బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Monsoon rain:శృంగేరి పుణ్యక్షేత్రం జలమయం, కింద కరోనా, పైన వరుణుడు, దేవుడా కరుణించు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ చిక్కమగళూరు/ శృంగేరి: దేశంలో కరోనా వైరస్ (COVID 19) మహహ్మారి తాండవం చేస్తున్న సమయంలోనే అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల దెబ్బకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంబాయి నగరంతో పాటు మహారాస్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు పొరుగున ఉన్న కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన కర్ణాటకలోని శృంగేరి ఆలయం పరిసర ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. కింద కనపడని కరోనా, పైన వరుణుడు కరుణించకపోవడంతో ప్రజలు హడలిపోతున్నారు. భారీ వర్షాలతో పాటు తుంగానది సైతం కరుణించకపోవడంతో శృంగేరి పట్టణం జలమయం అయ్యింది.

Recommended Video

Karnataka Rains : Chikkamagaluru's Tunga River Overflow పొంగిపొర్లుతున్న తుంగానది !| Oneindia Telugu

Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ !Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ !

46 సంవత్సరాల్లో మొదటిసారి

46 సంవత్సరాల్లో మొదటిసారి


మహారాష్ట్రలో కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న మరాఠీలు ఇప్పుడు భారీ వర్షాల దెబ్బకు గజగజ వణికిపోతున్నారు. గత 46 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా దేశ ఆర్థిక రాజధాని ముంబాయి నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. గంటకు 107 కిలోమీటర్ల వేగంగా ముంబాయిలో గాలులు వీస్తూ భారీ వర్షాలు పడుతున్నాయి.

కర్ణాటకలో కన్నడిగులకు కటకటా

కర్ణాటకలో కన్నడిగులకు కటకటా

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు కర్ణాటకలో భారీ వర్షాలు పడుతున్నాయి. మహారాష్ట్రలోని వరద నీరు పొరుగున ఉన్న కర్ణాటకలోకి పొంగిపొర్లడంతో కన్నడిగులు వణికిపోతున్నారు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు చిక్కమగళూరు జిల్లాలోని తుంగానది పొంగిపొర్లుతున్నది.

ప్రముఖ పుణ్యక్షేత్రం

ప్రముఖ పుణ్యక్షేత్రం

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన శ్రీ శృంగేరి శారదాంబ ఆలయం చిక్కమగళూరు జిల్లాలో ఉంది. తుంగానది పొంగిపొర్లుతున్న సమయంలో ఆ వరద నీటితో పాటు భారీగా కురుస్తున్న వర్షాలతో శృంగేరి పట్టణం జలమయం అయ్యింది. శృంగేరిలోని శారదా వీదులు మొత్తం ఎక్కడ చూసినా మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచిపోయాయాయి. శృంగేరి పట్టణం జలమయం కావడంతో స్థానిక ప్రజలను రక్షిస్తున్న అగ్నిమాపక సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

రోడ్లలో ముచ్చటగా మునిగిన కార్లు

రోడ్లలో ముచ్చటగా మునిగిన కార్లు

శృంగేరి శారదాంబ ఆలయానికి వచ్చే భక్తుల వారి కార్లు, ఇతర వాహనాలు నిలపడానికి పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. కార్లు పార్క్ చేసిన ప్రాంతం మొత్తం జలమయం కావడంతో భక్తులతో పాటు స్థానికులకు చెందిన వాహనాలు మునిగిపోయాయి. తంగానది హుక్కి తెగిపోవడం వలనే శృంగేరి పట్టణం జలమయం అయ్యిందని అధికారులు అంటున్నారు. శృంగేరి, కెరకట్ట కిగ్గా ప్రాంతాలు మొత్తం జలమయం అయ్యాయి.

రాత్రికి రాత్రి రోడ్లు మాయం

రాత్రికి రాత్రి రోడ్లు మాయం


చిక్కమగళూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు పడుతున్నాయి. శృంగేరి సమీపంలోని మూడిగెరె తాలుకా సమీపంలోని చిక్కనకుడిగె, బలిగె రోడ్డుతో సహ మూడు గ్రామాలకు రాకపోకలు జరిగుతున్న రహదారులు భారీ వర్షాల దెబ్బకు రాత్రికి రాత్రి పూర్తిగా నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలు, వరదల దెబ్బకు రోడ్లు కొట్టుకు పోవడంతో మూడు గ్రామాలకు వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మూడు గ్రామాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు నిత్యవసర వస్తులు అందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు కర్ణాటకలోన పొరుగున ఉన్న జిల్లాల్లోని కన్నడిగులకు కష్టాలు ఎదురైనాయి.

English summary
Monsoon rain: The monsoon Rain continued in the Malenadu region and the Tunga River is overflowing in Sringeri town. many areas have been submerged in Tunga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X