వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరు కంపెనీల్లో రూ.52 వేల కోట్లు హుష్ కాకీ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ముంబై: జనం డబ్బుకు ఎక్కడా భద్రతాలేదు.. రియల్‌ రంగం కుదేలైతే.. బ్యాంకుల్లో దాచుకుందామని అనుకున్నా ఎవరు కొల్లగొడతారోనన్న భయం ఖాతాదారులను భయపెడుతున్నది. కనీసం కొన్ని షేర్లు కొందామనుకుంటే.. బడా కంపెనీలే ఊహించని విధంగా పల్టీ కొడుతున్నాయి. దీంతో భవిష్యత్‌ గురించి బెంగపెట్టుకుంటున్న మధ్యతరగతి జనం ఆర్థిక స్థితిపై కోలుకోలేనివిధంగా షేర్‌ మార్కెట్‌ దెబ్బతీస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత వారం రోజులనుంచి మార్కెట్‌లో నెలకొన్న హెచ్చుతగ్గుదలతో ఆరు కంపెనీల్లో పెట్టిన 52వేల కోట్లమేర పెట్టుబడులు నష్టపోయారు.

ఆరు సంస్థల్లో వాటాదారులకు భారీ నష్టం
దేశంలోని టాప్‌ పది కంపెనీలు ఉండగా అందులో ఆరు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వాటాదారులకు భారీగా నష్టం వాటిల్లింది .ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ అన్నింటి కన్నాఎక్కువగా క్షీణించింది.శుక్రవారం వ్యాపారం ముగిసేనాటికి అయిన వ్యాపారంలో రిలయన్స్‌ ఇండిస్టీ, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, ఓఎన్జీసీ, హెచ్‌బీఐకి చెందిన మార్కెట్‌ క్యాప్‌లో తగ్గుదల కనిపించింది. ఐటీసీ, మారుతి సుజుకీ, ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాప్‌లో పెరుగుదల కనిపించింది.

6 of 10 most valued cos lose Rs 520 bn in m-cap, TCS takes Rs 400 bn hit

టాప్‌ లూజర్‌ టీసీఎస్‌
గతవారం జరిగిన లావాదేవీల్లో దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్‌కు ఊహించని షాక్‌ తగిలింది. టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ. 40,008.61 కోట్లు తగ్గి రూ. 54,881.96 కోట్లకు చేరింది. రిలయన్స్‌ ఇండిస్టీ మార్కెట్‌ క్యాప్‌ రూ. 7,316.53కోట్ల నుంచి 5,70,435.32 కోట్లకు.. ఓఎన్జీసీ మార్కెట్‌ క్యాప్‌ రూ.2,887.48 కోట్ల నుంచి 2,27,661.59 కోట్లకు దిగజారింది. హెచ్‌డీఎఫ్‌సీ వ్యాల్యూయేషన్‌ రూ. 989. 48 కోట్లకు తగ్గి రూ. 2,99,893 కోట్లకు సరిపెట్టుకున్నది.

6 of 10 most valued cos lose Rs 520 bn in m-cap, TCS takes Rs 400 bn hit

రూ.474.76 కోట్లు తగ్గిన ఎస్బీఐ
ఎస్పీఐ మార్కెట్‌ క్యాప్‌ రూ.474.76 కోట్ల నుంచి జారి రూ.2,18,045 కోట్లకు చేరింది. హెచ్‌యూఎల్‌ వ్యాల్యూయేషన్‌ రూ. 324.67 కోట్ల నుంచి రూ.2,81,190.10 కోట్లకు దిగజారింది. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.1,987.55 కోట్లనుంచి పెరిగి రూ. 2,56,087.40 కోట్లకు చేరింది. ఐటీసీ మార్కెట్‌ క్యాప్‌ రూ. 1,577.79 నుంచి రూ. 3,17,976.53కోట్లకు ఎగబాకింది.

English summary
The combined market valuation of 6 of the top-10 most valued companies declined by over Rs 520 billion last week, with IT major TCS taking the steepest hit. Reliance Industries Ltd (RIL), TCS, HDFC, HUL, ONGC and SBI saw losses in their market valuation for the week ended Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X