బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Drug mafia: డ్యాన్స్ మాస్టర్ దెబ్బకు ఫేమస్ యాంకర్ కు చెమటలు, సార్ నాకేం తెలీదు, నమ్మండి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మంగళూరు: బెంగళూరు డ్రగ్స్ మాఫియా, స్యాండిల్ వుడ్ డ్రగ్స్ దందా కేసు అనేక మలుపులు తిరుగుతోంది. డ్రగ్స్ దందా కేసులో ఇప్పుడు కన్నడ ఫేమస్ యాంకర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు అరెస్టు అయ్యి జైలుపాలైనారు. ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ సైతం ఈ డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యాడు. డ్యాన్స్ మాస్టర్ పుణ్యమా అంటూ ప్రముఖ యాంకర్, నటిని సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. సార్ నాకేం తెలీదు, నన్ను నమ్మండి అంటూ యాంకర్ పోలీసుల ముందు వాపోయారని తెలిసింది. ఈ డ్రగ్స్ కేసు దందాలో ఇంకా ఎంత మంది వ్యవహారం బయటకు వస్తుందో అంటూ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!

బెంగళూరు టూ మంగళూరు

బెంగళూరు టూ మంగళూరు

కన్నడ ప్రముఖ టీవీ చానల్ లో ఫేమస్ యాంకర్, నటి అనుశ్రీ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బెంగళూరులో నివాసం ఉంటున్న ఫేమస్ యాంకర్ అనుశ్రీకి విచారణకు హాజరుకావాలని మంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ విభాగం డీసీపీ వినయ్ గాంవ్కర్ ముందు యాంకర్ అనుశ్రీ విచారణకు హాజరైనారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు అడిగిన ప్రశ్నలకు అనుశ్రీ ఇటీవల సమాధానాలు ఇచ్చారని తెలిసింది.

డ్యాన్స్ మాస్టర్ పరిచయం

డ్యాన్స్ మాస్టర్ పరిచయం

డ్రగ్స్ కేసు వ్యవహారంలో యాంకర్ అనుశ్రీ మీడియాతో మాట్లాడారు. 12 ఏళ్ల క్రితం తరుణ్ మంగళూరులో ఓ డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారని యాంకర్ అనుశ్రీ మీడియాకు చెప్పారు, ఆ సమయంలో డ్యాన్స్ స్కూల్ ప్రారంభోత్సవానికి తాను వెళ్లానని యాంకర్ అనుశ్రీ మీడియాకు చెప్పారు. అంతకు మంచి డ్యాన్స్ మాస్టర్ తరుణ్ ఏం చేస్తున్నాడు ? ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ? అనే విషయాలు తనకు ఏమాత్రం తెలీవని, డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధాలు లేవని యాంకర్ అనుశ్రీ మీడియాకు చెప్పారు.

డ్యాన్స్ మాస్టర్స్ దెబ్బ

డ్యాన్స్ మాస్టర్స్ దెబ్బ

మంగళూరు డ్రగ్స్ కేసులో డ్యాన్స్ మాస్టర్ కిశోర్ శెట్టి, తరుణ్ లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కిశోర్ శెట్టి, తరుణ్ పుణ్యమా అంటూ కన్నడ ప్రముఖ యాంకర్ అనుశ్రీ కూడా పోలీసుల ముందు విచారణకు హాజరై అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాను పోలీసు అధికారులు విచారణ కోసం ఎప్పుడు పిలిచినా తప్పకుండా హాజరౌతానని ప్రముఖ యాంకర్ అనుశ్రీ క్లారిటీ ఇచ్చారు.

ఒక్క సినిమాతో కిశోర్ స్టార్ తిరిగింది

ఒక్క సినిమాతో కిశోర్ స్టార్ తిరిగింది

ప్రముఖ స్యాండిల్ వుడ్, బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ కిశోర్ అమన్ అలియాస్ కిశోర్ శెట్టి ABCD అనే బాలీవుడ్ సినిమాలో నటించాడు. ప్రభుదేవా, రిమో డిసౌజ తదితరులతో నటించిన డ్యాన్స్ మాస్టర్ కిశోర్ శెట్టి బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ప్రముఖ హిందీ టీవీ చానల్ ZEE TV నిర్వహించిన డ్యాన్ ఇండియా డ్యాన్ రియాలిటీ సీజన్-2 లో పాల్గొన్న కిశోర్ శెట్టి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుని పాపులర్ అయిపోయాడు.

డ్యాన్స్ మాస్టర్ అరెస్టు

డ్యాన్స్ మాస్టర్ అరెస్టు

డ్రగ్స్ కేసు దందాలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ కిశోర్ శెట్టిని మంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) పోలీసులు అరెస్టు చేశారు. సమాజంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ శెట్టికి మరో రూపం ఉందని పోలీసులు గుర్తించారు. డ్యాన్స్ మాస్టర్ కిశోర్ శెట్టి MDM మాత్రలు (Drugs) విక్రయిస్తున్నాడని పక్కా సమాచారం అందడంతో మంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పక్కా ప్లాన్ తో అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

 ఒక్క చాన్స్ వస్తే ఇలా చేశాడు

ఒక్క చాన్స్ వస్తే ఇలా చేశాడు


2013లో విడుదలైన బాలీవుడ్ సినిమా ABCD (Any Body Can Dance) సినిమాలో ఇండియన్ మైకెల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా నటించారు. ఏబీసీడీ సినిమాకు రెమో డిసౌజ దర్శకత్వం వహించడంతో పాటు ఆయన కూడా ఈ సినిమాలో నటించారు. ABCD సినిమాలో ప్రభుదేవా, రెమో డిసౌజ, గణేష్ ఆచార్య, కిశోర్ శెట్టి తదితరులు నటించారు. ABCD సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ బాషల్లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో నటించే చక్కటి అవకాశం స్యాండిల్ వుడ్ డ్యాన్స్ మాస్టర్ కిశోర్ శెట్టికి వచ్చింది. అయితే వచ్చిన ఇలాంటి చక్కటి అవకాశాన్ని కిశోర్ శెట్టి సద్వినియోగం చేసుకోకుండా నాశనం చేసుకున్నాడని కన్నడిగులు అంటున్నారు.

Recommended Video

COVID-19 సహా వైరల్ ఇన్ఫెక్షన్లను చంపడానికి APT™ T3X Ointment తో కరోనా వైరస్ కు చెక్ ! || Oneindia
డ్రగ్ మాఫియా కలకలం

డ్రగ్ మాఫియా కలకలం

కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులకు సూచించారు. ఇదే సమయంలో డ్రగ్స్ దందా కేసులకు సంబంధించి ప్రముఖ టీవీ యాంకర్ అనుశ్రీకి, మరో యాంకర్ అకుల్ బాలాజీతో పాటు మరో ముగ్గురికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని సూచించారు. ఇప్పుడు డ్రగ్స్ మాఫియా దందా కేసులో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ కిశోర్ శెట్టి అరెస్టు కావడం కలకలం రేపింది.

English summary
Sandalwood Drugs Case: Kannada Actor And Anchor Anushree reaction after Mangaluru CCB Police inquiry in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X