బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లవ్ జీహాద్ ఓ దుష్టశక్తి ..వ్యతిరేకంగా చట్టం చేస్తాం: కర్ణాటక హోం మంత్రి సంచలనం

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ పై తీవ్రమైన చర్చ జరుగుతోంది. మతాంతర వివాహాలకు విరుద్ధంగా చట్టాల రూపకల్పనకు బిజెపి పాలిత రాష్ట్రాలు కొన్ని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. ఇదే క్రమంలో కర్ణాటక హోంమంత్రి బసవరాజు బొమ్మాయ్ కూడా లవ్ జిహాద్ పై చట్టం అవసరమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ ఒక సామాజిక చెడు అని , ఒక దుష్ట శక్తి అని దీనిని నిర్మూలించడం కోసం ఒక చట్టం అవసరం అంటూ కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మాయ్ వ్యాఖ్యానించారు.

లవ్ జిహాద్ పై చట్టం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిపుణులను సంప్రదిస్తుంది

లవ్ జిహాద్ పై చట్టం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిపుణులను సంప్రదిస్తుంది

లవ్ జిహాద్ పై చట్టం చేయడం కోసం ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నిపుణులను సంప్రదిస్తున్నట్లు హోం మంత్రి వెల్లడించారు. మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పిన హోంమంత్రి తాము ఈ విషయం గురించి న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నామంటూ పేర్కొన్నారు . లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాష్ట్రాలకు మద్దతుగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటక రాష్ట్రంలో లవ్ జీహాద్ పై చట్టం తీసుకురాబోతున్నాం

కర్ణాటక రాష్ట్రంలో లవ్ జీహాద్ పై చట్టం తీసుకురాబోతున్నాం

రోజు రోజుకూ దేశంలో మతమార్పిడితో వివాహాలు రోజు రోజుకు పెరుగుతుండటంతో కర్ణాటక రాష్ట్రంలో కూడా లవ్ జిహాద్ విషయంలో అలహాబాద్ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చట్టం తీసుకురాబోతున్నాం అంటూ హోంమంత్రి బొమ్మాయ్ పేర్కొన్నారు. కేవలం వివాహం కోసం మతం మార్చడం అంగీకారం కాదని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బొమ్మాయ్ హెచ్చరించారు.

హిందూ యువతులను బలవంతంగా పెళ్లి కోసం మత మార్పిడి చెయ్యటం లవ్ జిహాద్

హిందూ యువతులను బలవంతంగా పెళ్లి కోసం మత మార్పిడి చెయ్యటం లవ్ జిహాద్

ఈ లవ్ జిహాద్ కొంతకాలంగా మితవాద గ్రూప్ లు వాడుకలోకి తీసుకువచ్చాయి . ఇది ముస్లిం అబ్బాయి ,హిందూ యువతుల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. అయితే ఇందులో అమ్మాయిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి బలవంతంగా ఇస్లాం మతం మారుస్తారు. ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి తప్పనిసరిగా ఇస్లాం మతం మార్చుకోవాలని బలవంతం చేస్తారు. తమ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నట్లు యువతులు చెప్పినా ఇది బలవంతపు వివాహమని తల్లిదండ్రులు కోర్టులనుఆశ్రయిస్తున్నారు.

English summary
Love Jihad" is a social evil and a law is necessary to tackle it, Karnataka Home Minister Basavaraj Bommai said today, revealing that the state government was consulting experts on the subject. The minister made the comments in support of a leader of the BJP - which rules the state - announcing that such a law was in the making.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X