బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూత్రంలో నీళ్లు కలిపిన నటి రాగిణి - డ్రగ్స్ కేసులో సీబీఐ, డాక్టర్లకు చుక్కలు - సంజనాతో ఫైటింగ్

|
Google Oneindia TeluguNews

కన్నడ చిత్రపరిశ్రమ (శాండల్ వుడ్) లో డ్రాగ్ రాకెట్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డ్రగ్స్ వాడకం, ఇతరులకు సరఫరా చేశారన్న అభియోగాలపై అరెస్టయిన హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు.. సీబీఐ అధికారులకు, డాక్టర్లకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని మడివాళ మహిళా సంరక్షణ కేంద్రంలో ఉన్న ఆ ఇద్దరూ పరస్పరం గొడవపడుతున్నట్లు సమాచారం. డోప్ టెస్టులకు సంబంధించి కేసీ ఆస్పత్రిలో రాగిణి అనూహ్య చర్యకు పాల్పడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ ఇద్దరిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సైతం ఉచ్చుబిగిస్తున్నది.

Recommended Video

Ragini Dwivedi, Sanjjanaa Galrani Case Update | Oneindia Telugu

వైసీపీలో 50 మంది ఎమ్మెల్యేలు నేర చరితులే - సుప్రీం ఆదేశంతో జగన్, సాయిరెడ్డికి వణుకు: కళా వెంకట్రావువైసీపీలో 50 మంది ఎమ్మెల్యేలు నేర చరితులే - సుప్రీం ఆదేశంతో జగన్, సాయిరెడ్డికి వణుకు: కళా వెంకట్రావు

మూత్రంలో నీళ్లు కలిపి..

మూత్రంలో నీళ్లు కలిపి..

రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ డ్రగ్స్ వాడారని నిర్ధారించడం వారిని సీబీఐ అధికారులు శనివారం కేసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు.. డోప్ టెస్టుల్లో భాగంగా రాగిణి, సంజన మూత్రం, వెంట్రుకలు, గోళ్ల శాంపిల్స్ ను సేకరించారు. అయితే రాగిణి మూత్ర పరీక్ష వేళ డాక్టర్లు అగచాట్లు పడాల్సి వచ్చింది. యూరిన్ శాంపిల్ కోసం వైద్య సిబ్బంది ఇచ్చిన సీసాలో రాగిణి నీళ్లను కలిపి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన ల్యాబ్ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మహిళా పోలీస్ సాయంతో రాగిణి నుంచి రెండో సారి మూత్రాన్ని సేకరించారు. రాగిణి ప్రవర్తనపై ఆస్పత్రి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌కు శాంపిల్స్

హైదరాబాద్‌కు శాంపిల్స్

శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో కీలక నిందితులుగా ఉన్న హీరోయిన్లు రాగిణి, సంజనతోపాటు రవిశంకర్, వైభవ్ జైన్, ప్రశాంత్ రంకా, నియాజ్, రాహుల్, ప్రతీక్ శెట్టిల నుంచి కూడా కేసీ ఆస్పత్రిలో యూరిన్, వెంట్రులు, గోళ్ల శాంపిల్స్ ను సేకరించారు. ఆ శాంపిళ్లను హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని అధికారులు తెలిపారు. రాగిణి తన సన్నిహితుడైన బీకే రవిశంకర్ నుంచే కాకుండా, సైమన్ అనే ఆఫ్రికన్ నుంచి కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు సీబీఐ అనుమానిస్తున్నది. ఈ మేరకు లభించిన ఆధారాలతో దర్యాప్తును వేగవంతం చేసింది. మరోవైపు..

చైనాతో టెన్షన్:మోదీ సర్కార్ అనూహ్యం - సరిహద్దుపై పార్లమెంట్‌లో చర్చకు నో - అఖిలపక్ష భేటీ కూడా లేదుచైనాతో టెన్షన్:మోదీ సర్కార్ అనూహ్యం - సరిహద్దుపై పార్లమెంట్‌లో చర్చకు నో - అఖిలపక్ష భేటీ కూడా లేదు

డ్రగ్స్ మాత్రమే కాదు.. బినామీ పేర్లతో..

డ్రగ్స్ మాత్రమే కాదు.. బినామీ పేర్లతో..

హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ సహా డ్రగ్స్ రాకెట్ లో అరెస్టయిన వ్యక్తులకు సంబంధించి మరిన్ని చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. హీరోయిన్లు ఇద్దరూ బినామీ పేర్లతో అడ్డగోలుగా ఆస్తులు పోగేసినట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనుమానిస్తోంది. ఈ మేరకు రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. హీరోయిన్ల సీబీఐ కస్టడీ ముగిసిన వెంటనే, వాళ్లను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలున్నాయి. డ్రగ్స్ వ్యవహారాలతోపాటు హీరోయిన్లు గుట్టుచప్పుడు కాకుండా పెద్ద ఎత్తున అక్రమ ఆస్తుల్ని పోగేశారని వెల్లడి కావడంతో ఈడీ అధికారులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తునకు ఉపక్రమించారు.

రాగిణి, సంజన బాహాబాహీ..

రాగిణి, సంజన బాహాబాహీ..

శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి, ప్రస్తుతం మడివాడ మహిళా సంరక్షణ కేంద్రంలో ఉంటోన్న హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అక్కడి సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నారు. నిమిషం గ్యాప్ లేకుండా ఇద్దరు వాదులాడుకుంటున్నారని, ఒక దశలో బాహాబాహీకి దిగగా, సిబ్బంది సముదాయించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్, అక్రమాస్తుల వ్యవహారాలు బయటపడటానికి, అరెస్టులకు కారణం నువ్వంటే నువ్వేనని ఆ ఇద్దరూ పోట్లాడుకుంటున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. మరోవైపు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై కొనసాగుతోన్న డ్రగ్స్ కేసు విచారణలో టాలీవుడ్ అగ్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం తెలిసిందే.

English summary
Ragini Dwivedi, who was arrested in the ongoing drug racket on September 4 was made to undergo the dope test at the KC General Hospital in Bengaluru. Sources in police department revealed that Ragini initially tampered the sample. She had mixed water in her urine sample and made it unfit for testing. The officials also took hair follicle samples of Ragini Dwivedi and Sanjjanaa Galrani. Their samples were sent for testing to a lab in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X