Lovers: ప్రేమికులు ఎస్కేప్, ప్రియుడిని అర్దనగ్నంగా చేసి దాడి, వీడియో తీశారనే భయంతో ఆత్మహత్య!
బెంగళూరు/బళ్లారి: యువతికి, ఓ యువడికి పరిచయం అయ్యింది. ఇద్దరూ రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు. ప్రియరాలు మైనర్. పెద్దలు పెళ్లికి అంగీకరించరని తెలుసుకున్న ప్రేమికులు పారిపోయారు. అయితే కొన్ని రోజులకే ప్రేమికులు ప్రియురాలి కుటుంబ సభ్యులకు చిక్కిపోయారు. ప్రియుడిని అర్దనగ్నంగా చేసి అతన్ని ఇష్టం వచ్చినట్లు చితకబాది వీడియో తీశారు. అవమానంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Wife: భార్య మీద డౌట్, యువకుడితో గంటలు గంటలు, ఫోన్ పంచాయితీ, కూతురితో కలిసి తల్లి!
కర్ణాటకలోని బళ్లారి జిల్లాలోని తోరణగల్ ప్రాంతంలో 17 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. సండూరు తాలుకాలోని తిమ్మాపుర గ్రామంలో నివాసం ఉంటున్న గంగాధర్ అనే యువకుడికి ఆమె పరిచయం అయ్యింది. రెండు సంవత్సరాల నుంచి గంగాధర్, ఆ యువతి ప్రేమించుకుంటున్నారు.
రహస్యంగా కలుసుకుంటున్న ప్రేమికులు కొంతకాలం గడిపేశారు. అమ్మాయి ఇంట్లో గంగాధర్ గురించి తెలిసిపోయింది. మా అమ్మాయి జోలికివస్తే నిన్ను చంపేస్తామని ప్రియురాలి కుటుంబ సభ్యులు గంగాధర్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పెద్దలు పెళ్లికి అంగీకరించరని తెలుసుకున్న ప్రేమికులు పారిపోయారు.

అయితే కొన్ని రోజులకే ప్రేమికులు సండూరు సమీపంలోని ఓ గ్రామంలో ప్రియురాలి కుటుంబ సభ్యులకు చిక్కిపోయారు. పెద్దలు ప్రేమికులను విడదీశారు. ప్రియుడు గంగాధర్ ను అర్దనగ్నంగా చేసి అతన్ని ఇష్టం వచ్చినట్లు చితకబాది వీడియో తీశారు. తన ప్రియురాలు దూరం అయ్యిందని, ఇప్పుడు తనను చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తే నా పరువు పోతుందని గంగాధర్ భయపడిపోయాడు.
అవమానంతో గంగాధర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గంగాధర్ ను చితకబాది అతని ఆత్మహత్యకు కారణం అయిన ప్రియురాలి కుటుంబ సభ్యులు మంజునాథ్, సతీష్, బాబు, జయక్కల మీద కేసు నమోదు చేశామని పోలీసులు అంటున్నారు. అయితే ఇంటి నుంచి పారిపోయిన ప్రేమికులు అదే రోజు పెళ్లి చేసుకున్నారని గంగాధర్ స్నేహితులు అంటున్నారు.