PM Modi: ఐఐఎస్ సీలో బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించిన మోదీ, రూ. 425 కోట్లతో బాగ్వి, పార్థసారథి!
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీకి బెంగళూరులో ఘనంగా స్వాగతం పలికారు. బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ ఎయిర్ పోర్టులోకి ప్రత్యేక విమానంలో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటక గరవ్నర్ థావర్ చంద్ గోహ్లెట్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ తోపాటు బీజేపీ నాయకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
రెండో రోజుల పాటు కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. యలహంక ఎయిర్ ఫోర్స్ ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ)కి చేరుకున్నారు. ఐఐఎస్ సీలో రూ. 250 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

బెంగళూరులోని ఐఐఎస్ సీ ఆవరణంలో బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గ్రామీణ కర్ణాటకలో భాగంగా పరిశోధనలు చెయ్యడానికి అవకాశం కల్పించడానికి ఐఐఎస్ సీలో ఈ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. డెమెన్సియా వ్యాధికి సంబంధించిన పరిశోధనలు ఇక్కడ చెయ్యడానికి అవకాశం కల్పిస్తూ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు.
PM
Modi:
ఐటీ
హబ్
లో
ప్రధాని
మోదీకి
నిరసన
సెగ,
హిందీ
బాష
ఎఫెక్ట్,
మసిపూసి
ఆందోళన,
బ్యానర్లు
మాయం!
ఇదే సందర్బంలో ఐఐఎస్ సీ ఆవరణంలో రూ. 425 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బాగ్వి-పార్థసారథి ఆసుపత్రి నిర్మాణానికి శుంకుస్థాపన చేశారు. బెంగళూరులో చికిత్స పరిశోధనా కేంద్రం స్థాపించడానికి, 832 పడకల ఆసుపత్రి, పరిశోధనా కేంద్రం నిర్మించడానికి ప్రధాని నరేంద్ర మోదీ పనులు ప్రారంభించారు.