Wife: సీక్రేట్ ఎఫెక్ట్, భార్య మొబైల్ ఫోన్ తో మెసేజ్ చేసిన భర్త, ఫ్రెండ్ ను పిలిపించి పక్కాప్లాన్ తో, ఫినిష్!
బెంగళూరు/చిక్కబళ్లాపురం: వివాహం చేసుకున్న యువకుడు అతని భార్యతో సంసారం చేస్తున్నాడు. భార్యతో కలిసి సినిమాలు, షికార్లు, బంధువుల ఇళ్లకు తిరుగుతున్న భర్త ఇంతకాలం హ్యాపీగా ఉన్నాడు. భర్త స్నేహితులు అతని ఇంటికి వెళ్లి వస్తున్నారు. కొందరు స్నేహితులు అతని భార్యకు పరిచయం ఉన్నారు. భార్య నిత్యం స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న విషయం ఆమె భర్త గమనించి ఇప్పటికే ఆమెకు బుద్దీమాటలు చెబుతూ వచ్చాడు. ఇదే సమయంలో తన స్నేహితుడు ప్రతినిత్యం తన భార్య తో వాట్సాప్ లో చాటింగ్ చేస్తున్నాడని, నేను ఇంట్లో లేని సమయంలో అతను ఇంటికి వచ్చి వెలుతున్నాడని ఆమె భర్తకు తెలిసింది.
ఇదే విషయంలో భర్త అతని స్నేహితుడితో గొడవపడ్డాడు. సాటి స్నేహితులు ఇద్దరికి నచ్చ చెప్పి ఇప్పటికే చివాట్లు పెట్టారు. అయితే భార్య మొబైల్ ఫోన్ వాట్సాప్ నెంబర్ నుంచి స్నేహితుడికి మెసేజ్ పంపించిన భర్త అతన్ని నీలగిరి తోపులోకి పిలిపించాడు. అంతే సాటి స్నేహితులతో కలిసి భర్త అతని భార్యతో చాటింగ్ చేస్తున్న స్నేహితుడిని దారుణంగా హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

భార్యతో హ్యాపీలైఫ్
కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లాలోని గౌరిబిదనూరు తాలుకాలోని ముత్తకదహళ్ళిలో (ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా సరిహద్దు) అశోక్ అనే యవకుడు నివాసం ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం అశోక్ ఓ యువతిని వివాహం చేసుకుని ఆమెతో కాపురం సంతోషంగా చేస్తున్నాడు.

భార్యకు భర్త ఫ్రెండ్స్ పరిచయం
భార్యతో కలిసి సినిమాలు, షికార్లు, బంధువుల ఇళ్లకు తిరుగుతున్న భర్త అశోక్ ఇంతకాలం హ్యాపీగా ఉన్నాడు. భర్త అశోక్ స్నేహితులు అతని ఇంటికి వెళ్లి వస్తున్నారు. భరత్ అశోక్ కు స్నేహితులు కొందరు అతని భార్యకు పరిచయం ఉన్నారు. అశోక్ కోసం అతని ఇంటికి వెళ్లి వచ్చే సమయంలో అతని భార్యతో స్నేహితులు మాట్లాడుతున్నారు.

ఎక్కువ చనువుగా ఉంటున్న స్నేహితుడు
అశోక్ కు శంకర్ (29) అనే స్నేహితుడు ఉన్నాడు. శంకర్ ఎక్కువగా అశోక్ ఇంటికి వెళ్లి వస్తున్నాడు. ఇదే సమయంలో అశోక్ భార్యతో శంకర్ కు ఎక్కువ చనువు ఏర్పడిందని తెలిసింది. అశోక్ భార్య నిత్యం స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న విషయం ఆమె భర్త గమనించి ఇప్పటికే ఆమెకు ఎక్కువగా మొబైల్ చూడకూడదని బుద్దీమాటలు చెబుతూ వచ్చాడు.

భార్య ఫ్రెండ్ తో వాట్సాప్ చాటింగ్
అశోక్ భార్య ఎక్కువ చనువు పెంచుకోవడంతో శంకర్ ఆమెతో ఎక్కువగా వ్సాట్సాప్ లో చాటింగ్ చేస్తున్నాడని తెలిసింది. చాలాకాలం వాట్సాప్ లో, సోషల్ మీడియాలో అశోక్ భార్య, శంకర్ కాలం గడుపుతున్నారని సమాచారం. ఇదే సమయంలో తన స్నేహితుడు శంకర్ ప్రతినిత్యం తన భార్య తో వాట్సాప్ లో చాటింగ్ చేస్తున్నాడని అశోక్ కు తెలిసింది.

భార్య మొబైల్ ఫోన్ నుంచి మెసేజ్....... పక్కాప్లాన్ వేసిన భర్త
ఇదే విషయంలో భర్త అశోక్ అతని స్నేహితుడు శంకర్ తో గొడవపడ్డాడు. సాటి స్నేహితులు అశోక్, శంకర్ కు నచ్చ చెప్పి ఇప్పటికే చివాట్లు పెట్టారు. అయితే భార్య మొబైల్ ఫోన్ వాట్సాప్ నెంబర్ నుంచి స్నేహితుడు శంకర్ కు మెసేజ్ పంపించిన భర్త అశోక్ అతన్ని కంబాలపల్లి సమీపంలోని నీలగిరి తోపులోకి పిలిపించాడు. నీలగిరి తోపులోకి వెళ్లిన శంకర్ ను అశోక్ అతని స్నేహితుల సహాయంతో పట్టుకున్నారు. అశోక్ అతని భార్యతో చాటింగ్ చేస్తున్న స్నేహితుడు శంకర్ ను దారుణంగా హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.