వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొల్ల కంపెనీలే టార్గెట్: ఎనిమిది లక్షల సంస్థలపై ఐటీ ‘ఐ’.. రిటర్న్స్ ఫైల్ చేయకుంటే అంతే

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐటీ రిటర్న్స్ సమర్పించని ఎనిమిది లక్షల కంపెనీల ఆదాయ లావాదేవీలపై ఆదాయం పన్ను శాఖ (ఐటీ) నిఘా కొనసాగుతున్నది. అవి వచ్చే ఏప్రిల్ నెలాఖరులోగా చర్యలు తీసుకోకుంటే సదరు సంస్థలను ప్రాసిక్యూట్ చేసేందుకు ఆదాయం పన్ను శాఖ సిద్ధమైంది. ఇది డొల్ల కంపెనీల భరతం పట్టేందుకేనని తెలుస్తున్నది. రూ.3,000 వరకు పన్ను చెల్లించాల్సి వచ్చే కంపెనీలు ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నులు దాఖలు చేయకుండా ఉన్న మినహాయింపును తొలగించనున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌ 1) నుంచే ఈ మార్పు అమల్లోకి తేవాలన్నది ప్రతిపాదన.
రిటర్న్స్ సమర్పించకపోతే ప్రాసిక్యూషన్‌కు అవకాశం కల్పించే ఐటీ చట్టంలోని నిబంధనకు 2018-19 బడ్జెట్‌ ప్రతిపాదన మరింత పదును పెట్టింది.దీని ప్రకారం, ఏప్రిల్‌ 1న ప్రారంభమయ్యే ఏదేని ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, రిటర్న్స్ గనుక సమర్పించకపోతే, సంబంధిత కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌/డైరెక్టర్‌/నిర్వహణాధికారి అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇకపై ఆదాయపు పన్ను విభాగాలు, ఆయా కంపెనీల పెట్టుబడులను పరిశీలిస్తాయి.

తక్కువ లాభాలు చూపే, తొలిసారి ఫైలింగ్ సంస్థలపై నిశిత పరిశీలన
ఇకపై తక్కువ లాభం చూపుతున్న, తొలిసారిగా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్న కంపెనీలపైనా, నిశిత పరిశీలన జరపాలని నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వద్ద పేర్లు నమోదు చేసుకున్న సంస్థలు 15 లక్షలు ఇక ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అధికారికంగా ఇప్పటి వరకు ఏడు లక్షల సంస్థలు ఐటీ రిటర్న్స్ సమర్పించాయి. రూ.3000 లోపు పరిమితి కల వారు పైసా కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

షెల్ కంపెనీలే పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయని అంచాన
ఆదాయం పన్నుశాఖ అధికారుల అంచనా ప్రకారం సదరు ఎనిమిది లక్షల సంస్థల్లో అత్యధికంగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నవీ, డొల్ల కంపెనీలు ఉన్నాయని సందేహం. వార్షిక ఆడిట్‌ నివేదిక రూపొందించడంతో పాటు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్న సంస్థలు ఏడు లక్షలు కాగా, అసలు రిటర్న్స్ చూపని కంపెనీలు ఐదు లక్షల వరకు ఉంటాయి. అసలు ఆదాయమే లేదని మరో మూడు లక్షల సంస్థలు తమ రిటర్న్స్ ఫైలింగ్‌లో పేర్కొంటున్నాయి. 2017 డిసెంబర్ వరకు 2.26 లక్షల డొల్ల కంపెనీల నమోదును కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ రద్దు చేసింది.

