వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Big Boss 4: గంగవ్వ నుంచి గంగమ్మకు షిఫ్ట్ అయిన మన్మధుడు..ట్రోలింగే కారణమా..?

|
Google Oneindia TeluguNews

బిగ్‌బాస్ -4 సీజన్ క్రమంగా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ క్రమంలోనే గత వారం హోస్ట్ అక్కినేని నాగార్జున గంగవ్వను అవ్వా అని పిలువడంతో సోషల్ మీడియాలో నెటిజెన్లు తెగ ట్రోల్ చేశారు. అయితే మన్మధుడు సోషల్ మీడియాలో నెటిజెన్ల ట్రోల్స్ ఫాలో అయినట్లు ఉన్నాడు. అందుకే పిలుపులో తేడా కనిపించింది.ఇక అసలు స్టోరీ ఏంటో చూద్దాం.

గంగవ్వ వయస్సు కోసం సెర్చింగ్

గంగవ్వ వయస్సు కోసం సెర్చింగ్

బిగ్ బాస్ -4 తెలుగు ప్రేక్షకులను కట్టి పడేస్తోంది. ఇక బిగ్ బాస్ షో ప్రారంభంలో కొత్త ముఖాలతో కాస్త డల్‌గానే నడిచింది. అయితే గంగవ్వ హౌజ్‌లో ఉండటంతో క్రమంగా ప్రేక్షకులు ఆమెకోసమే చూస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. గంగవ్వ క్రేజ్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. అయితే గత వారం గంగవ్వను కింగ్ నాగార్జున అవ్వా అని పిలువడంతో సోషల్ మీడియాలో నెటిజెన్లు తెగ ట్రోల్ చేశారు. ముందుగా గూగుల్‌లో గంగవ్వ వయస్సు ఎంతో తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేశారు. ఆ తర్వాత ఎలాగూ కింగ్ నాగార్జున ఏజ్ ఎంతో తెలుసుకున్నారనుకోండి.

 గంగవ్వ నుంచి గంగమ్మకు షిఫ్ట్

గంగవ్వ నుంచి గంగమ్మకు షిఫ్ట్

గంగవ్వ 1959 జూలై 25న జన్మించారు. ఇక నాగార్జున 1959 ఆగష్టు 29న పుట్టారు. గంగవ్వ నాగార్జున కంటే వయస్సులో ఒక నెలరోజులు పెద్ద అని చెప్పొచ్చు. అయితే నాగార్జున అవ్వ అని పిలువడంతో నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ విషయం నాగార్జున దృష్టికి వచ్చినట్లు ఉంది. తాజాగా శనివారం జరిగిన ఎపిసోడ్‌లో కన్ఫెషన్ రూంలోకి గంగవ్వ వచ్చింది. అయితే నాగార్జున ముందుగా ఆమెను గంగమ్మ అని పిలిచి వీక్షకుల దృష్టిని మరల్చారు. గంగమ్మ మీ ఆరోగ్యం ఎలాగుంది అంటూ సంబోధించారు. గంగవ్వ తన ఆరోగ్యం బాగానే ఉందని సమాధానం ఇచ్చింది. ఎప్పటికీ మీరు బాగుండాలి గంగమ్మ అంటూ నాగార్జున చెప్పారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : బిగ్‌బాస్ సారీ చెప్పాలని Noel ఫ్రస్టేట్, జబర్దస్త్ అవినాష్‌ అల్లరి !
అన్నా అని పిలిచిన గంగవ్వ

అన్నా అని పిలిచిన గంగవ్వ

"నన్ను అన్న అని పిలిచావు కదా.. నువ్వు నా చెల్లెలివి" అని మన్మధుడు చెప్పారు. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న లాజిక్ ఉంది. వయస్సు పరంగా చూస్తే గంగవ్వ కింగ్ నాగార్జున కంటే ఒక నెల రోజులు పెద్ద.. అలాంటప్పుడు నాగార్జున గంగవ్వకు తమ్ముడుతో సమానం అవుతారు. గంగవ్వ కూడా నాగార్జునను అన్న అని పిలువడంతోనే నాగార్జున చెల్లెలని సంబోధించారు. ఇక గంగవ్వ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. గంగవ్వ బాగా ఆడుతున్నారని నాగార్జున కితాబిచ్చాడు. తను తనలానే ఉండాలని నాగార్జున గంగవ్వను ప్రోత్సహించారు.

మొత్తానికి ఈ చిన్న చిన్న ఇష్యూస్ పక్కనపెడితే... గంగవ్వ బిగ్‌ బాస్‌ షోకు ఒక గొప్ప క్రేజ్ తీసుకొచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో ఆమెకే ఎక్కువగా ఓట్లు వస్తున్నాయని తెలుస్తోంది.

English summary
After facing trolls from netizens, Host Nagarjuna for the Big Boss show had called Gangavva as Gangamma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X