Lovers: కరోనా వచ్చినా వీళ్లు మారరు, కులం, ఆస్తులు ఆంతస్తులు అడ్డు, ప్రియురాలి పెళ్లి, ఆత్మహత్యలు !
బెంగళూరు/ కేజీఎఫ్/ కోలారు: యువతి, యువకుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. మీరు పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తుంటే మేము సమాజంలో తలదించుకోవాలా ? నో.... మేము ఒప్పుకోము అంటూ అమ్మాయి కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు. వేరే యువకుడితో రెండు నెలల క్రితం యువతి పెళ్లి గుట్టుచప్పుడు కాకుండా జరిపించారు. ప్రేమించిన వ్యక్తిని మోసం చేసి వేరే వ్యక్తితో కాపురం చెయ్యలేక ఆమె సతమతం అయ్యింది. ప్రేమికులు ఇద్దరూ ఒకే వేల్ తో మెడలు బిగించుకుని వ్యవసాయ పొలంలోని బావిలో పడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మరోచోట ప్రేమికులు కులాలు వేరుకావడంతో హేమావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
Ex lover:నగ్న ఫోటోలు, వీడియోల దెబ్బకు రూ. 1. 25 కోట్లు స్వాహా, మాజీ ప్రియుడి ఎఫెక్ట్, సోషల్ మీడియాలో

చిన్ననాటి ఫ్రెండ్స్.... ఇప్పుడు లవర్స్
కర్ణాటకలోని కోలారు జిల్లా బంగారుపేట తాలుకాలోని మాదమంగల గ్రామంలో సురేష్ (28) అనే యువకుడు, రూపా (26) అనే యువతి నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో కొన్ని సంవత్సరాల నుంచి సురేష్, రూపా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో జీవితాంతం సంతోషంగా జీవించాలని సురేష్, రూపా ఎన్నో కలలు కన్నారు.

మా పరువు ఏం కావాలి ?
తాను సురేష్ ను పెళ్లి చేసుకుంటానని రూపా ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. నువ్వు సురేష్ ను పెళ్లి చేసుకుంటే మా పరువు ప్రతిష్ట నడిరోడ్డులో పడుతోందని, అతన్ని పెళ్లి చేసుకోవాడానికి మేము అంగీకరించమని రూపా కుటుంబ సభ్యులు కుండలు బద్దలు కొట్టినట్లు తేల్చిచెప్పారు. రూపా ఎక్కడ సురేష్ తో పారిపోతుందో అంటూ కొంతకాలం ఆమె కుటంబ సభ్యులు ఆందోళన చెందారు.

రెండు నెలల క్రితం రూపాకు పెళ్లి
ఎలాగైనా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలని సురేష్, రూపా నిర్ణయించారు. అయితే రెండు నెలల క్రితం వేరే యువకుడితో రూపాకు బలవంతంగా పెళ్లి జరిపించారు. నా ప్రియుడు సురేష్ ను తాను మోసం చేశానని, అతనికి అన్యాయం జరిగిందని రెండు నెలల నుంచి రూపా ఆవేదనచెందుతూ కుమిలిపోయింది.

భర్తను వదిలేసి ప్రియుడితో ఆత్మహత్య
రెండు రోజుల క్రితం రూపా తాను పుట్టింటికి వెలుతున్నానని చెప్పి అత్తారింటి నుంచి వచ్చేసింది. నిన్ను ప్రేమించి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని తాను కాపురం చెయ్యలేనని, ఈ సమాజంలో మనం బతకలేమని రూపా డిసైడ్ అయ్యింది. రూపా పంజాబి డ్రెస్ వేల్ తో సురేష్ తో కలిసి మెడకు బిగించుకున్న రూపా ముగిలబెలే సమీపంలోని వ్యవసాయ పొలంలో ఉన్న పెద్ద బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లి జరిగి రెండు నెలలు కూడా పూర్తి కాకముందే ప్రియుడు సురేష్ తో కలిసి రూపా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

కరోనా వచ్చినా వీళ్ల బుద్ది మాత్రం మారదు
కర్ణాటకలోని తుమకూరు జిల్లా తిపటూరు తాలుకాలోని మత్తిఘట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్న సుస్మిత (18), హాసన్ జిల్లాలోని చెన్నరాయణపట్టణ తాలుకాలోని బాగూరులో నివాసం ఉంటున్న రమేష్ (19) ప్రేమించుకున్నారు. రమేష్ ఐటీఐ, సుస్మిత ఇంటర్ చదువుతున్నారు. ఇద్దరి కులాలు వేరుకావడంతో వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. పెద్లలను ఎదిరించి పెళ్లి చేసుకుని సుఖపడలేమని నిర్ణయించిన రమేష్, సుస్మిత హేమావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రేమికుల డెత్ నోట్
తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని రమేష్, సుస్మతి ఓ డెత్ నోట్ రాసి పెట్టారని పోలీసులు అన్నారు. కరోనా వైరస్ వ్యాపించి ఎప్పుడు ఎవరి ప్రాణాలు పోతాయో చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కావడం లేదు. కరోనా వచ్చినా ప్రేమికుల విషయంలో పెద్దలు మాత్రం మారడం లేదని యువతీ యువకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పెద్దలు మనసు మార్చుకోకపోవడంతో ఇద్దరూ కలిసి హేమావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.