Lady owner: లంచం ఇస్తావా ?, మంచం మీదకు వస్తావా ?, ఇంటి యజమానితో సీఐ సెటైర్లు, క్లైమాక్స్ లో!
బెంగళూరు: ఐటీ హబ్ లో ఓ మహిళకు సొంత ఇండ్లు ఉన్నాయి. ఓ ఇంటిని ఆమె మరో మహిళకు లీజుకు ఇచ్చింది. లీజు డబ్బులు ఇచ్చిన ఆ కుటుంబ సభ్యులు కొన్ని సంవత్సరాల నుంచి అదే ఇంట్లో కాపురం ఉంటున్నారు. అయితే ఏడాది నుంచి ఆ కుటుంబ సభ్యులు వాటర్ బిల్ కట్టకుండా ఇంటి యజమాని అయిన మహిళను వేధింపులకు గురి చేస్తున్నారు. ఈనెల వాటర్ బిల్లు కట్టేస్తాం, రేపు నెల కట్టేస్తాం అంటూ సంవత్సరం నుంచి ఇంటి యజమాని అయిన మహిళను టార్చర్ చేస్తున్నారని తెలిసింది. వాటర్ బిల్లు చెల్లించకుంటే ఇల్లు ఖాళీ చెయ్యాలని చెప్పడానికి వెళ్లిన ఇంటి యజమాని మీద ఆమె ఇంట్లో లీజుకు ఉంటున్న మహిళ కుటుంబ సభ్యులు కత్తితో దాడి చేశారని తెలిసింది. బాధితురాలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.
అయితే నీకు న్యాయం చెయ్యాలంటే నాకు నువ్వు కూడా న్యాయం చెయ్యాలని ఇన్స్ పెక్టర్ ఆమెను టార్చర్ పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి. నాకు లంచం ఇస్తావా ?, మంచం మీదకు వస్తావా ?, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నా దగ్గరకు వచ్చి నాకు పడక సుఖం ఇవ్వాలని పోలీస్ ఇన్స్ పెక్టర్ నా చెయ్యి పట్టుకుని తన మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని ఆమె బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చెయ్యడం దూమరం రేపింది. ఒక పోలీసు అధికారి మీద ఇంటి యజమాని అయిన మహిళ లైంగిక దాడి కేసు పెట్టడం ఐటీ హబ్ బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యింది.
Actress:
రోడ్డు
పక్కన
శవమైన
ఫేమస్
నటి,
భర్త,
కారు
డ్రైవర్
అరెస్టు,
ఇంటి
నుంచి
వెళ్లి
మాయం,
చివరికి!

రూ. 7 లక్షలకు ఇల్లు లీజుకు ఇచ్చిన మహిళ
బెంగళూరు నగరంలోని హెణ్ణూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని శక్తి నగర్ లో ఓ వివాహిత మహిళకు సొంత ఇండ్లు ఉన్నాయి. కొన్ని ఇండ్లు అద్దెకు ఇచ్చిన ఆమె ఓ ఇంటిని వరలక్ష్మి అనే మహిళకు రూ. 7 లక్షలకు లీజుకు ఇచ్చింది. మహిళ ఇంట్లో వరలక్ష్మి కుటుంబ సభ్యులు కొన్ని సంవత్సరాల నుంచి లీజుకు ఉంటున్నారు.

వాటర్ బిల్లు తెచ్చిన తంటా
ఇంటి యజమాని అయిన మహిళకు రూ. 7 లక్షలు లీజు డబ్బులు ఇచ్చిన వరలక్ష్మి కుటుంబ సభ్యులు కొన్ని సంవత్సరాల నుంచి అదే ఇంట్లో కాపురం ఉంటున్నారు. అయితే ఏడాది నుంచి వరలక్ష్మి కుటుంబ సభ్యులు వాటర్ బిల్ కట్టకుండా ఇంటి యజమాని అయిన మహిళను వేధింపులకు గురి చేస్తున్నారు.

