• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Lovers: భర్తకు గుడ్ బాయ్, ప్రియుడితో లేచిపోయి కాపురం, ప్రియురాలు ప్రాణం, ? విషం తాగిన లవర్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చిత్రదుర్గా : కుటుంబ సభ్యులు చూపించిన యువతిని వివాహం చేసుకున్న యువకుడు తన భార్యతో జీవితాంతం సుఖంగా ఉండాలని అనుకున్నాడు. పెళ్లికి ముందే తన భార్య వేరే యువకుడిని ప్రేమించిందని తెలిసినా భర్త మాత్రం అతని భార్యను బాగానే చూసుకున్నాడు. ప్రతినిత్యం నీకు ఏమి కావాలో చెప్పు, నీకు నేను ఉన్నాను అంటూ భర్త అతని భార్య ఆమె ప్రియుడిని మరిచిపోయేలా చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేశాడు. భర్త ఎంత చేసినా, ఎంత ప్రేమగా చూసుకున్నా భార్య మాత్రం ఆమె ప్రియుడిని మరిచిపోలేకపోయింది.

ఏదో ఒక విషయంలో కావాలనే భర్తతో గొడవలు పెట్టుకుంటున్న భార్య నేను నీతో కాపురం చెయ్యలేను అంటూ భర్తకు తేల్చి చెప్పేసింది. పెద్దలు పంచాయితీలు చేసినా, కుటుంబ సభ్యులు రాజీ చేసినా దంపతుల కాపురం మాత్రం నిలబడలేదు. భర్తకు గుడ్ బాయ్ చెప్పేసిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కొంతకాలం తరువాత ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయిన ఆమె అతన్ని పెళ్లి చేసుకోకుండానే వేరే ఊరిలో కాపురం పెట్టింది. కొంతకాలం తరువాత ప్రియురాలు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరింది.

ప్రియురాలికి ఆమె ప్రియుడు చికిత్స చేయించాడు. చికిత్స విఫలమై ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, తన కోసం భర్తను వదిలేసి వచ్చిన తన ప్రియురాలు చనిపోయిందని ఆవేదనతో ప్రియుడు కూడా విషయం తాగేశాడు. అయితే మా కూతురిని ఆమె ప్రియుడే చంపేశాడని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టడం కలకలం రేపింది.

Illegal affair: భార్య నగ్న వీడియోలు తీశాడు, లేడీస్ తో భర్త నగ్నంగా వీడియో కాల్స్ చేసి, శాడిస్టు !Illegal affair: భార్య నగ్న వీడియోలు తీశాడు, లేడీస్ తో భర్త నగ్నంగా వీడియో కాల్స్ చేసి, శాడిస్టు !

ఒకే ఊరిలో ప్రేమికులు

ఒకే ఊరిలో ప్రేమికులు

కర్ణాటకలోని చిత్రదుర్గా జిల్లాలోని హోసదుర్గా తాలుకాలోని కంకరె గ్రామంలో దివ్యా అనే యువతి ఉంది. అదే ఊరిలో నివాసం ఉంటున్న మంజునాథ్ అనే యువకుడిని ప్రేమించింది. మంజునాథ్, దివ్యా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే మంజునాథ్, దివ్యాల పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు నిరాకరించారు.

ప్రియురాలి పెళ్లి జరిగిపోయింది

ప్రియురాలి పెళ్లి జరిగిపోయింది

మంజునాథ్ తో మా అమ్మాయి తిరుగుతుందని అందరికి తెలిసిపోయింది అనుకున్న ఆమె కుటుంబ సభ్యులు మూడు సంవత్సరాల క్రితం ఆమె పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యారు. మూడు సంవత్సరాల క్రితం సతీష్ అనే యువకుడితో దివ్యా పెళ్లి చేశారు. భర్త సతీష్ తో కాపురం చెయ్యడానికి దివ్యా అత్తారింటికి వెళ్లింది.

భార్య లవ్ స్టోరీ భర్తకు బాగా తెలుసు

భార్య లవ్ స్టోరీ భర్తకు బాగా తెలుసు

కుటుంబ సభ్యులు చూపించిన దివ్యాను వివాహం చేసుకున్న సతీష్ తన భార్యతో జీవితాంతం సుఖంగా ఉండాలని అనుకున్నాడు. పెళ్లికి ముందే తన భార్య దివ్యా ఆమె గ్రామంలోనే నివాసం ఉంటున్న మంజునాథ్ అనే యువకుడిని ప్రేమించిందని తెలిసినా ఇమె భర్త మంజునాథ్ మాత్రం అతని భార్యను బాగానే చూసుకున్నాడు.

