• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

2018లో బడ్జెట్: ద్రవ్యలోటు నుంచి ద్రవ్యోల్బణం వరకు.. క్యాడ్ టూ ద్రవ్య నియంత్రణ కీలకం

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి వచ్చేనెల ఒకటో తేదీన వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో సమర్పిస్తారు. ప్రతియేటా 20 వృత్తులు, సామాజిక అంశాలపై బడ్జెట్ ప్రభావితం చేస్తుంది. వాటిల్లో ముఖ్యమైంది ద్రవ్యలోటు. దీంతోపాటు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ), కరంట్ ఖాతా లోటు (సీఏడీ), పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నుల బోర్డు (డీటీసీ) నుంచి ద్రవ్యోల్బణం వరకు వివిధ రంగాలపై దాని ప్రభావం ఎలా ఉంటుందోనన్న అంశాలను పరిశీలనకు వస్తాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ గురించి కొన్ని అంశాలను పరిశీలిద్దాం.

ద్రవ్యలోటు కీలకం ఇలా

బడ్జెట్‌ను ప్రభావితం చేసే అంశాల్లో ద్రవ్యలోటు ప్రధానంగా ఉంటుంది. జీఎస్టీ అమలు, నోట్ల రద్దు తదితర అంశాల పరిణామాల నేపథ్యంలో ద్రవ్యలోటుపై వచ్చే బడ్జెట్‌పై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. ప్రధానంగా ద్రవ్యలోటు ప్రభుత్వానికి ఒక ఆర్థిక సంవత్సర కాలంలో వచ్చే ఆదాయం నుంచి చేసే ఖర్చు మించితే ద్రవ్యలోటుగా పరిగణిస్తారు.

స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)

స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అన్నది దేశ ప్రగతి ఎలా సాగుతున్నదో తెలియజేసే గణాంకం. ఇది వస్తు, సేవల రూపేణా ప్రభుత్వానికి త్రైమాసికంగా, వార్షికంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం విలువు. ఇది సాధారణంగా దేశ ఆర్థిక ప్రగతికి సంకేతం (సూచీ)గా ఉంటుంది. 2016లో రూ.1000, రూ.500 నోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం 2017 జూలైలో ఆదరాబాదరాగా జీఎస్టీని అమలులోకి తేవడంతో జీడీపీ తగ్గుముఖం పట్టిందని వార్తలొచ్చాయి. అదే జరిగితే వివిధ మార్గాల్లో రుణాల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

20 Jargons Used in Budget Every Year and What They Mean

కరంట్ ఖాతా లోటు (క్యాడ్)

కరంట్ ఖాతా లోటు (క్యాడ్) వాణిజ్య లోటును సూచిస్తుంది. ఇది దేశ దిగుమతులు, ఎగుమతులపై ఆధారపడి ఉంటుంది. మనదేశ ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉంటే క్యాడ్ పెరుగుతుంది. మనదేశీయ ఇంధన అవసరాలు ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతుల ద్వారా తీర్చుకుంటున్నాం. ఇక ప్రపంచంలోకెల్లా అత్యధికంగా పసిడి దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా తర్వాత మనదే. అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల నిర్వహణలో అమెరికా డాలర్ తర్వాతీ స్థానం పసిడిది. దీని ధర అంతర్జాతీయ మార్కెట్ లో బాగానే ఉంటుంది. కనుక దేశీయ ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉంటాయి గనుక క్యాడ్ ఖచ్చితంగా ఉంటుంది. దీని స్థాయి పెరుగుతున్నా కొద్దీ అంతర్జాతీయంగా వాణిజ్యపరంగా ఇబ్బందులు తలెత్తుతాయి.

