• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షారుఖ్ ఖాన్ టీమ్‌కు మాత్రమే: స్పెషల్ ట్రీట్‌మెంట్: బుర్జ్ ఖలీఫాపై కేకేఆర్‌కు గ్రాండ్ వెల్‌కమ్

|

దుబాయ్: కోల్‌కత నైట్ రైడర్స్.. ఐపీఎల్-2020 టైటిల్ హాట్ ఫేవరెట్లలో ఒకటి. టైటిల్‌ను ఎగరేసుకుని వెళ్లే సత్తా ఉన్న జట్లలో ఫ్రంట్ రన్నర్. దినేష్ కార్తీక్ కేప్టెన్సీలో ఉన్న ఈ టీమ్.. ఫ్రాంఛైజీ ఎవరో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు చెందిన టీమ్ ఇది. ఐపీఎల్-2020 13వ ఎడిషన్‌లో తన తొలి మ్యాచ్‌ను ఆడబోతోంది. ఇప్పటికే ఓ మ్యాచ్‌లో ఓటమిని చవి చూసిన ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్యాపిటల్ సిటీ అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ఈ మ్యాచ్ బుధవారం సాయంత్రం 7:30 గంటలకు ఆరంభం కాబోతోంది.

వివాదంలో ధోనీ భార్య సాక్షి: భర్తకు సపోర్ట్: అంపైర్లపై ఫైర్: టెక్నాలజీని సరిగ్గా వాడుకోవాలట

బుర్జ్ ఖలీఫాపై కేకేఆర్ మిరుమిట్లు..

తన తొలి మ్యాచ్‌ను ఆడబోతోన్న కోల్‌కత నైట్ రైడర్స్‌కు ఘన స్వాగతం లభించింది. ఎవరూ ఊహించని గ్రాండ్ వెల్‌కమ్ అది. ఇప్పటిదాకా ఏ ఐపీఎల్ టీమ్‌కూ ఆ స్థాయి ఘనస్వాగతం దక్కలేదు. ఒక్క కేకేఆర్‌కు మాత్రమే ఆ ట్రీట్‌మెంట్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్ బుర్జ్ ఖలీఫాపై కోల్‌కత నైట్ రైడర్స్ ఎల్ఈడీ థీమ్ షోను ప్రదర్శించారు. సుమారు 20 నిమిషాల పాటు ఈ థీమ్ షో కొనసాగింది. కోల్‌కత నైట్ రైడర్స్ లోగో, టీమ్ మెంబర్స్ లను ఎల్ఈడీ డిస్‌ప్లే ద్వారా బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శిచారు. గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఈ థీమ్ షోను ప్రదర్శించారు.

కోల్‌కత టీమ్‌కే ఎందుకంటే..?

ఒక్క కోల్‌కత నైట్ రైడర్స్ టీమ్‌కు మాత్రమే ఈ అవకాశం దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కారణం.. ఇది షారుఖ్ ఖాన్ ఫ్రాంఛైజీ కావడమే. బుర్జ్ ఖలీఫాకు షారుఖ్ ఖాన్‌కు ఉన్న అనుబంధం అలాంటిది మరి. గత ఏడాది షారుఖ్ 54వ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ బుర్జ్ ఖలీఫాపై ఎల్ఈడీ డిస్‌ప్లే ఏర్పాటు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. `హ్యాపీ బర్త్‌డే టు కింగ్ ఆఫ్ బాలీవుడ్.. షారుఖ్ ఖాన్` అనే అక్షరాలను అప్పట్లో ఈ టవర్‌పై ప్రదర్శించారు. ఆయన నటించిన ఓం శాంతి ఓం మూవీలోని ఓ పాటనూ అక్కడ వినిపించారు.

షారుఖ్‌కు అనుబంధమేంటీ?

షారుఖ్‌కు అనుబంధమేంటీ?

షారుఖ్ ఖాన్‌కు ఈ స్థాయిలో ఎందుకు ప్రాాధాన్యత లభిస్తోందనడానికీ కారణం ఉంది. దుబాయ్ పర్యాటక రంగానికి షారుఖ్.. బ్రాండ్ అంబాసిడర్ కావడమే. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షంచడానికి దుబాయ్ ప్రభుత్వం.. ఆయనను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ కారణం వల్లే.. తమ బ్రాండ్ అంబాసిడర్‌కు చెందిన ఐపీఎల్ టీమ్‌కు బుర్జ్ ఖలీఫా నిర్వాహకులు ఇలా గ్రాండ్‌గా స్వాగతం పలికారు. ఐపీఎల్‌లో విజేతగా నిలవాలనీ అకాంక్షించారు. ఈ ఏడాది టైటిల్ కేకేఆర్‌కే దక్కుతుందని ఆశిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే దుబాయ్ క్రికెట్ ప్రియులు కోల్‌కత నైట్ రైడర్స్‌ను తమ సొంత జట్టుగా భావిస్తున్నారు.

  India-China Stand Off : China తో 14 గం. చర్చలు విఫలం..త్వరలోనే మరోసారి మిలటరీ స్థాయి చర్చలు!
  జట్టు ఎలా ఆడబోతోందో మరి..

  జట్టు ఎలా ఆడబోతోందో మరి..

  దినేష్ కార్తీక్ సారథ్యంలోని కోల్‌కత నైట్ రైడర్స్ ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆండీ రస్సెల్, ఇవాన్ మోర్గాన్, శుభ్‌మన్ గిల్, సునీల్ నరైన్, కుల్‌దీప్ యాదవ్, లోకీ ఫెర్గూసన్, పాట్ కమ్మిన్స్, టామ్ బ్యాటన్ వంటి హేమాహేమీలతో నిండివున్న జట్టు ఇది. అరివీర భయంకరంగా ఆడగల బ్యాట్స్‌మెన్లు బౌలర్లతో బ్యాలెన్స్డ్‌గా కనిపిస్తోంది. ఆండీ రస్సెల్.. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగలడు. ఇదివరకు కొన్ని మ్యాచుల్లో ఇది రుజువైంది కూడా. దినేష్ కార్తీక్ మామూలోడు కాదు. ఇవాన్ మోర్గాన్ గురించీ తెలియనిది కాదు. ఆల్‌రౌండర్ ప్యాట్ కమ్మిన్స్ క్రీజులో కుదురుకుంటే చుక్కలే.

  English summary
  Burj Khalifa welcomes Shahrukh’s Indian Premier League (IPL) team Kolkata Knight Riders with LED display. It is first time in IPL history any team welcome at World's tollest tower.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X