Night curfew: ఆటో ఎక్కిన మహిళ, రోడ్డు మీద ఎవ్వరూ లేరని ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే ? నరాలు!
బెంగళూరు/హాసన్: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో అనేక మంది జీవితాలు తల్లకిందులౌతున్నాయి. కరోనా వైరస్ దెబ్బతో కొందరికి పనిలేక అవస్థలు పడుతున్నారు. కరోనా వైరస్ కారణంగా కొందరు బాగా సంపాధిస్తూ కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారు. కరోనా వైరస్ థర్డ్ వేవ్ దెబ్బతో అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. నైట్ కర్ఫ్యూ కారణంగా రవాణా సౌకర్యం లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నైట్ కర్ఫ్యూ సమయంలో వచ్చిన పని పూర్తి కాకపోవడంతో రాత్రి ఓ వివాహిత మహిళ ఆమె సొంత సిటీకి వెళ్లడానికి బస్ స్టాప్ దగ్గరకు ఆటో ఎక్కింది.
సెంట్రల్ బస్ స్టాండ్ దగ్గరకు వెళ్లాలని ఆమె ఆటో డ్రైవర్ కు చెప్పింది. సెంట్రల్ బస్ స్టాండ్ కు వెళ్లకుండా కామాంధుడు ఆమెను నిర్జనప్రదేశంలోని పిలుచుకుని వెళ్లి అత్యాచారం చేసి కామం తీర్చుకున్నాడు. మహిళను ఆటోలో పిలుచుకుని వెళ్లి రాత్రి రోడ్డు పక్కన ఆమెను తోసేసిన ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పరారైనారు. నైట్ కర్ఫ్యూ సందర్బంగా గస్తీ తిరుగుతున్న పోలీసులు, హోమ్ గార్డ్స్ ఎంట్రీతో ఆటో డ్రైవర్ అసలు కథ మొదలైయ్యింది. ఆటో డ్రైవర్ కు నరాలు పిండేసిన పోలీసులు అతని కొవ్వు తగ్గించేశారు.
Illegal
affair:
కండెక్టర్
లవ్
మ్యారేజ్,
భర్త
బస్సులో
విజిల్
వేస్తుంటే
భార్య
?,
పెళ్లికి
ముందే!

చండీగఢ్ వెళ్లిన కోల్ కత్తా మహిళ
కరోనా వైరస్ థర్డ్ వేవ్ దెబ్బతో అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. నైట్ కర్ఫ్యూ కారణంగా రవాణా సౌకర్యం లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తాలో నివాసం ఉంటున్న 35 సంవత్సరాల మహిళ చండీగఢ్ లోని సెక్టార్ 17లోని మౌలి జాగరణ్ ఏరియాలో ఉన్న స్నేహితుడిని కలవడానికి వెళ్లింది.

స్నేహితుడు మాత్రం చిక్కలేదు
నైట్ కర్ఫ్యూ కారణంగా చండీగఢ్ లోని సెక్టార్ 17 లోని మౌలి జాగరణ్ ఏరియా మొత్తం స్నేహితుడి కోసం ఆమె గాలించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వెతికినా స్నేహితుడు కనపడకపోవడంతో ఆమె నిరాశ చెందింది. ఇక కోల్ కత్తా వెళ్లిపోవాలని ఆమె డిసైడ్ అయ్యింది. చండీగఢ్ నుంచి రైలులో కోల్ కత్తా వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో ఆ సమయంలో ఆమె బస్సులో వెళ్లాలని డిసైడ్ అయ్యింది.

నైట్ కర్ఫ్యూలో ఆటో ఎక్కిన మహిళ
చండీగఢ్ లో కరోనా వైరస్ దెబ్బతో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. రాత్రి 10 గంటల సమయంలో కోల్ కత్తా మహిళ చండీగఢ్ సెక్టార్ 17లోని జనరల్ పోస్టు ఆఫీసు దగ్గర ఆటో ఎక్కింది. ఆ సమయంలో ఆటో డ్రైవర్ జైదేవ్ అలియాస్ దేవ్ (27) అనే కామాంధుడు ఎక్కడికి వెళ్లాలని ఆమెను అడిగాడు. కోల్ కత్తా వెళ్లడానికి సెంట్రల్ బస్ స్టాండ్ దగ్గరకు వెళ్లాలని ఆమె చెప్పింది.

రోడ్డు మీద ఎవ్వరూ లేరని?
నైట్ కర్ఫ్యూ అమలులో ఉండటంతో రాత్రిపూట రోడ్ల మీద ఎవ్వరూ తిరగరని ఆటో డ్రైవర్ జైదేవ్ కు తెలుసు. మహిళను సెంట్రల్ బస్ స్టాండ్ దగ్గరకే కాకుండా వేరే మార్గంలో నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెళ్లిన కామాంధుడు జైదేవ్ ఆమెను కత్తితో బెదిరించి ఆమె మీద అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించిన ఆటో డ్రైవర్ జైదేవ్ ఆమెను రోడ్డు పక్కన తోసేసి అక్కడి నుంచి పరారైనాడు.

హోమ్ గార్డులు ఎంట్రీతో సీన్ రివర్స్
నైట్ కర్ఫ్యూ సందర్బంగా గస్తీ తిరుగుతున్న పోలీసులు, హోమ్ గార్డ్స్ రోడ్డు పక్కన ఎడుస్తూ కుర్చున్న మహిళను గమనించి ఏం జరిగిందని ఆరా తీశారు. కోల్ కత్తా మహిళ జరిగిన స్టోరీ మొత్తం చెప్పింది. మహిళ ఆటో నెంబర్ చెప్పలేకపోయింది. అయితే కామాంధుడు జైదేవ్ రూపురేఖలు, అతను ఎలా ప్రవర్తించాడు అనే విషయం చెప్పింది.
రంగంలోకి దిగిన పోలీసులు దారువా గ్రామంలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ జైదేవ్ (27) అనే కామాంధుడిని పట్టుకున్నారు. తన మీద అత్యాచారం చేసింది ఇతనే అని జైదేవ్ ను బాధితురాలు గుర్తు పట్టింది. ఆటో డ్రైవర్ కు నరాలు పిండేసిన పోలీసులు అతని కొవ్వు తగ్గించేశారు. నైట్ కర్ఫ్యూ సందర్బంగా వేరే రాష్ట్రాం నుంచి వచ్చిన మహిళ మీద ఆటో డ్రైవర్ అత్యాచారం చెయ్యడంతో చండీగఢ్ ప్రజలు ఉలిక్కిపడ్డారు.