ద్రవ్య నియంత్రణ

ద్రవ్య నియంత్రణ అన్నది ప్రభుత్వ విధానాలు, వాటి అమలుకు గల పరిమితులు.. ప్రభుత్వ ఖజానాలో ద్రవ్య పరిస్థితులను తెలియజేస్తాయి. ప్రభుత్వం వివిధ పథకాల అమలు కోసం తీసుకునే రుణాలను తగ్గించుకుంటే ఆరోగ్యకరమైన ద్రవ్య నియంత్రణ కలిగి ఉన్నట్లు భావించాలి. లేదంటే రిస్కులను ఎదుర్కోవాల్సిందే. అయితే 1991లో ఆర్థిక సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత క్రమంగా ద్రవ్య నియంత్రణ చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ పేరుతో సామాజిక రంగానికి ఇస్తున్న రాయితీలను క్రమంగా సర్కార్ ఎత్తేస్తుందన్నమాట.

పరోక్ష పన్ను

వస్తు, సేవలపై వసూలు చేసే పన్నులే పరోక్ష పన్నులు. ఒకరిపై పన్ను విధిస్తే మరొకరు చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు ప్రస్తుతం దేశంలో అమలవుతున్న జీఎస్టీ విధానమే ఉదాహరణ.

ప్రత్యక్ష పన్ను

పౌరులు గానీ, సంస్థలుగానీ నేరుగా చెల్లించే పన్నును ప్రత్యక్ష పన్నుగా పరిగణిస్తారు. ఉదాహరణకు ఆదాయం పన్ను.

ప్రత్యక్ష పన్నుల విధానం (డీటీసీ)

ప్రత్యక్ష పన్నుల విధానం (డీటీసీ) అంటేనే ప్రత్యక్ష పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేసే ప్రయత్నం. పన్ను ఎగవేతల నివారణకు మినహాయింపులు, వివిధ మార్గాల్లో డిడక్షన్లు అనుమతినిస్తూ డీటీసీ చర్యలు తీసుకుంటూ ఉంటుంది.

పెట్టుబడి లాభాల పన్ను

వివిధ సంస్థల్లో పెట్టిన పెట్టుబడిపై వచ్చే లాభాల ఆధారంగా విధించే పన్ను పెట్టుబడి లాభాల పన్ను అంటారు. ఇది ఒక ఉత్పత్తి, సంస్థ విక్రయాన్ని బట్టి నిర్ణయం అవుతుంది.

ద్రవ్య విధానం

ద్రవ్యవిధానాన్నిభారతీయ రిజర్వుబ్యాంక్ (ఆర్బీఐ) ఖరారు చేస్తుంది. ద్రవ్యోల్బణం నియంత్రణతోపాటు దేశంలోని వివిధ బ్యాంకులు డిపాజిట్లు, రుణాల మంజూరునకు వసూలుచేసే వడ్డీరేట్లను నిర్దేశిస్తుంది.

ఆర్థిక విధానం

ప్రభుత్వ ఆదాయం, ఖర్చులు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. దీని ఆధారంగానే ఆర్థిక విధానం ఖరారవుతుంది. ఈ ఆర్థిక విధానానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకుంటుంది.

ఆర్థిక సంవత్సరం

ఆర్థిక సంవత్సరం అనేది ఒక ఏడాది కాలం. ఒక సంస్థ, వ్యక్తి, ప్రభుత్వం ఆర్థిక ప్రగతిపై గణాంకాల తయారు చేయడానికి నిర్దేశిత సమయం. మనదేశంలో ప్రస్తుతం ఏప్రిల్ నుంచి మరుసటి ఏడాది మార్చి వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తున్నాం. అందుకోసమే ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తే మార్చి నెలాఖరులోగా పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించి రాష్ట్రపతికి సిఫారసు చేస్తాయి. రాష్ట్రపతి ఆమోదంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. అమెరికాలో మాదిరిగా దీన్ని జనవరి నుంచి డిసెంబర్ కు మార్చాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి.

