వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క రూపాయికి వందేళ్ళు: 125 డిజైన్ల మార్పు, నిలిచిపోయిన ముద్రణ

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఒక్క రూపాయి నోటుకు వందేళ్ళు పూర్తైంది.1917 నవంబర్ 30వ, తేదిన తొలిసారి ఒక్క రూపాయి నోటును ముద్రించారు.ఇండియా కరెన్సీలో వచ్చిన మొట్ట మొదటి నోటు ఒక్క రూపాయి .1970 వరకు ఐదు దేశాల్లో ఈ నోటు చలామణిలో ఉంది. మన రూపాయి నోటును చూసే ప్రెంచ్ రూపీ వచ్చింది.

ప్రస్తుతం రూపాయికి విలువ లేకుండా పోయింది. వేల రూపాయాల కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చాయి. దీంతో ఒక్క రూపాయంటే కొంత తక్కువ చేసి చూస్తున్న పరిస్థితులు కూడ ఉన్నాయి.

కానీ, 1970 వరకు ఒక్క రూపాయికి మంచి విలువ ఉంది. మన రూపాయిని చూసే ఇతర దేశాలు కూడ రూపాయి ముద్రణను ప్రారంభించారంటే అతిశయోక్తి కాదు. మొత్తానికి రూపాయి నోటు తొలుత మాత్రం ఇండియాలో ముద్రణకు నోచుకోలేదు.

రూపాయి నోటుకు వందేళ్ళు

రూపాయి నోటుకు వందేళ్ళు

1917 నవంబరు 30వ, తేదిన ఇండియా కరెన్సీ ఒక రూపాయి నోటు ముద్రించారు. మనం ఉపయోగిస్తున్న వంద రూపాయాల నోటు పుట్టి వందేళ్ళు దాటింది. ! భారతీయ కరెన్సీలో తొలిసారిగా వచ్చిన నోటు ఇదే. ఇంగ్లాండ్‌లో ఈ నోటును తొలిసారిగా ముద్రించారు.

ఒక్క రూపాయి నోటు ఇంగ్లాండ్‌లో ప్రింట్

ఒక్క రూపాయి నోటు ఇంగ్లాండ్‌లో ప్రింట్

1917 నవంబరు 30న తొలిసారిగా రూపాయి నోటు తీసుకొచ్చారు. అయితే తొలిసారిగా ఈ నోటును ఇంగ్లాండ్‌లో ప్రింట్ చేశారు. ఆ నోటుపై ఒక వైపున ఐదో కింగ్‌ జార్జ్‌ ఫొటో ఉండేది. తొలి రూపాయి నోటుపై ఎంఎంఎస్‌ గుబ్బే, ఏసీ మాక్‌వాట్టర్స్‌, హెచ్‌ డెన్నింగ్‌ అనే ముగ్గురు బ్రిటన్‌ ఆర్థిక కార్యదర్శుల సంతకాలు ఉండేవి. తెలుగు, ఉర్దూ సహా మొత్తం 8 భాషల్లో ‘ఒక రూపాయి' అని నోటుకు మరోవైపు ముద్రించేవారు. ఖర్చు పెరగడంతో 1926లో రూపాయి నోటు ముద్రణను ఆపేసింది బ్రిటీష్‌ ప్రభుత్వం.

ఐదు దేశాల్లో చలామణి

ఐదు దేశాల్లో చలామణి

ఒక్క రూపాయి నోటును ఇండియాతో పాటు మరో దేశాల్లో 1970 వరకు చలామణిలో ఉండేది.దుబాయ్‌, బెహరయిన్‌, మస్కట్‌, ఒమన్‌, ఇరాన్‌లోనూ చలామణి అయ్యేది.
ఇండియా రూపాయి నోటు ఆధారంగానే 1919లో ఫ్రెంచ్‌ రూపీ వచ్చింది.అయితే ఇంగ్లాండ్‌లో ఈ రూపాయిని ముద్రించేవారు. అయితే 1926 లో ఇంగ్లాండ్‌ నోటు ముద్రణను నిలిపివేసింది. అయితే 1949 నుంచి రూపాయికి భారతీయత వచ్చింది.

1940లో ఒక్క రూపాయి నోటు ముద్రణ

1940లో ఒక్క రూపాయి నోటు ముద్రణ

1926లో ఇంగ్లాండ్ ఒక్క రూపాయి నోటు ముద్రణను నిలిపివేసింది. 1940లో తిరిగి ఇండియాలో ఒక్క రూపాయి ముద్రణను ప్రారంభించింది.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఒక రూపాయి నోటు ముద్రణ కొనసాగించింది. రిజర్వ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో కాకుండా కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో దీనిని మింట్‌లలో ముద్రించేవారు. దానిపై కేంద్రప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి సంతకం ఉండేది..

వందేళ్ళలో 125 రకాల డిజైన్లు

వందేళ్ళలో 125 రకాల డిజైన్లు

1940లో ఒక్క రూపాయి తిరిగి ముద్రణ మొదలైంది. 1949లో కింగ్‌జార్జ్‌ ఫొటో తొలగించి సారనాథ్‌లోని సింహం బొమ్మను అచ్చువేశారు. అలాగే 1917 నుంచి ఈ వందేళ్ల కాలంలో 28 డిజైన్లలో 125 రకాలుగా రూపాయి నోటు వచ్చింది.

ఖర్చు కారణంగా ముద్రణ నిలిపివేత

ఖర్చు కారణంగా ముద్రణ నిలిపివేత

ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రూపాయి నోటు ముద్రణ పలుమార్లు ఆగిపోయింది.. రూపాయి నోటు ముద్రణకు ఒక రూపాయి 48 పైసలు ఖర్చు అవుతోంది. 1994లో ముద్రణ ఆపేశారు. ఖర్చు ఒక రూపాయి 17 పైసలకు చేరుకున్న తర్వాత తిరిగి ముద్రణ మొదలుపెట్టారు. ఒకానొక దశలో రూపాయి నోటు ముద్రణకు 78 పైసలే ఖర్చు అయ్యింది. 2015లో మరోసారి రూపాయి నోటును ముద్రించింది కేంద్రప్రభుత్వం.

పాత నోట్ల కోసం లక్షల ఖర్చు

పాత నోట్ల కోసం లక్షల ఖర్చు

చాలా మందికి పాతనోట్లను దాచుకునే అలవాటు ఉంటుంది. 1985లో వచ్చిన ఒక రూపాయి నోటును రూ.2.75 లక్షలకు సొంతం చేసుకున్నారు. మరికొందరైతే ఒక రూపాయి నోట్లు ఉన్న వందకట్ట కోసం రూ. 15వేలు కూడా చెల్లించారు. 2017 జనవరి 21న ఒక రూపాయి నోటును వేలం వేయగా రూ. 2.27 లక్షలు పలికింది. 2017, ఏప్రిల్‌ ఒకటిన రూ.1.5 లక్షలకు, 2009 అక్టోబరులో రూ.1.3 లక్షలకు సొంతం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

English summary
Sometime during the World War I, colonial authorities were unable to mint coins and had to print the one rupee note instead.The first note was printed in 1917 on nov 30. and had the image of King George V
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X