బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే.. 3 నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేసింది. ఒకవేళ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలలపాటు రద్దు చేయనున్నట్లు కర్ణాటక రవాణా శాఖ తాజాగా ప్రకటించింది.

కర్ణాటక రవాణా శాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం.. ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. వాహనాలు నడిపే నాలుగేళ్లపైబడిన వారందరూ హెల్మెట్ ధరించాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించి హెల్మెట్ పెట్టుకోకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే జరిమానాతోపాటు మూడు నెలలపాటు డ్రైవింగ్ లైసెన్ రద్దు చేయనున్నారు.

Riding without helmet will now lead to 3-month suspension of driving license in Karnataka

Recommended Video

Bengaluru : బిర్యానీ పిచ్చి.. ప్రాణాల కంటే బిర్యానే ఎక్కువా? || Oneindia Telugu

కొత్తగా వచ్చిన నిబంధనలతోపాటు పాత సేఫ్టీ రూల్స్‌ను కూడా కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది రాష్ట్ర రవాణా శాఖ. కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. బైకర్లందరూ హెల్మెట్ ధరించాలని కర్ణాటక రవాణా శాఖ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.

English summary
Riding without helmet will now lead to 3-month suspension of driving license: Karnataka govt
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X