• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Bigg Boss Tamil:తొలివారంలోనే సభ్యుల మధ్య గొడవలు, తెలుగును మించేలా.. కమల్ ఏం చేశారంటే..?

|

చెన్నై: తెలుగులో బిగ్‌బాస్ క్రమంగా పుంజుకుంటోంది. ఇంటిలోని సభ్యుల మధ్య భావోద్వేగాలు, ఆగ్రహావేశాలతో ఈ మెగా రియాల్టీ షో రక్తికడుతోంది. ఇక ఆదివారం రోజున తెలుగులో ఎలిమినేషన్ జరుగుతుంది. తెలుగులో బిగ్‌బాస్ షో ఇలా ఉంటే తమిళనాడులో కూడా షో దుమ్ము రేపుతోంది. అక్టోబర్ 6వ తేదీన ప్రారంభమైన ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు యూనివర్శల్ స్టార్ కమల్‌హాసన్. ఇక తమిళ్ బిగ్‌బాస్ తొలివారాంతంకు చేరుకుంది. ఈ వారంలో ఇంటి సభ్యులు ఎలా ఉన్నారనేది శనివారం ఎపిసోడ్‌లో టెలికాస్ట్ అయ్యింది.

 తొలివారంలో గొడవలు, భావోద్వేగాలు

తొలివారంలో గొడవలు, భావోద్వేగాలు

తమిళ్ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న మోడల్, నటి సనమ్ శెట్టి తన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడంలో కాస్త ఇబ్బంది పడుతోంది. అచ్చం తెలుగులో మోనాల్ గజ్జర్ ఎలా అయితే ప్రతి చిన్న విషయానికి కన్నీళ్లు పెట్టేసుకుంటుందో అదే స్థాయిలో సనమ్ కూడా చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతోంది. ఇప్పటికే ఇతర ఇంటి సభ్యులైన రేఖ, సురేష్ చక్రవర్తి, సంయుక్తలతో సనమ్ శెట్టికి విబేధాలు తలెత్తాయి. తాజాగా బాలాజీ మురుగదాస్‌తో గొడవ పెట్టుకున్నట్లుగా కనిపించింది. బాలాజీతో కలిసి ఆ గొడవ గురించి అందుకు దారితీసిన కారణాలపై మాట్లాడుదామనుకున్నప్పటికీ అవి ఫలించలేదు. బ్యూటీ పేజెంట్‌గా సనం శెట్టి ఉన్నసమయంలో ఏదో విషయం గురించి బాలాజీ ప్రస్తావించిన సందర్భంలో సనమ్ శెట్టి ఆగ్రహానికి గురైంది. అయితే తన స్నేహితుల ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్నానని అందుకే బయటకు చెప్పినట్లు బాలాజీ వివరణ ఇచ్చాడు

 కో-స్టార్ రేఖతో కాస్త చనువుతో వ్యవహరించిన కమల్

కో-స్టార్ రేఖతో కాస్త చనువుతో వ్యవహరించిన కమల్

ఇదిలా ఉంటే బిగ్‌బాస్ తమిళ సీజన్ 4లో కమల్‌హాసన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అన్ని ఎపిసోడ్‌లను నిశితంగా చూసిన లోకనాయకుడు, అలనాటి సహనటి ప్రస్తుతం బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఉన్న నటి రేఖతో కాస్త చనువుగా మాట్లాడారు. నిషా, శివానిలతో కూడా కమల్ చాలా క్లోజ్‌గా మాట్లాడటం జరిగింది. శివానిని ఒక పాట పాడాల్సిందిగా కోరాడు. అయితే కమల్ నటించిన గుణ చిత్రం నుంచి ఓ సూపర్ హిట్ సాంగ్‌ను 19 ఏళ్ల శివాని పాడింది. తొలుత ఇతర ఇంటి సభ్యులతో కలిసిపోయేందుకు చాలా ఇబ్బంది పడినట్లు శివాని చెప్పింది. ఇక తొలిరోజున తన కాటుక, ముక్కుపుడక మిస్ అవుతున్నాయంటూ నానా హైరానా చేసిన నటి రేఖను... తన వస్తువులు దొరికాయా అంటూ జోక్ చేశారు కమల్ హాసన్.

  Bigg Boss Telugu 4 : Jordar Sujatha Is Out From Bigg Boss House || Oneindia Telugu
  న్యూస్ రీడర్ అనిత - సురేష్‌ల మధ్య గొడవ

  న్యూస్ రీడర్ అనిత - సురేష్‌ల మధ్య గొడవ

  ఇక ఈ వారంలో హైలైట్‌గా నిలిచిన సన్నివేశం న్యూస్ రీడర్ అనితా సంపత్ మరియు సురేష్ చక్రవర్తిల మధ్య గొడవ.ఇద్దరూ పలుమార్లు గొడవపడటమే కాదు ఇద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్న క్రమంలో వారి మధ్య ఈక్వేషన్స్ గురించి కమల్ ప్రశ్నించారు. వీరి మధ్య జరుగతున్న గొడవతో ఇతర ఇంటి సభ్యులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఇక అనితా సంపత్‌పై అసభ్య పదజాలం వాడినందుకు క్షమించాల్సిందిగా కోరిన సురేష్ చక్రవర్తి ఆ తర్వాత ఒకరి క్యారెక్టర్‌ను ఎవరూ నిర్ణయించకూడదని చెప్పారు. అయితే తన వైపు నుంచి కూడా వినాలని కమల్‌ను కోరగా ఈ సమస్యను ఇంకా పెద్దది చేయొద్దంటూ సున్నితంగా వారించారు. ఆ తర్వాత సురేష్‌కు అనిత షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు.

  ఇక చివరిగా కమల్ హాసన్ సీనియర్ నటి మనోరమకు తన ఐదవ వర్ధంతి సందర్భంగా ఘన నివాళుతు అర్పించి ఆ ఎపిసోడ్‌కు ముగింపు పలికారు. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే మనోరమ తెలుసునని ఈ సందర్భంగా కమల్‌ హాసన్ చెప్పారు. అంతేకాదు ఆమె నటనా నైపుణ్యతను కొనియాడారు.

  English summary
  The first weekend episode of Bigg Boss Tamil Season 4 premiered on October 10 with many interesting and funny moments. Kamal Haasan paid tribute to legendary actress Manorama on her fifth death anniversary.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X