India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిగ్‌బాస్ కంటెస్టెంట్ నా పెళ్లాం: మోసగించింది: మరొకరితో ఎఫైర్: టాప్ బిజినెస్‌మెన్ సంచలనం

|
Google Oneindia TeluguNews

అతిపెద్ద రియాలీటీ షోలో పాల్గొంటోన్న కంటెస్టెంట్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు. బయటి ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేకుండా బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగుతున్నప్పటికీ.. వారి గత జీవితం వెంటాడుతోంది. కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆమె అభిమానులు, బిగ్‌బాస్ వీక్షకులను నివ్వెర పరుస్తోంది.

ఎవరా కంటెస్టెంట్..

ఎవరా కంటెస్టెంట్..

ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్ పేరు పవిత్ర పునియా. టీవీ నటి. కొన్ని హిందీ టీవీ సీరియళ్లలో నటించారామె. బిగ్‌బాస్ 14 సీజన్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో గడిపారు. ఈ వారమే ఎలిమినేట్ అయ్యారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌గా టెలికాస్ట్ అవుతోన్న రియాలిటీ షో ఇది. ఎలిమినేట్ అనంతరం ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవిత్ర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. అందరి దృష్టీ ఆమె వ్యక్తిగత జీవితం మీద పడేలా చేసింది.

తన భార్యగా చెప్పుకొంటోన్న హోటలియర్..

తన భార్యగా చెప్పుకొంటోన్న హోటలియర్..


పవిత్ర పునియా తన భార్య అని వెల్లడించారు టాప్ బిజినెస్‌మెన్, హోటలియర్ సుమిత్ మహేశ్వరి. పవిత్ర పునియాను తాను ఇదివరకే పెళ్లి చేసుకున్నానని వెల్లడించారు. ఆమె కోరిక మేరకు ఈ విషయాన్ని ఇప్పటిదాకా బయటపెట్టలేదని, పెళ్లయినట్లు తెలిస్తే.. కేరీర్ దెబ్బతింటుందనే ఉద్దేశంతో తాను బహిర్గతం చేయలేదని అన్నారు. టీవీ ఛానల్‌కు ఇచ్చిన పవిత్ర ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో తమ వివాహ విషయాన్ని వెల్లడించాల్సి వస్తోందని పేర్కొన్నారు.

ఆ ఇద్దరితో ఎఫైర్..

ఆ ఇద్దరితో ఎఫైర్..

పరాస్ ఛాబ్రా, ప్రతీస్ సెహజ్‌పాల్ అనే ఇద్దరితో పవిత్ర పునియా ఎఫైర్‌ను సాగించిందని, వారితో రిలేషన్‌షిప్‌లో కొనసాగిందని సుమిత్ తెలిపారు. ఇప్పటికీ తాము భార్యభర్తలమేనని తేల్చి చెప్పారు. వివాహం జరిగిందనే విషయాన్ని రహస్యంగా ఉంచడాన్ని పవిత్ర తనకు అనుకూలంగా మార్చుకుందని ఆరోపించారు. ఇప్పటికీ తాము భర్యాభర్తలుగా ఉంటున్నామని చెప్పారు. ఇదివరకు తమ ఇద్దరి మధ్య విడాకుల కోసం ప్రయత్నాలు సాగాయని, అవి కొలక్కి రాలేదని చెప్పారు.

వెడ్డింగ్ యానివర్సరీలో పరాస్..

వెడ్డింగ్ యానివర్సరీలో పరాస్..

తమ వెడ్డింగ్ యానివర్సరీ కార్యక్రమానికి పరాస్ ఛాబ్రాను ఆహ్వానించడం తనను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని సుమిత్ మహేశ్వరి పేర్కొన్నారు. పరాస్.. అదేపనిగా గోవాకు వచ్చాడని, తాను సర్దిచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ.. వినిపించుకోలేదని ఆరోపించారు. వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందనే విషయం తెలిసిన తరువాత తాను పరాస్‌కు మెసేజ్ పంపించానని, విడాకులు తీసుకునేంత వరకూ ఆమెతో తిరగొద్దని, కలవొద్దని విజ్ఞప్తి చేశానని చెప్పారు.

'Still The Boss'- Chris Gayle, The Only Cricketer To Score 1000 Sixes In T20 History | #UniverseBoss
తనతో పెళ్లి.. పరాస్‌తో ఎఫైర్..

తనతో పెళ్లి.. పరాస్‌తో ఎఫైర్..

తనను పెళ్లి చేసుకుని పరాస్ ఛాబ్రాను ప్రేమించడం బాధించిందని చెప్పుకొచ్చారు. ఆమె ప్రేమలో నిజాయతీ లోపించిందని వాపోయారు. తాను నిజాయితీగా పవిత్రను ప్రేమించానని, ఆమె పేరును టాటూ వేయించుకున్నానని, దాన్ని తొలగించడానికి తనకు మనసొప్పట్లేదని సుమిత్ మహేశ్వరి చెప్పారు. ఆమెకు పరాస్ ఛబ్రా తగిన వ్యక్తి కాడని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నానని చెప్పారు. విడాకుల కోసం తమ ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు.

English summary
A hotelier named Sumit Maheshwari has claimed that he is married to TV actress Pavitra Punia, who recently got evicted from Bigg Boss 14. He also alleged that she had cheated on him four times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X