• search
 • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

karnataka సంక్షోభంలో భారీ ట్విస్ట్: రాత్రికి రాజీనామా అన్న సీఎం యడియూరప్ప -బీజేపీ చీఫ్ నడ్డా ఖండన

|

ఒకనాటి కాంగ్రెస్ హైకమాండ్ ను గుర్తుచేస్తూ, వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎడాపెడా మార్చేస్తోన్న బీజేపీ అధిష్టానం కర్ణాటక విషయంలో మాత్రం కాస్త వెనుకడుగు వేసినట్లు కనిపిస్తోంది. భారీ అసమ్మతి ఎదుర్కొంటున్న సీఎం బీఎస్ యడియూరప్ప వయసును సాకుగా పేర్కొంటూ రాజీనామాకు దాదాపు సిద్ధపడగా, కర్ణాటక బీజేపీ సంక్షోభంలో అనూహ్య ట్విస్ట్ ఇస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు..

కర్ణాటక బీజేపీలో గత కొంత కాలంగా సాగుతోన్న సంక్షోభం ముదిరి పాకాన పడటంతో ముఖ్యమంత్రి మార్పునకు రంగం సిద్ధమైంది. గత వారం ఢిల్లీలో పర్యటించిన సీఎం యడియూరప్ప.. వయసు కారణంగా పదవి నుంచి తప్పుకుంటానని ప్రధాని మోదీతో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తన రాజీనామాను స్వయంగా నిర్ధారిస్తూ.. ''పార్టీ అధిష్ఠానం నుంచి ఈ సాయంత్రం లేదా రాత్రి లోగా ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే నా నిర్ణయాన్ని ప్రకటిస్తా'' అని యడ్డీ మీడియాతో అన్నారు. దీంతో..

viral video: అత్యంత భయానకంగా -కొండచరియలు పడి భారీగా టూరిస్టుల దుర్మరణం, మోదీ సంతాపంviral video: అత్యంత భయానకంగా -కొండచరియలు పడి భారీగా టూరిస్టుల దుర్మరణం, మోదీ సంతాపం

ఇవాళ రాత్రిలోపే ఏదో ఒకటి జరుగుతుందని యడ్డీ చెప్పడంతో దళిత వ్యక్తికి సీఎం బాధ్యతలు కట్టబెడతారని మీడియాలో రిపోర్టులు వచ్చాయి. ఈనెల 26తో రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్న యడియూరప్ప ఆరోజే బీజేఎల్పీ సమావేశానికి పిలుపునిచ్చి, మళ్లీ రద్దు చేసుకున్నారు. సీఎం మార్పు తథ్యమని వార్తలు వస్తుండగానే..

twist karnataka bjp crisis: JP Nadda Rules Out change of chief minister B S Yediyurappa

క‌ర్ణాట‌కలో ముఖ్య‌మంత్రి మార్పుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భారీ ట్విస్ట్ ఇచ్చారు. రెండు రోజుల ప‌ర్య‌టన నిమిత్తం గోవాకు వెళ్లిన న‌డ్డా.. ఇవాళ ప‌ర్య‌టన ముగించుకుని ఢిల్లీకి వెళ్లే ముందు పనాజీలో మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న క‌ర్ణాట‌క సీఎం య‌డియూర‌ప్ప‌ను మెచ్చుకున్నారు.

  Karnataka Politics Audio Clip Leaked In Karnataka Increase Heat Over CM Yediyurappa Resign Issue

  ఏలూరు మేయర్‌గా మళ్లీ నూర్జహాన్ -పవన్-బీజేపీ తుస్, టీడీపీకి 3 -ఎన్నికల పూర్తి ఫలితాలివేఏలూరు మేయర్‌గా మళ్లీ నూర్జహాన్ -పవన్-బీజేపీ తుస్, టీడీపీకి 3 -ఎన్నికల పూర్తి ఫలితాలివే

  క‌ర్ణాట‌క‌లో ముఖ్య‌మంత్రిగా య‌డియూర‌ప్ప ప‌నితీరు చాలా బాగుంద‌ని జేపీ న‌డ్డా వ్యాఖ్యానించారు. అంతేకాదు, క‌ర్ణాట‌క‌లో నాయ‌క‌త్వ సంక్షోభం లేదని, అదంతా మీడియా భ్రమ అన్న ఆయన, యడ్డీ రాజీనామా వార్తలను కొట్టిపారేశారు, ఈ రాత్రిలోపే హైక‌మాండ్ ఆదేశాలు వ‌స్తే అందుకు త‌గిన‌ట్టుగా త‌న నిర్ణ‌యం తీసుకుంటానన్న యడియూరప్పకు జేపీ న‌డ్డా తాజా వ్యాఖ్య‌లు బలాన్నిచ్చినట్లయింది. మరి ఈ ప్రకనటతో క్రైసిస్ ముగిసేనా? అనేది తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే,

  కర్ణాటక వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. బెంగళూరు సిటీలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వరద బాధితులను తక్షణ సాయం అందించాల్సిందిగా సీఎం యడియూరప్ప అధికారులను ఆదేశించారు.

  English summary
  In a new twist to the leadership change saga in the Karnataka government that has been hotting up of late, BJP national president, J P Nadda has on Sunday (June 25) flatly denied any “crisis” unfolding in the Karnataka unit of the party. He even commended the current Chief Minister, B S Yediyurappa for doing a good job at handling the state and party affairs in the southern state. Nadda said that Yediyurappa has “done good work and Karnataka state is functioning well”, said a Deccan Herald report.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X