• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigshots: ఫైవ్ స్టార్ ఆంటీలు, పానీపూరి అమ్మాయిలు, ఏంకావాలో చెప్పండి, స్కెచ్ వేస్తే ఆ కిక్కేవేరప్ప, హా!

|

బెంగళూరు/బెళగావి/ముంబాయి: రసికరాజుల వీక్నెస్ ను క్యాష్ చేసుకోవడానికి కొందరు భలేభలే స్కెచ్ లు వేస్తున్నారు. కావలసినంత కండ, కలర్, నాజూకు నడుము, లావు, పొడువు ఇలా వయ్యారంగా ఉన్న పానీపూరి అమ్మాయిలు, ఫైవ్ స్టార్ ఆంటీలను అడ్డం పెట్టుకుని మూడు వీడియో కెమెరాలు చేతిలో పట్టుకుని మేము మీడియా అంటూ బాగా డబ్బు ఉన్నవాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. శ్రీమంతుల టేస్ట్ కు తగ్గట్టుగా అమ్మాయిలు, ఆంటీలతో వల వేయించి రాసలీలలు సాగిస్తున్న సమయంలో రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చెయ్యడం పనిగా పెట్టుకున్నారు.

మీరు ఎంజాయ్ చెయ్యండి సార్ అంటూ విలాసవంతమైన హోటల్స్ లో ఈ దాందాలు జరిపిస్తున్న ఆంటీల బ్యాచ్ అడ్డంగా బుక్కైయ్యింది.

Criminal Wife:ఐశ్వర్యకు టెక్కు ఎక్కవే, మామ, మొగుడి దెబ్బకు మైండ్ బ్లాక్, కోట్ల ఆస్తి కోసం పాడుపని!

మంచి ప్లేస్ లో టార్గెట్

మంచి ప్లేస్ లో టార్గెట్

కర్ణాటక- మహారాష్ట్ర సరిహద్దులో బెళగావి మహానగరం ఉంది. బెళగావి సిటీలో శ్రీమంతులతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఫ్యాక్టరీల యజమాలను నివాసం ఉంటున్నారు. మహారాష్ట్ర- కర్ణాటక బార్డర్ లో ఉన్న బెళగావిలో కన్నడిగులతో పాటు మరాఠీలు లక్షల మంది నివాసం ఉంటున్నారు. పేరుకు కర్ణాటకలో బెళగావి ఉన్నా అక్కడ కన్నడ, మరాఠీ బాషలు సరిసమానంగా మాట్లాడుతుంటారు.

పూనీపూరీ అమ్మాయిలు..... ఫైవ్ స్టార్ ఆంటీలు

పూనీపూరీ అమ్మాయిలు..... ఫైవ్ స్టార్ ఆంటీలు

బెళగావి సిటీకి చెందిన రఘనాథ్ దూమాళ, సదాశివ చిప్పలకట్టి అనే కాలాంతకులు శ్రీమంతులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల వివరాలు సేకరించారు. వారిలో అమ్మాయిలు, మద్యం వ్యసనం ఉన్న వారిని లిస్ట్ ఔట్ చేశారు. అంతే వారి ఫోన్ నెంబర్లు సేకరించిన రఘనాథ్, సదాశివ సార్ మీరు ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు కదా, ఏమైనా ఎంజాయ్ చేసే ఆలోచన ఉందా ? అంటూ మాటలు కలిపారు.

అందుబాటులో ఆల్ కలర్స్

అందుబాటులో ఆల్ కలర్స్

నాజూకు అమ్మాయిలు, కావలసినంత కండ, లావు, పొడవు, ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిలు, ఆంటీలు ఇలా మీకు ఏ వయసు వాళ్లు కావాలో చెప్పండి, గుట్టుచప్పుడు కాకుండా హోటల్స్, రిసార్టులు, గెస్ట్ హౌస్ లకు పంపిస్తాం, పోలీసులతో మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేము చూసుకుంటాం, మమ్మల్ని నమ్మండి అంటూ అమ్మాయిలు, ఆంటీ పిచ్చి ఉన్న వాళ్లకు మాయమాటలు చెబుతున్న రఘనాథ్, సదాశివ తదితరులు వేల రూపాయలకు డీల్ మాట్లాడుకున్నారు.

