Lockdown: తాగిబొట్టు కదువ పెట్టిన భార్య, టీవీ కొని ఏం చేసిందంటే, తల్లిప్రేమ అంటే ఇదే, పిల్లలు!
బెంగళూరు/ గదగ్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ అమలు కావడంతో సామాన్య ప్రజలు, కూలీ కార్మికులు, వలస కూలీల బతుకులు తల్లకిందులైనాయి. కరోనా వైరస్, లాక్ డౌన్ కష్టాలతో పాటు పేద ప్రజల పిల్లలకు ఇప్పుడు ఆన్ లైన్ పాఠాల కష్టాలు మొదలైనాయి. శ్రీమంతుల పిల్లలు దర్జాగా ఇళ్లలో ఖరీదైన టీవీలు, పెద్దపెద్ద స్క్రీన్ లో ఆన్ లైన్ పాఠాలు నేర్చుకుంటున్నారు. అయితే పేద ప్రజల పిల్లలకు ప్రస్తుతం దూరదర్శన్ లో వచ్చే ఆన్ లైన్ పాఠాలే దిక్కైనాయి. ఓ పేదింటి మహిళ తన పిల్లలు బాగా చదువుకోవాలని ఆశించింది. టీవీ కొనుగోలు చెయ్యడానికి ఎవ్వరూ సహాయం చెయ్యకపోవడంతో ఆమె ఎంతో పవిత్రంగా చూసుకునే తాళిబొట్టు కదువ పెట్టి వచ్చిన సొమ్ముతో పిల్లల ఆన్ పాఠాల కోసం ఓ టీవీ కొనుగోలు చేసింది. ఇంతకాలం పొడిచేస్తాం, ఉద్దరిస్తాం అంటూ కోతలు కోస్తున్న కొందరు రాజకీయ నాయకులకు ఈ విషయం తెలిసినా ఆ అంతేనా ? అంటూ పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నారు.
Honeytrap: నాజూకు అమ్మాయిలు, కావలసినంత కండ, లావు పొడువు ఆంటీలు, మీడియా ముసుగులో డీల్!

కూలీ దంపతులకు నలుగురు పిల్లలు
కర్ణాటకలోని గదగ్ జిల్లా నరగుంద తాలుకా రెడ్డర్ నాగనూరు గ్రామంలో కస్తూరి, రామయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. రామయ్య, కస్తూరి దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. కస్తూరి, రామయ్య దంపతులకు ఎలాంటి పోలం లేకపోవడంతో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

కూతురి పెళ్లి కోసం రూ. లక్ష అప్పు
గత ఏడాది పెద్ద కుమార్తె పెళ్లి చెయ్యడానికి కస్తూరి, రామయ్య దంపతులు తెలిసిన వాళ్లు, బంధువుల దగ్గర రూ. 1 లక్ష అప్పు చేశారు. కూతురి పెళ్లి చేసిన కస్తూరి దంపతులు కొంచెం ఊపిరిపీల్చుకున్నారు. అప్పటి నుంచి కూలిపనులు చేస్తూ కొంచెం కొంచెం అప్పులు తీరుస్తూ మరో ముగ్గురు పిల్లలను చదివించుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

లాక్ డౌన్ దెబ్బకు కూలీ పనులు !
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ అమలు చెయ్యడంతో కస్తూరి, రామయ్య దంపతులు చాలా రోజులు ఖాళీగా ఇంటి దగ్గరే ఉంటూ ఉన్నకాటికి తింటున్నారు. సంసారం సాగడమే కష్టంగా ఉన్న సమయంలో కస్తూరికి ఓ పిడుగులాంటి వార్త అందింది. లాక్ డౌన్ కారణంగా స్కూల్స్ తియ్యడం లేదని, మీ పిల్లలకు ఆన్ లైన్ పాఠాలు చెబుతామని వారి పిల్లలు చదువుతున్న స్కూల్ టీచర్లు సమాచారం ఇచ్చారు. అయితే ఇప్పటికే ఇంటిలో ఉన్న చిన్న టీవీ పాడైపోవడంతో కస్తూరి అయోమయంలో పడిపోయింది. పిల్లలు చదువుకోకపోతే మాలాగే వాళ్లు కూలిపనులు చేసుకోవాల్సి వస్తుందని, ఏం చెయ్యాలి దేవుడా అంటూ తల పట్టుకుంది.

మంగళసూత్రం కదువ
కుమార్తె పెళ్లి కోసం ఇప్పటికే రూ. 1 లక్ష అప్పు చెయ్యడంతో కస్తూరికి రుణం ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకురాలేదు. లాక్ డౌన్ కారణంగా మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మీకు ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చివ్వాలని కస్తూరిని బంధువులు ప్రశ్నించారు. ఇలా కాదు అంటూ ప్రతిరోజు ఎంతో పవిత్రంగా చూసుకునే తాళిబొట్టు కుదువ పెట్టి పిల్లల ఆన్ లైన్ పాఠాల కోసం టీవీ కొనుగోలు చెయ్యాలని కస్తూరి నిర్ణయించింది.

తల్లి ప్రేమ అంటే ఇదే
కస్తూరి నేరుగా గెరివి షాపుకు వెళ్లి తాళిబొట్టు రూ. 20 వేలుకు కుదువ పెట్టింది. వచ్చిన డబ్బులో రూ. 14 వేల విలువైన 32 సెంటీమీటర్ల టీవీ కొనుగోలు చేసి పిల్లలు ఆన్ లైన్ పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించింది. తన మెడలో తాళిబొట్టు ఉంటే నాకు మాత్రమే ఉపయోగమని, అదే పిల్లలు ఆన్ లైన్ పాఠాలు నేర్చుకోవడానికి ఉపయోగపడిందని, తనకు చాలా సంతోషంగా ఉందని కస్తూరి అంటోంది. కస్తూరి కుమార్తె సురేఖ 8వ తరగతి, కొడుకు 7వ తరగతి చదువుతున్నారు. తమ తల్లి కష్టం గురించి మేము అర్థం చేసుకున్నామని, బాగా కష్టపడి చదువుకుంటామని కస్తూరి పిల్లలు అంటున్నారు. కస్తూరికి కనీసం స్థానిక రాజకీయ నాయకులు సహాయం చెయ్యడానికి ముందుకురాకపోవడంతో గ్రామస్తులు మండిపడుతున్నారు.