8 lakh firms on Income Tax department radar for not filing tax returns

డొల్ల కంపెనీలంటే ఇలా
చెల్లించిన మూలధనం నామమాత్రంగా ఉండటం, అధిక నగదు నిల్వలు, షేర్‌ ప్రీమియంగా అధికమొత్తాలు ఉండటం, నమోదు కాని సంస్థల్లో పెట్టుబడులు, డివిడెండ్‌ ఆదాయమే లేకపోవడం, నగదు మాత్రం అధికంగా ఉండటాన్ని 'డొల్ల కంపెనీలకు' నిదర్శనాలుగా పేర్కొంటున్నారు. ప్రధాన వాటాదార్లుగా ప్రైవేటు కంపెనీలు ఉండి, తక్కువ టర్నోవర్‌, నిర్వహణ ఆదాయం, నామమాత్ర వ్యయాలు, తప్పనిసరిగా చెల్లించాల్సిన మొత్తాలు అతితక్కువగా ఉండటం, ట్రేడ్‌ అవుతున్న షేర్లు అతి స్వల్పంగా ఉండటం, తక్కువ స్థిరాస్తులున్న వాటినీ షెల్ కంపెనీలనే భావిస్తున్నారు.

ఐటీ యాక్ట్ 276సీసీసీ సెక్షన్ అమలు తీరిలా..
ఆదాయం పన్ను శాఖ చట్టంలో 276 సీసీసీ సెక్షన్ ప్రకారం ఐటీ రిటర్న్స్ సమర్పించని సంస్థల డైరెక్టర్లను ప్రాసిక్యూట్ చేయడానికి రంగం సిద్ధమైనట్లేనని చెబుతున్నారు. ఈ సెక్షన్ ప్రకారం సదరు కంపెనీల డైరెక్టర్లు దోషులుగా తేలితే కనీసం మూడు నెలల నుంచి రెండేండ్ల వరకు జైలు విఓ పడుతుందని చెబుతున్నారు. ఒకవేళ పన్ను చెల్లింపులు రూ.25 వేల వరకు ఉంటే మాత్రం సంబంధిత సంస్థల డైరెక్టర్లు ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్షను అనుభవించాల్సి ఉంటుందని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు.

రిటర్న్స్ దాఖలు చేయకుంటే జరిమానా ప్లస్ జైలుశిక్ష
ఐటీ చట్టం లోని సెక్షన్‌ 276సీసీ కింద, ఎవరైనా వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తన ఆదాయానికి సంబంధించి రిటర్న్స్ గడువులోగా సమర్పించకపోతే, జరిమానా, జైలు శిక్ష కూడా విధించవచ్చు. పన్ను చెల్లించాల్సిన మొత్తం రూ.3,000 మించని కంపెనీల విషయంలో మాత్రం ప్రాసిక్యూషన్‌ కూడా ఉండదు. కంపెనీలకు ఉన్న మినహాయింపును 2018 ఏప్రిల్‌ 1 నుంచి తొలగించనున్నది. ప్రస్తుత నిబంధనను దుర్వినియోగం చేయకుండా డొల్ల కంపెనీలను అడ్డుకోనున్నారు. తద్వారా బినామీ ఆస్తులను కలిగి ఉన్న సంస్థలు బయటపడతాయి.

రిటర్న్స్ దాఖలు చేయని సంస్థల్లో హవాలా లావాదేవీలు
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని కంపెనీలు మనీ లాండరింగ్‌కు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిల్లో కొన్ని నిజాయితీగా కార్యకలాపాలు సాగించే చిన్న కంపెనీలు కావచ్చు. ఇదేసమయంలో, మనీలాండరింగ్‌కు పాల్పడే సంస్థలు కూడా వీటిల్లో ఉన్నాయనడం కాదనలేదని ఒక అధికారి వివరించారు. తీవ్ర నేరాలకు పాల్పడే సంస్థల విషయంలోనే ప్రాసిక్యూషన్‌కు వెళ్లాలే కానీ, సాధారణ పన్ను విషయాల్లో అంత చర్య అవసరం లేదని, అత్యధిక వర్థమాన దేశాల్లో ఇలానే అమలవుతున్నాయని నంగియా అండ్‌ కో మేనేజింగ్‌ భాగస్వామి రాకేశ్‌ నంగియా పేర్కొన్నారు.

English summary
According to earlier provision companies having tax liability of below Rs. 3000 were exempted to file income tax returns. In this budget, this cap has been removed, making Mandatory to all the registered companies to file the returns if they have tax liability of Rs. 0 also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X