PM Modi: ఐటీ హబ్ లో ప్రధాని మోదీకి నిరసన సెగ, హిందీ బాష ఎఫెక్ట్, మసిపూసి ఆందోళన, బ్యానర్లు మాయం!
బెంగళూరు/బెళగావి: కర్ణాటకలో రెండు రోజుల పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీకి నిరసన సెగ తాకింది. హిందీ బాష మా మీద రుద్దడానికి మేము అంగీకరించం అంటూ కర్ణాటక రక్షణా వేదిక కార్యర్తలు ఆందోళనకు దిగారు, బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం బసవరాజ్ బోమ్మయ్, మంత్రి మునిరత్న తదితరుల ఫోటోలు ఏర్పాటు చేసి హిందీలో ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం చెబుతున్న బ్యానర్లు, ఫ్లెక్సీలకు కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు మసిపూసి నిరసన వ్యక్తం చేశారు.
కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తల దెబ్బతో బెంగళూరులోని పలు ప్రాంతాల్లో హిందీలో ఏర్పాటు చేసిన ఫ్లక్సీలు, బ్యానర్లను బీజేపీ కార్యకర్తలు తొలగించారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కిసాన్ మోర్చా కార్యకర్లలు ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

హిందీలో ఫ్లెక్సీలు, బ్యానర్లు
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మద్యాహ్నం బెంగళూరు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ తోపాటు బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, కర్ణాటక మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ లు, ఐపీఎస్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో పర్యటించనున్నారు.

హిందీలో స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు
బెంగళూరుకు చెందిన బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. కన్నడ, హిందీ బాషల్లో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలు బెంగళూరులో ఎక్కడ చూసిన దర్శనం ఇస్తున్నాయి.

ప్రధాని మోదీకి నిరసన సెగ
కర్ణాటకలో రెండు రోజుల పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీకి నిరసన సెగ తాకింది. హిందీ బాష మా మీద రుద్దడానికి మేము అంగీకరించం అంటూ కర్ణాటక రక్షణా వేదిక (కరవే) కార్యర్తలు ఆందోళనకు దిగారు, ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లకు మసి, నల్ల పెయింట్ పూసి నిరసన వ్యక్తం చేశారు.

పోలీసులతో వాగ్వివాదం
బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్, కర్ణాటక మంత్రి, ప్రముఖ సినీ నిర్మాత మునిరత్న తదితరుల ఫోటోలు ఏర్పాటు చేసి హిందీలో ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం చెబుతున్న బ్యానర్లు, ఫ్లెక్సీలకు కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు మసిపూసి నిరసన వ్యక్తం చేశారు. కరవే కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. ఈ సందర్బంలో కరవే కార్యకర్తలు, పోలీసుల మధ్యవాగ్వివాదం జరిగింది. పలువురు కరవే కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్టు
కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తల దెబ్బతో బెంగళూరులోని పలు ప్రాంతాల్లో హిందీలో ఏర్పాటు చేసిన ఫ్లక్సీలు, బ్యానర్లను బీజేపీ కార్యకర్తలు తొలగించారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కిసాన్ మోర్చా కార్యకర్లలు ఆందోళనకు దిగడంతో పోలీసులు 30 మందిని అరెస్టు చేశారు. మోదీ గో బ్యాక్, కర్ణాటకకు మీరు ఇచ్చిన హామీలు ఏం చేశారు ? అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.