నీతో కాపురం చెయ్యలేనని భర్తకు చెప్పేసిన భార్య

నీతో కాపురం చెయ్యలేనని భర్తకు చెప్పేసిన భార్య

నీకు ఏమి కావాలో చెప్పు, నీకు నేను ఉన్నాను అంటూ సతీష్ అతని భార్య దివ్యా ఆమె ప్రియుడు మంజునాథ్ ను మరిచిపోయేలా చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేశాడు. భర్త సతీష్ ఎంత చేసినా, ఎంత ప్రేమగా చూసుకున్నా అతని భార్య దివ్యా మాత్రం ఆమె ప్రియుడు మంజునాథ్ ను మరిచిపోలేకపోయింది. ఏదో ఒక విషయంలో కావాలనే భర్త సతీష్ తో గొడవలు పెట్టుకుంటున్న దివ్యా నేను నీతో కాపురం చెయ్యలేను అంటూ ఆమె భర్త సతీష్ కు తేల్చి చెప్పేసింది.

ప్రియుడితో ఎస్కేప్

ప్రియుడితో ఎస్కేప్

పెద్దలు పంచాయితీలు చేసినా, కుటుంబ సభ్యులు రాజీ చేసినా సతీష్, దివ్యా దంపతుల కాపురం మాత్రం నిలబడలేదు. భర్త సతీష్ కు 9 నెలల క్రితం గుడ్ బాయ్ చెప్పేసిన దివ్యా అతనితో విడాకులు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కొంతకాలం పుట్టింటిలో ఉన్న దివ్యా మూడు నెలల క్రితం ఆమె ప్రియుడు మంజునాథ్ తో కలిసి ఇంటి నుంచి పారిపోయి అతన్ని పెళ్లి చేసుకోకుండానే చిత్రదుర్గా జిల్లాలోని హిరియూరు పట్టణంలో కాపురం పెట్టింది.

ప్రియురాలికి జ్వరం రావడంతో?

ప్రియురాలికి జ్వరం రావడంతో?

హిరియూరులో అద్దె ఇంటిని తీసుకున్న మంజునాథ్, దివ్యా కాపురం పెట్టారు. మూడు నెలల నుంచి మంజునాథ్, దివ్యా చాలా సంతోషంగా ఉన్నారని తెలిసింది. నాలుగు రోజుల క్రితం ప్రియురాలు దివ్యాకు జ్వరం ఎక్కువగా వచ్చింది. అనారోగ్యానికి గురైన ప్రియురాలు దివ్యాను ఆమె ప్రియుడు హిరయూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాడు.

#Watch Fish Human Attachment | Smart Fish | Oneindia telugu
 ప్రియురాలు చనిపోయిందని విషం తాగిన ప్రియుడు

ప్రియురాలు చనిపోయిందని విషం తాగిన ప్రియుడు

ప్రియురాలు దివ్యాకు ఆమె ప్రియుడు చికిత్స చేయించాడు. చికిత్స విఫలమై నాలుగు రోజుల తరువాత దివ్యా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, తన కోసం భర్తను వదిలేసి వచ్చిన తన ప్రియురాలు దివ్యా చనిపోయిందని ఆవేదనతో ఆమె ప్రియుడు మంజునాథ్ కూడా విషయం తాగేశాడు. అయితే స్నేహితులు విషయం తెలుసుకుని మంజునాథ్ ను ఆసుపత్రికి తరలించడంతో అతను ప్రాణాలతో భయటపడ్డాడు.

అయితే మా కూతురు దివ్యా మీద మోజు తీరిపోవడంతో ప్రియుడు మంజునాథ్ ఆమెను చంపేశాడని దివ్యా కుటుంబ సభ్యులు కేసు పెట్టడం కలకలం రేపింది. మంజునాథ్ కోలుకున్న తరువాత అతన్ని విచారణ చేస్తామని పోలీసు అధికారులు అంటున్నారు. భర్త సతీష్ ను వదిలేసి ప్రియుడు మంజునాథ్ తో కలిసి వెళ్లిపోయిన దివ్యా తరువాత రెండు మూడు సార్లు సొంత ఊరికి వచ్చి వెళ్లిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఆర్థిక విషయాలు, పర్సనల్ విషయాల్లో రెండుమూడు సార్లు దివ్యా, ఆమె ప్రియుడు మంజునానథ్ కు చిన్నిచిన్న గొడవలు జరిగాయని వారి ఇంటి పక్కన నివాసం ఉంటున్న ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడని తెలిసింది. అయితే ఈ కేసు విషయంలో విచారణ జరుగుతోందని, ఇంత వరకు పక్కా సమాచారం మాత్రం తెలీయడం లేదని పోలీసులు అంటున్నారు.

English summary
Lovers: Marred woman death, boyfriend attempts suicide near Chitradurga in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X