బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Tractor rally: ట్రాక్టర్ల నెంబర్లు రాసుకున్న పోలీసులు, అమ్రేష్ పురి టైపులో ఓం భ్రీమ్ బ్రుష్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలు, సాగుచట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ఢిల్లీలో చేపట్టిన కిసాన్ పరేడ్ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఢిల్లీలో జరుగుతున్న కిసాన్ పరేడ్ కు మద్దతుగా దేశవ్యాప్తంగా అన్నాదాతలు అనేక నగరాల్లో ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలపై పోలీసులు డేగకన్ను వేశారు. ట్రాక్టర్ ర్యాలీల ముందు ప్రత్యక్షం అయిన పోలీసులు ఓం భ్రీమ్ బ్రుస్ అంటూ రైతులను భయపెట్టడానికి వారి అధికారంతో మంత్రోపదండాలు వేస్తున్నారు.

ఇక బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ట్రాక్టర్ ర్యాలీల్లో ఎవరెవరు పాల్గొన్నారు ?, ఆ ట్రాక్టర్ నెంబర్లు ఏమిటి ? అని మొత్తం వివరాలు సేకరించిన పోలీసులు వారి కథ చూడటానికి సిద్దం అయ్యారని తెలిసింది.

Khiladi: రిజిస్టర్ మ్యారేజ్ మొగుడు, లాడ్జ్ లో ఎంజాయ్ చేసి బ్లాక్ మెయిల్, బ్యూటీపార్లల్ ఆంటీ ఎంట్రీతో!Khiladi: రిజిస్టర్ మ్యారేజ్ మొగుడు, లాడ్జ్ లో ఎంజాయ్ చేసి బ్లాక్ మెయిల్, బ్యూటీపార్లల్ ఆంటీ ఎంట్రీతో!

అసలే బీజేపీ ప్రభుత్వం

అసలే బీజేపీ ప్రభుత్వం

దేశరాజధాని ఢిల్లీలో కిసాన్ పరేడ్ లో అన్నదాతలు వారి ప్రతాపం చూపించారు. అన్నదాతలను కట్టడి చెయ్యడానికి పోలీసులు రంగంలోకి దిగారు. భారతదేశ చరిత్రలోనే రిపబ్లిక్ డే రోజు ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు నిరసనలు వ్యక్తం కాలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటంతో అన్నదాతలు ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించడం అధికార పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదని తెలిసింది.

ఐటీ బీటీ హబ్ లో ట్యాక్టర్ల ర్యాలీ

ఐటీ బీటీ హబ్ లో ట్యాక్టర్ల ర్యాలీ

ఐటీ, బీటీ దేశ రాజధాని బెంగళూరు సిటీలో మంగళవారం రైతుల ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో జరుగుతున్న అన్నదాతల కిసాన్ పరేడ్ కు మద్దతుగా బెంగళూరులో అన్నదాతలు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. బెంగళూరులో జరిగిన ట్రాక్టర్ ర్యాలీ, అన్నదాతల నిరసన కార్యక్రమానికి నగర శివార్లలోని రైతులతో పాటు కర్ణాటకలోని కొన్ని రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ట్రాక్టర్లకు పోలీసుల కాన్వాయ్

ట్రాక్టర్లకు పోలీసుల కాన్వాయ్

బెంగళూరు నగరంలో మంగళవారం జరిగిన ట్రాక్టర్ల ర్యాలీకి పలు ప్రాంతాల నుంచి రైతులు ట్రాక్టర్లలో వచ్చారు. బెంగళూరు సిటీలోకి వస్తున్న ట్రాక్టర్లకు హోస్సళ (పోలీసుల వాహనాలు) దారి చూపిస్తూ నగరంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాక్టర్ల ముందు హోస్సళ వాహనాలు వెలుతూ అన్నదాతలు ఎక్కడ ర్యాలీ నిర్వహించాలో పోలీసులు సూచించారు.

ట్రాక్టర్ల నెంబర్లు రాసుకున్న పోలీసులు

ట్రాక్టర్ల నెంబర్లు రాసుకున్న పోలీసులు

బెంగళూరు సిటీలో మంగళవారం సుమారు 125 ట్రాక్టర్లు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, కర్ణాటకలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చెయ్యడానికి ట్రాక్టర్లలో వచ్చిన రైతులపై పోలీసులు నిఘా వేశారు. బెంగళూరులో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించిన వారి వివరాలు పోలీసులు సేకరించారు. ర్యాలీలో పాల్గొన్న ట్రాక్టర్ల రిజిస్టర్ నెంబర్లుపోలీసులు రాసుకున్నారని తెలిసింది.

అమ్రేష్ పురి టైప్ లో మంత్రాలు?

అమ్రేష్ పురి టైప్ లో మంత్రాలు?

రైతుల వివరాలు సేకరించిన పోలీసులు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో అమ్రేష్ పురి మంత్రాలు వేసినట్లు ఓం భ్రీమ్ బ్రుష్ అంటూ ట్రాక్టర్ల నెంబర్లు రాసుకుని ఆ వాహనాల యజమానుల మీద నిఘా వేశారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద సిలికాన్ సిటీలో అన్నదాతల ట్రాక్టర్ల ర్యాలీ సెగతో అధికార పార్టీ నాయకులు కంగుతిన్నారని తెలిసింది.

English summary
Tractor rally: Karnataka Police have collecting Farmers rally Tractor numbers in the Bengaluru City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X