YS Jagan: బెంగళూరులో వైఎస్ జగన్, కర్ణాటక సీఎం ఆదేశాలతో బీజేపీ ఎమ్మెల్యే చర్చలు, తిరుమలలో !
బెంగళూరు/ అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి బెంగళూరులో ఆయన అభిమానులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప ఆదేశాల మేరకు ఆయన రాజకీయ కార్యదర్శి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే ఎస్ఆర్. విశ్వనాథ్ ఆంధ్రా సీఎం వైఎస్. జగన్ ను కలిసి తిరుమలలో కర్ణాటక భవన్ నిర్మించే విషయంపై చర్చించారని సమాచారం. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో కలిసి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం) చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నేరుగా యలహంక సమీపంలోని బాగలూరు సమీపంలోని ఆయన ఇంటికి వెళ్లారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి సంబంధించి వైఎస్. జగన్ బెంగళూరు చేరుకున్నారు.
Congress meeting: లీకు వీరులు ఎవరో ? ఏడాది ముందు మాయం, నిద్రలేచిన నటి రమ్య, కుట్ర!

కర్ణాటక సీఎం ఆదేశం
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప రాజకీయ కార్యదర్శి, బెంగళూరులోని యలహంక బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్. విశ్వనాథ్ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డితో బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్. విశ్వనాథ్ చర్చించారు.

తిరుమల విషయంపై చర్చ
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ది చెందిన తిరుమల కొండపై శ్రీ ఏడుకొండలస్వామి సన్నిధిలో కర్ణాటక భవన్ స్థాపించే విషయంపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డితో బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ చర్చించారని తెలిసింది. కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డితో బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్. విశ్వనాథ్ భేటీ అయ్యారని సమాచారం.

హామీ ఇచ్చిన వైఎస్ జగన్ !
ప్రపంచ ప్రసిద్ది చెందిన తిరుమలలోని శ్రీ ఏడుకొండలస్వామి సన్నిధిలో కర్ణాటక భవన్ నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ సానుకూలంగా స్పంధించారని కన్నడ మీడియా తెలిపింది. TTD అధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరగా వచ్చే నెల (సెప్టెంబర్)లో తిరుమలలో కర్ణాటక భవన్ నిర్మించడానికి శుంకుస్థాపన చెయ్యడానికి చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కర్ణాటక ప్రభుత్వానికి హామీ ఇచ్చారని సమాచారం.

ప్యారిస్ కు వైఎస్ హర్షారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె వైఎస్. హర్షారెడ్డి ప్యారిస్ వెలుతున్నారు. ప్యారిస్ లోని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ లో ఉన్నత విద్యాభ్యాసం చెయ్యడానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుమార్తె వైఎస్. హర్షారెడ్డి వెలుతున్నారు. వైఎస్. హర్షారెడ్డిని బెంగళూరు అంతర్జాతీయ విమానశ్రయం నుంచి ప్యారిస్ పంపించడానికి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్. జనగ్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు బెంగళూరు చేరుకున్నారు.