అది ఎంతసేపు........ఈనెల డబ్బులు కట్టేస్తాం
ఈనెల వాటర్ బిల్లు కట్టేస్తాం, రేపు నెల కట్టేస్తాం అంటూ సంవత్సరం నుంచి ఇంటి యజమాని అయిన మహిళను వరలక్ష్మి కుటుంబ సభ్యులు టార్చర్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వరలక్ష్మి కుటుంబ సభ్యులు వాటర్ బిల్లు చెల్లించకుండా టార్చర్ చేస్తున్నారని విసిగిపోయిన ఇంటి యజమాని వాళ్లను ఇల్లు ఖాళీ చేయించాలని డిసైడ్ అయ్యింది.

మహిళ మీద కత్తితో దాడి
ఈనెల 13వ తేదీన ఇంటి యజమాని అయిన మహిళ హెణ్ణూరులోని శక్తి నగర్ లోని ఆమె సొంత ఇంటి దగ్గరకు వెళ్లింది. వాటర్ బిల్లు చెల్లించకుంటే ఇల్లు ఖాళీ చెయ్యాలని వరలక్ష్మి కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆ సమయంలో ఇంటి యజమాని, వరలక్ష్మి కుటుంబ సభ్యుల మద్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సందర్బంలో ఒంటరిగా వెళ్లిన తన మీద మా ఇంట్లో లీజుకు ఉంటున్న వరలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు కత్తితో దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది.

చేతివాటం చూపించిన సీఐ
బాధితురాలు బెంగళూరులోని కేసీ జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని స్థానిక హెణ్ణూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. హెణ్ణూరు పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ వసంత్ కుమార్ బాధితురాలిని విచారణ పేరుతో ఇప్పటికే కొన్ని సార్లు పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేసి వివరాలు సేకరించారని సమాచారం.

నీకు నేను న్యాయం చేస్తా, నువ్వు నాకు న్యాయం చేస్తావా
కేసు విచారణ పేరుతో తనను పోలీస్ స్టేషన్ కు పిలిపించిన హెణ్ణూరు పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ వసంత్ కుమార్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఇంటి యజమాని అయిన మహిళ ఆరోపిస్తోంది. నీకు న్యాయం చెయ్యాలంటే నాకు నువ్వు కూడా న్యాయం చెయ్యాలని ఇన్స్ పెక్టర్ వసంత్ కుమార్ ఇంటి యజమాని అయిన ఆమెను టార్చర్ పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి.

లంచం ఇస్తావా ?, మంచం మీదకు వస్తావా
నాకు లంచం ఇస్తావా ?, మంచం మీదకు వస్తావా ?, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నా దగ్గరకు వచ్చి నాకు పడక సుఖం ఇవ్వాలని పోలీస్ ఇన్స్ పెక్టర్ నా చెయ్యి పట్టుకుని తన మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని ఆమె బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కమల్ పంత్ కు ఫిర్యాదు చెయ్యడం దూమరం రేపింది.

చెయ్యిపట్టి లాగి సీఐ లైంగిక దాడి చేశాడని కేసు పెట్టిన లేడీ
తన ఇంట్లో లీజుకు ఉంటున్న వరలక్ష్మి కుటుంబ సభ్యుల దగ్గర లంచం తీసుకున్న ఇన్స్ పెక్టర్ వసంత్ కుమార్ తన చెయ్యిపట్టుకుని తన మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని, తన మీదే ఎదురు కేసు పెట్టడానికి ప్రయత్నించాడని, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆ లేడీ ఇన్స్ పెక్టర్ వసంత్ కుమార్ మీద బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చేసింది. ఒక పోలీసు అధికారి మీద ఇంటి యజమాని అయిన మహిళ లైంగిక దాడి కేసు పెట్టడం ఐటీ హబ్ బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యింది