ఊపులో ఉంటే సీక్రెట్ కెమెరాలతో ?

ఊపులో ఉంటే సీక్రెట్ కెమెరాలతో ?

అమ్మాయిలు, ఆంటీల పిచ్చి ఉన్న బాగా బలిసిన కొందరు శ్రీమంతులు రఘనాథ్, సదాశివతో డీల్ మాట్లాడుకుని విలాసవంతమైన హోటల్స్, రిసార్టులు, గెస్ట్ హౌస్ లకు అమ్మాయిలను పిలిపించుకుని వెళ్లారు. తరువాత మద్యం సేవించి అమ్మాయిలు, వివాహిత మహిళలతో ఎంజాయ్ చేశారు. మంచి రసపట్టులో ఉన్న సమమంలో సీక్రెట్ కెమెరాలతో వారి దగ్గరకు వెళ్లిన మహిళలు, అమ్మాయిలతోనే రాసలీలల వీడియోలు తీయించారు.

చేతికి భలే చిక్కారు

చేతికి భలే చిక్కారు

బాగా పేరు ప్రతిష్టలు ఉన్న శ్రీమంతుల రాసలీలల వీడియోలు తీసిన తరువాత మేము ఫ్రైమ్ న్యూస్ కన్నడ మీడియా వాళ్లు మాట్లాడుతున్నాం, మీరు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు మాకు చిక్కాయి. మేము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వాటిని మీడియాలో ప్రసారం చేస్తాం, తరువాత మీ పరువు పోయి ఆత్మహత్యలు చేసుకుంటారు, మీ కాపురాలు కూలిపోతాయి, మీ వ్యాపారాలు దెబ్బతింటాయి అంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఎంజాయ్ చేశారు.

ఆల్ సైజ్ ఆంటీల స్కెచ్

ఆల్ సైజ్ ఆంటీల స్కెచ్

బెళగావికి చెందిన బసవరాజు అనే వ్యాపారి వీరి వలలోపడి విలవిలలాడిపోయాడు. బసవరాజ్ ను రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చెయ్యడంతో చివరికి రూ. 5 లక్షలకు బేరం కుదిరింది. బాధితుడు బసవరాజ్ బెళగావి పోలీసులను ఆశ్రయించి లబోదిబో అన్నాడు. బెళగావిలోని ఓ ప్రముఖ హోటల్ లో బసవరాజ్ నుంచి వగలాడీలు సంగీత, మంజుల, గౌరి అనే ముగ్గురు మహిళలు రూ. 5 లక్షలు తీసుకోవడానికి వెళ్లారు .అదే సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి మంజుల, సంగీత, గౌరీలను అదుపులోకి తీసుకున్నారు.

కిలాడీ గ్యాంగ్ కు ఇదే పని

కిలాడీ గ్యాంగ్ కు ఇదే పని

సంగీత, మంజుల, గౌరీలు ఇచ్చిన సమాచారం మేరకు రఘనాథ్ సదాశివలను పోలీసులు అరెస్టు చేశారు. ఐదు మంది దగ్గర ఫ్రైమ్ న్యూస్ కన్నడ యూట్యాబ్ మీడియా ఐడీ కార్డులు ఉన్నాయని బెళగావి ఏసీపీ నారాయణ మీడియాకు చెప్పారు. అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న శ్రీమంతుల రాసలీలల వీడియోలు తీస్తున్న ఈ ఐదు మంది తరువాత వారిని బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయాలు లాక్కొని ఎంజాయ్ చేస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కామాంధులైన కొందరు శ్రీమంతులు చాలా మంది వాళ్ల పరువు పోతుందని ఏమిజరిగినా కేసులు పెట్టడం లేదని పోలీసులు విచారణ వ్యక్తం చేస్తున్నారు.

English summary
Year Ender 2020: Five People have been arrested in Belagavi, including three women who were blackmailing in the Honeytrap model.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X