానిస్టేబుల్ కుమార్ ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. దేవుడా చిక్కితే ఉద్యోగాలు ఊడిపోతాయని భయపడిన లేడీ ఎస్ఐ సౌమ్య, హెడ్ కానిస్టేబుల్ జేపీ. రెడ్డి, కానిస్టేబుల్ కుమార్ మేడ మీద నుంచి కిందకు దూకేయడంతో వాళ్ల కాళ్లు విరిగిపోయాయి.

మానం... మర్యాద....ఉద్యోగం ఊస్ట్

మానం... మర్యాద....ఉద్యోగం ఊస్ట్

కాళ్లకు తీవ్రగాయాలైన కానిస్టేబుల్ కుమార్ ను ఆసుపత్రికి తరలించారు. లేడీ ఎస్ఐ సౌమ్య, హెడ్ కానిస్టేబుల్ జేపీ. రెడ్డి కాళ్లకు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించిన ఏసీబీ అధికారులు ఇద్దరినీ అరెస్టు చేశారు. 15 రోజుల్లో పెళ్లి పెట్టుకుని రూ. లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసిన లేడీ ఎస్ఐ సౌమ్య మానం మర్యాదతో పాటు ఉద్యోగం ఊడిపోయింది, లేడీ ఎస్ఐ సౌమ్య, హెడ్ కానిస్టేబుల్ జేపీ. రెడ్డిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరు సిటీ ఏసీబీ విభాగం ఎస్పీ కులదీప్ కుమార్ ఆర్. జైన్ మీడియాకు చెప్పారు.

సంక్రాంతి పండగ ముందు రోజు షాక్

సంక్రాంతి పండగ ముందు రోజు షాక్

బయ్యప్పనహళ్లి పోలీస్ స్టేషన్ సీఐకి తెలీకుండా ఇంత జరిగే అవకాశం లేదని, సీఐకి కూడా ఈ లంచం దందాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఆ కోణంలో ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ ఒక్క రోజు ముందు బెంగళూరులో లేడీ ఎస్ఐ సౌమ్య భాగోతం బయటపడటంతో సాటి పోలీసులు షాక్ అయ్యారు.

English summary
Lady SI: Bengaluru Lady SI and Head constable caught while taking Bribe, later arrested by ACB.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X