Big Boss Telugu:సాక్షి దీక్షిత్‌లా తయారవుతున్నారా.. ఆమెలానే వెళ్లిపోతారు: నాగార్జున వార్నింగ్
హైదరాబాద్: టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో క్రమంగా రక్తి కడుతోంది. ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న ఆసక్తికన్నా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బయటకు వచ్చి వివరిస్తున్న వాస్తవాలపైనే ప్రేక్షకులు ఫోకస్ చేశారు. వారు బయటకు వచ్చి పలు మీడియా ఛానెల్స్‌కు పలు యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇస్తున్న ఇంటర్వ్యూలను బిగ్ బాస్ షోను ఫాలో అవుతున్న వారు ఎట్టి పరిస్థితుల్లోను మిస్ కావడం లేదు. అలాంటి వారి కోసమే లేటెస్ట్గా ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ చెప్పిన కొన్ని వివరాలు.

వేగంగా ఎలిమినేట్ అయిన స్వాతి
బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టే వరకు తెలుగు ప్రేక్షకులకు స్వాతి దీక్షిత్ అంటే ఎవరో తెలియదు. అల్లరి నరేష్ చిత్రం జంప్ జిలానీలో నటించిన సాక్షి దీక్షిత్ నటనా పరంగా భేష్ అనిపించుకున్నప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదు. బిగ్ బాస్ పుణ్యమా అంటూ తెలుగు ప్రేక్షకుల నోళ్లల్లో ఆమె పేరు నానింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎంటర్ అయిన ఈ ముద్దుగుమ్మ చాలా వేగంగా ఎలిమినేట్ అయ్యింది. అయితే ఎలిమినేషన్ ప్రక్రియ గురించి ఇతర అంశాల గురించి ఆమె కొన్ని వాస్తవాలను బయటపెట్టారు. మూడో వారంలో హౌజ్‌లోకి ఎంటర్ అయిన స్వాతి.. నాలుగోవారంలో ఎలిమినేషన్ నామినేషన్లోకి వచ్చేసింది. ఆమెను అమ్మా రాజశేఖర్ నామినేట్ చేశాడు. అయితే విధి ఆమెపై కరుణ చూపలేదు. వెంటనే ఎలిమినేట్ అయి బయటకు రావాల్సి వచ్చింది.

నిర్వాహకుల ఇష్టం మేరకే ఎలిమినేషన్
అయితే ఎలిమినేషన్ ప్రక్రియపై మాత్రం ప్రేక్షకులకు ఒక క్లారిటీ లేదు. ఈ సారి ఒకరు ఎలిమినేట్ అవుతారని చాలామంది అంచనా వేస్తుండగా వారి అంచనాలకు భిన్నంగా మరొకరు ఎలిమినేట్ అవుతుండటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇందుకు కారణం, దేవీ నాగవల్లి, మరియు స్వాతి దీక్షిత్‌ల ఎలిమినేషన్. ప్రేక్షకుల ఓటింగ్‌ను పరిగణలోకి తీసుకోకుండానే షో నిర్వాహకులు తమ ఇష్టం మేరకు ఎలిమినేట్ చేస్తున్నారనే అపవాదు ఉంది. దీంతో ఓటింగ్ ప్రక్రియ మరోసారి సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. అయితే ఓటింగ్ ప్రక్రియపై కూడా స్వాతి దీక్షిత్ నెటిజెన్ల వాదనతోనే ఏకీభవిస్తోంది.

నాగార్జున మాటలపై అసంతృప్తి
ఎవరైతే ప్రేక్షకులను ఎంటర్టెయిన్ చేస్తారో.. వారిని ప్రేక్షకులు ఆదరిస్తారని అదే ఎంటర్టెయిన్మెంట్ చేయలేకపోతే ఇలా స్వాతిని ఎలిమినేట్ చేసినట్లుగా చేస్తారని నాగార్జున చెప్పిన మాటలపై స్వాతి దీక్షిత్ అసహనం వ్యక్తం చేసింది. గత సీజన్లో నాగార్జున ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడలేదని స్వాతి చెప్పుకొచ్చింది. నేను హౌజ్‌లో ఉండేందుకు చేయాల్సిన ప్రయత్నం చేయకపోయి ఉండి ఉంటే నాగార్జున మాటలను స్వీకరించేదాన్నని స్వాతి చెప్పుకొచ్చింది. ఇంటిలో ఉండేందుకు ప్రయత్నం చేసినప్పటికీ నాగార్జున ఇలా మాట్లాడటం సరికాదని స్వాతి వెల్లడించింది. ఇదిలా ఉంటే తాను హౌజ్‌లో ఉండి ఎంటర్టెయిన్ చేసినదంతా బిగ్ బాస్ నిర్వాహకులు ఎడిటింగ్‌లో తీసేశారని దాన్ని టెలికాస్ట్ చేయలేదని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. తాను చేసిన ప్రయత్నంలో కనీసం 5శాతం టెలికాస్ట్ చేసినా తాను చాలా సంతోషంగా ఉండేదాన్నంటూ చెప్పిన స్వాతి.. షో నిర్వాహకులపైనే అనుమానం వ్యక్తం చేస్తూ బిగ్ బాంబ్ వేసింది,

నా ఫుటేజీలను టెలికాస్ట్ చేయలేదు
షో నిర్వాహకులు తనకు స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదని తన ఫుటేజీలను టెలికాస్ట్ చేయకుండా.. డిలీట్ చేసి తాను ఆట సరిగ్గా ఆడలేదనే నింద తనపై వేయడం భావ్యం కాదని స్వాతి దీక్షిత్ చెప్పుకొచ్చింది. తాను ఆడుతున్న గేమ్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు చెప్పిన స్వాతి దీక్షిత్... తాను అంత త్వరగా ఎలిమినేట్ అవుతానని ఎప్పుడూ భావించలేదని చెప్పుకొచ్చింది. ఓటింగ్ ప్రక్రియ ద్వారా తాను ఎలిమినేట్ కాలేదని అందుకే బాధపడాల్సిన పనిలేదని చెప్పుకొచ్చింది స్వాతి.తనను ఎలిమినేట్ చేసేందుకు షో నిర్వాహకులే ఏదో కుట్ర చేశారని ఆరోపణలు చేసింది.

ఎలిమినేషన్ ఓటింగ్‌లపై ...
ఇదిలా ఉంటే ఓటింగ్ ప్రక్రియ, ఎలిమినేషన్ ప్రక్రియ గురించి స్వాతి ఒక్కరే మాట్లాడలేదు. అంతకు ముందు ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణి కూడా ఓటింగ్, ఎలిమినేషన్ ప్రక్రియ పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక అన్ని టాస్కులు ప్రేక్షకులకు చూపడం లేదని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ దేవీ నాగవల్లి కూడా ఆరోపణలు చేశారు.అయితే షో నిర్వాహకులపై మాత్రం ఎలాంటి ఆరోపణలు లేదా నిందలు వేయలేదు. మొత్తానికి ఈ షోలో రాను రాను ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే.