బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: ఐటీ హబ్ లో ఉగ్రవాది, కాశ్మీర్ దంపతుల స్కెచ్, వెయిటింగ్, ఐఎన్ఐ ఎంట్రీతో కథ క్లైమాక్స్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ కాశ్మీర్/ న్యూఢిల్లీ: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని, ఐటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన సిలికాన్ సిటీ బెంగళూరులో మకాం వేసి విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు అరెస్టు చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది ఐఎస్ కేపీతో పాటు కాశ్మీర్ కు చెందిన ఉగ్రవాద దంపతులతో టచ్ లో ఉన్నాడని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది. సోమవారం రాత్రి పోద్దుపోయిన తరువాత ఐఎన్ఏ అధికారుల ఎంట్రీతో కథ క్రైమాక్స్ కు చేరింది. అరెస్టు చేసిన ఐసీస్ ఉగ్రవాదిని మంగళవారం కోర్టు ముందు హాజరుపరచడానికి అధికారులు సిద్దం అయ్యారు.

Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

సీఏఏపై ఆందోళనలు

సీఏఏపై ఆందోళనలు

కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సీసీఏపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారతదేశంలో విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కర్ణాటక, కేరళలో యువకులకు వలవేసిందని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులపై ఎన్ఐఏ అధికారులు అప్పటి నుంచి నిఘా వేశారు.

 కాశ్మీర్ దంపతుల స్కెచ్

కాశ్మీర్ దంపతుల స్కెచ్


బెంగళూరులో గుట్టుచప్పుడు కాకుండా నిఘా వేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఖోరాసన్ ఫ్రాంత్య ఐఎస్ కేపీతో, కాశ్మీర్ కు చెందిన దంపతులతో టచ్ లో ఉన్నాడు. తరువాత ఐఎస్ కేపీ, కాశ్మీర్ దంపతుల స్కెచ్, సూచనల మేరకు విధ్యంసాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని కచ్చితమైన సమాచారం అందడంతో ఐఎన్ఏ అధికారులు బెంగళూరులో ఉగ్రవాదుల కోసం జల్లెడ పట్టారు.

కాశ్మీర్ దంపతులు అరెస్టు

కాశ్మీర్ దంపతులు అరెస్టు

భారతదేశంలో విధ్యంసాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని కచ్చితమైన సమాచారం అందడంతో ఐఎన్ఏ అధికారులు కాశ్మీర్ దంపతులతో పాటు మొత్తం ఐదు మందిని అరెస్టు చేశారు. అనుమానిత ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారం మేరకు బెంగళూరులో రహస్యంగా తలదాచుకున్న మరో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సభ్యుడిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు.

బెంగళూరు అల్లర్ల టైమ్ లో కలకలం

బెంగళూరు అల్లర్ల టైమ్ లో కలకలం

ఇటీవల బెంగళూరు సిటీలోని డీజేహళ్ళి, కేజీ హళ్ళి ప్రాంతాల్లో అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. బెంగళూరులో జరిగిన అల్లర్లను అదుపు చెయ్యడానికి ప్రయత్నించిన పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే 310 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి సమయంలో బెంగళూరులో ఐస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సభ్యుడు అరెస్టు కావడం కలకలం రేపింది.

Recommended Video

Bengaluru : 60 మంది పోలీసులకి గాయాలు.. ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపు!! || Oneindia Telugu
బెండ్ తీస్తే నిజాలు బయటకు వస్తాయి !

బెండ్ తీస్తే నిజాలు బయటకు వస్తాయి !

బెంగళూరులో అరెస్టు అయిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సభ్యుడిని మంగళవారం కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉందని తెలిసింది. కోర్టు ముందు హాజరుపరిచిన తరువాత అనుమానిత ఉగ్రవాదిని కస్టడీలోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేస్తే మరింత సమాచారం, నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని, ఇంకా కర్ణాటకతో పాటు కేరళలో ఈ సంస్థ ముఠా సభ్యులు ఎంతమంది ఉన్నారు ? అనే వివరాలు బయటకు వస్తాయని ఎన్ఐఏ అధికారులు నిర్ణయించారని సమాచారం. ఇటీవల యూఎస్ అధికారులు కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సభ్యులు ఉన్నారని హెచ్చరించిన విషయం తెలిసిందే.

English summary
Bengaluru: Islamic State (ISIS) militant group member arrested by NIA in Bengaluru. NIA which probing Kashmiri couple link with ISIS group found that man in Bengaluru in touch with them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X