టోకు ధరల సూచీ (ద్రవ్యోల్బణం)

టోకు ధరల సూచీ అంటేనే ద్రవ్యోల్బణం. రోజువారీగా టోకు మార్కెట్లలో వస్తువుల ధరల్లో మార్పు ఆధారంగా దీన్ని ఖరారు చేస్తారు.

వినియోగ ధరల సూచీ (చిల్లర ద్రవ్యోల్బణం)

వినియోగ ధరల సూచీ (సీపీఐ)ని కూడా ప్రధానంగా వస్తువుల ధరల ఆధారంగా నిర్ణయిస్తారు. రోజువారీగా ఇండ్లలో వాడే వస్తు, సేవల ధరల్లో మార్పు ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు.

ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నియంత్రణ చట్టం

మనదేశంలో ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నియంత్రణ చట్టం 2003లో అమలులోకి వచ్చింది. రెవెన్యూ, ద్రవ్యలోటు మధ్య అంతరాయాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆర్థిక నిఘా ద్వారా బడ్జెట్‌లో సమతుల్యతను పాటిస్తారు.

డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్

ఒక కంపెనీ తన వాటాదారులకు చెల్లించే డివిడెండ్ పై విధించే పన్ను'డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్'. ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం వచ్చేనెల ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

వెంచర్ క్యాపిటల్ ఫండ్స్

సంప్రదాయంగా గ్రూపు సంస్థలు, సాధారణ సంస్థల్లో పెట్టే పెట్టుబడుల కంటే స్టార్టప్‌ల్లో పెట్టుబడులను 'వెంచర్ కాపిటల్ ఫండ్స్' అని చెప్తారు. భారతదేశంలో స్టార్టప్ కల్చర్ పెరిగినా కొద్దీ వెంచర్ కేపిటల్ కూడా పెరుగుతాయి.

సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను

సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను ప్రధానంగా గుర్తింపు పొందిన అన్ని స్టాక్ ఎక్స్చేంజీల్లో (వస్తు, ద్రవ్య రూపేణా) లావాదేవీలపై విధించే పన్ను అని అంటారు.

పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఆదాయ మార్గం

కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఆదాయం సంపాదించేందుకు ఉన్న మార్గాల్లో ఉత్తమమైంది పెట్టుబడుల ఉపసంహరణ. 1980వ దశకం వరకు దేశీయంగా ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసిన కేంద్రమే.. మిశ్రమ ఆర్థిక విధానం నుంచి వెనక్కు మళ్లి పెట్టుబడి ఆధారిత విధానాల దిశగా అడుగేయడంతోనే ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ రంగ సంస్థల్ల్లో ప్రభుత్వ వాటాల ఉపసంహరణకు చర్యలు తీసుకుంటుంది. ఉదాహరణకు హెచ్ఎంటీ, ఎల్ఐసీ, భెల్, తదితర సంస్థల్లో క్రమంగా ప్రభుత్వ వాటా ఉపసంహరించి ప్రైవేటీకరించాలన్నది ప్రభుత్వ ఎత్తు. దీని ద్వారా వచ్చే ఆదాయం తనకు అవసరమైన రంగాల్లో ప్రభుత్వం ఖర్చు చేసే వెసులుబాటు ఉంటుంది.

పన్నుల శ్లాబ్ ఇలా

పన్నుల శ్లాబ్‌లు ఒక వ్యక్తి గానీ, అవిభక్త భారతీయ కుటుంబం చెల్లించాల్సిన ఆదాయం పన్ను గణాంకాల్లో తేడాను నిర్దేశిస్తాయి. దీంతోపాటు అంతర్జాతీయంగా వివిధ సంస్థల, వ్యక్తుల ఆస్తుల ధరల లావాదేవీలను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రతిపాదించిన అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ (ఏపీఏ) ద్వారా నిర్దేశిస్తారు.

English summary
Finance Minister Arun Jaitley will present the Union Budget 2018-19 on February 1 around noon. While everyone is speculating about the budget, here's a list of 20 interesting jargons that are used in budget every year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more