• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Bigg Boss Telugu:మోనాల్ -అఖిల్ అతి ఎక్కువైంది.. కుమార్ సాయి ఎలిమినేషన్ సరికాదు: వివాదం

|

హైదరాబాదు: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ కార్యక్రమం పై తెలుగు రాష్ట్రాల ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో బిగ్‌బాస్‌పై వారు పెడుతున్న పోస్టులు చూసిన వారికెవరికైనా ఈ విషయం అర్థం అవుతుంది. మొదటి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియపై చాలా అనుమానాలు ప్రజలకు ఉన్నాయి. ఈ సారి అంటే ఆరోవారం ఎలిమినేషన్ పై కూడా ప్రేక్షకులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇక బిగ్‌బాస్ ఇష్టం వచ్చిన వారిని ఎలిమినేట్ చేసేలా ఉంటే ఇక ప్రేక్షకులను ఓట్లు వేయమనడం దేనికంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. తాజాగా కుమార్ సాయి ఎలిమినేషన్‌లో కూడా ఇదే జరిగిందంటూ ప్రేక్షకులు నెట్టిల్లు వేదికగా ఫైర్ అవుతున్నారు.

 మోనాల్‌కు అఖిల్‌కే ఎక్కువగా స్క్రీన్ స్పేస్ ఎందుకు

మోనాల్‌కు అఖిల్‌కే ఎక్కువగా స్క్రీన్ స్పేస్ ఎందుకు

బిగ్‌బాస్ హౌజ్ క్రమంగా రక్తి కడుతోంది. అయితే మోనాల్-అఖిల్-అభిజీత్‌ల ట్రయాంగిల్ లవ్‌స్టోరీతోనే ఇది ఎక్కువగా రక్తి కడుతోందనేది సుస్పష్టం. అంతేకాదు చీమ చిటుక్కుమన్న బిగ్‌బాస్ షో నిర్వాహకులు అది స్క్రీన్‌పై చూపిస్తారో లేదో కానీ... 24 గంటలు మోనాల్ అఖిల్‌లు ఏం చేస్తున్నారనేదానిపై మాత్రం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అంతేకాదు వీరికే ఎక్కువగా స్క్రీన్ స్పేస్ ఇవ్వడం ప్రతి రోజు జరిగే ఎపిసోడ్‌లో చూస్తున్నాం. ఇదే విషయాన్ని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు కూడా చెబుతున్నారు. తాజాగా బిగ్ బాస్ హౌజ్‌లో కుమార్ సాయి ఎలిమినేషన్ పై కూడా చాలా మంది నెటిజెన్లు స్పందించారు. మోనాల్ గజ్జర్ కుమార్ సాయిలను ప్యాక్ చేసుకోమన్న నాగార్జున, మోనాల్‌ను మాత్రం మళ్లీ సేవ్ చేసి కుమార్ సాయిని ఎలిమినేట్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. నాగార్జున మోనాల్‌ను కూడా లగేజీ సర్దేసుకోమని చెప్పడంతో చాలామంది ప్రేక్షకులు ఈ ఉత్తరాది భామ ఇళ్లు వీడుతుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. అయితే చివరకు కుమార్ సాయి ఎలిమినేట్ కావడం వారిని ఒక్కింత అసంతృప్తికి గురిచేసిందనే చెప్పాలి.

ఇంతమాత్రానికి ఓట్లు ఎందుకు.. ప్రేక్షకులెందుకు

ఇంతమాత్రానికి ఓట్లు ఎందుకు.. ప్రేక్షకులెందుకు

కుమార్ సాయి నిజాయితీగా షో ఆడాడు అనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు ప్రేక్షకులు. ఏదైనా సరే నిర్మొహమాటంగా, నిరభ్యంతరంగా కుమార్ సాయి చెబుతారంటూ అలాంటప్పుడు కుమార్ సాయిని ఎలిమినేట్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇంతమాత్రానికి ఓట్లు ఎందుకు ప్రేక్షకులను పిచ్చి వాళ్లను చేయడమెందుకని అంటున్నారు. ఇప్పటివరకు దేవీ నాగవల్లి విషయంలో కూడా ఇదే జరిగింది. డ్రామా పండించే వారే బిగ్‌బాస్‌కు కావాలని, నిజాయితీగా గేమ్ ఆడే వారికి ఆ హౌజ్‌లో చోటు లేదని మరోసారి కుమార్ సాయి ఎలిమినేషన్‌తో రుజువైందని చెబుతున్నారు.

మోనాల్ అఖిల్ అతి ఎక్కువైందా..

మోనాల్ అఖిల్ అతి ఎక్కువైందా..

ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో మోనాల్‌ కూడా లగేజీ ప్యాకప్ చేసుకుని కన్ఫెషన్ రూం ఉండాలని బిగ్‌బాస్ చెప్పడంతో.. మోనాల్ అక్కడే ఉంది. ఇక కుమార్ సాయి ఎలిమినేషన్ తర్వాత మెల్లగా తిరిగి ఇంట్లోకి అడుగుపెట్టిన మోనాల్‌ను చూసి ఇంటిసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అఖిల్ మోనాల్ హగ్ చేసుకున్న సన్నివేశం శృతి మించిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరి మధ్య అతి ఎక్కువగా కనిపించిందని చెబుతున్నారు. అది బిగ్‌ బాస్ షో నా లేక కౌగిలింతల షోనా అన్నట్లుగా ఉందని నెటిజెన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు బిగ్‌బాస్ కూడా వీరిద్దరికి ఎక్కువ సీన్‌తో పాటు స్క్రీన్ స్పేస్ కూడా ఇస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. గేమ్ అనేది ఒకటుందని మరిచిపోయి హద్దులు దాటారని నెట్టింట్లో కామెంట్స్ పేలాయి. ఇక ఎంతసేపు మోనాల్ ఓవరాక్షనే చూపిస్తున్నారు కాబట్టి ఛానెల్ మార్చేస్తున్నామంటూ మరికొందరు పోస్టులు పెట్టారు. అయితే మోనాల్‌ను ఎంత తొందరగా బయటకు పంపితే షోకు అంత క్రేజ్ వస్తుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి బిగ్‌బాస్ హౌజ్ ఎలిమినేషన్ ప్రక్రియ వివాదాస్పదంగా కొనసాగుతూనే ఉంది. ఇలానే కొనసాగితే ప్రేక్షకుల్లో షో పై విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంది.

English summary
Bigg Boss show was once again criticised for its elimination process. Kumar Sai who looked strong was eliminated instead of Monal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X