• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్వదేశాన్ని వీడుతున్న ‘శ్రీమంతులు’.. స్థిర నివాసానికే సుమా!

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: దేశీయంగా ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారు ఆ పై చదువుల కోసం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వెళ్లి చదువుకుని ఉద్యోగాలు చేస్తూ అక్కడే సెటిల్ అవుతున్నవారు ఉన్నారు. కానీ ఇదే నిజం కాదు. సంపన్నులు.. కోట్ల కొద్దీ నగదు సంపాదించిన మిలియనీర్లు.. విదేశాల పడుతున్నారు. వ్యాపారం కోసం మాత్రం కాదు. కుటుంబసమేతంగా పర్యాటక యాత్ర అంతకన్నా కాదు. మరెందుకు అనుకుంటున్నారా? ఆయా దేశాల్లోనే స్థిర నివాసం ఏర్పరుచుకోవడానికి. అవును.. నమ్మినా నమ్మకున్నా ఇది నిజం. పరాయి దేశానికి భారతీయ సంపన్నులు వలసపోతున్నారు.
ఆందోళనకర విషయమేమిటంటే.. ఇలా వెళ్లిపోతున్నవారి సంఖ్య ఏటేటా పెరుగుతుండటం. అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే భారత్‌ నుంచి విదేశాలకు వలసలుగా వెళ్లిపోయిన మిలియనీర్ల సంఖ్య 16 శాతం పెరిగింది. గతేడాది 7,000 మంది భారతీయ ధనవంతులు విదేశాలకు వెళ్లిపోగా, అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 6,000గా ఉన్నది. 2015లో 4,000 మందిగా ఉంటే, రెండేండ్లలో 3,000 మంది పెరుగడం గమనార్హం. నిరుడు విదేశాలకు వలసపోయిన సంపన్నుల జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. 10,000 మందితో చైనా మొదటి స్థానంలో ఉన్నట్లు న్యూ వరల్డ్ వెల్త్ తాజా నివేదిక స్పష్టం చేసింది.

After China, India saw most super-rich citizens leaving the country in 2017

సంపన్నులు వలస వెళ్లినా నో ప్రాబ్లం
ఈ జాబితాలో టర్కీ (6,000) మూడో స్థానంలో ఉండగా, ఆ తర్వాత బ్రిటన్ (4,000), ఫ్రాన్స్ (4,000), రష్యా (3,000) దేశాలు ఉన్నాయి. ఇకపోతే భారతీయ మిలియనీర్లు అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికాకే వలస వెళ్తున్నారు. ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో స్థిరపడుతున్నారు. చైనా కుబేరులు సైతం అమెరికా ఎంచుకుంటుండగా, కెనడా, ఆస్ట్రేలియా దేశాలకు ఆ తర్వాతీ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయినా భయపడనక్కర్లేదంటున్నది న్యూ వరల్డ్ వెల్త్. భారత్, చైనాల నుంచి వెళ్లిపోతున్న మిలియనీర్ల కంటే కొత్తగా ఈ దేశాల్లో పుట్టుకొస్తున్న మిలియనీర్ల సంఖ్యే ఎక్కువగా ఉంటున్నదని, కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ రెండు దేశాలకు మిలియనీర్ల వలసలతో వచ్చిన ముప్పేమీ లేదన్న అభిప్రాయ పడుతున్నది.

After China, India saw most super-rich citizens leaving the country in 2017

జీవన ప్రమాణాలు మెరుగు పడితే మళ్లీ వెనక్కి..
స్వదేశాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడితే దూరమైన సంపన్నులు తిరిగి వస్తారన్న విశ్వాసం వెలిబుచ్చింది. ఇదిలావుంటే వివిధ దేశాల నుంచి ఆస్ట్రేలియాకు అత్యధికంగా మిలియనీర్లు వలస పోతున్నారు. గతేడాది 10,000 మంది సంపన్నులు ఆయా దేశాల నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడినట్లు తేలింది. అంతకుముందు అమెరికాకే ఎక్కువగా వలసలుండేవి. అయితే 2015 నుంచి ఈ పరిస్థితి మారింది.

10 ఏళ్లలో 83 శాతం పెరిగిన ఆస్ట్రేలియా సంపద
కాగా, గడిచిన పదేళ్లకుపైగా కాలంలో ఆస్ట్రేలియాలోని మొత్తం సంపద 83 శాతం ఎగబాకింది. ఇదే సమయంలో అమెరికా సంపద 20 శాతమే పెరిగినట్లు కనిపిస్తున్నది. ఫలితంగా సగటు అమెరికా పౌరుడి కంటే ఇప్పుడు ఆస్ట్రేలియా పౌరుడే సంపన్నుడు. పదేళ్లకు ముందు ఇటువంటి పరిస్థితి లేదని తాజా అధ్యయనంలో తేలింది. ఇక 2017లో అమెరికాకు 9,000 మంది మిలియనీర్లు విదేశాల నుంచి రాగా, ఆ తర్వాత ఎక్కువగా కెనడా (5,000), యూఏఈ (5,000) దేశాలకు వెళ్లినట్లు రుజువైంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా స్వదేశాలను వీడి విదేశాలకు వలసపోయిన మిలియనీర్ల సంఖ్య గతేడాది దాదాపు 95,000గా నమోదైంది. 2016లో 82,000గా, 2015లో 64,000గా ఉందని ఈ నివేదికలో న్యూ వరల్డ్ వెల్త్ తెలియజేసింది.

బిలియనీర్లలో భారత్‌కు మూడో స్థానం
అమెరికా, చైనా తర్వాత అత్యధిక బిలియనీర్లు ఉన్నది భారత్‌లోనే మరి. రూ.6,500 కోట్లు అంతకంటే ఎక్కువ కలిగిన బిలియనీర్లు భారత్‌లో 119 మంది ఉంటారు. దీని ప్రకారం బిలియనీర్ల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నది. ఇక సంపన్న దేశాల్లో రూ.5,34,95,000 కోట్లతో భారత్‌కు 6వ స్థానం లభించింది. భారత్‌లో రూ.6.5 కోట్లు అంతకంటే ఎక్కువ నికర ఆస్తులు ఉన్న మిలియనీర్లు 3,30,400 మంది ఉంటారు. ఈ విషయంలో భారత్‌కు ప్రపంచ దేశాల్లో 9వ స్థానం దక్కింది. భారత్‌లో రూ.13 కోట్లు అంతకంటే ఎక్కువ సంపద కలిగిన మల్టీ మిలియనీర్లు 20,730 మంది ఉండగా.. ఈ క్యాటగిరీలో భారత్ ప్రపంచంలోనే 7వ అతిపెద్ద దేశంగా నిలుస్తోంది.

English summary
NEW DELHI: India witnessed the second largest outflow of millionaires globally after China with 7,000 high net worth individuals changing their domicile during 2017, 16 per cent more than last year, according to a report. According to the report by New World Wealth, 7,000 ultra-rich Indians shifted overseas in 2017. In 2016, the figure stood at 6,000, while in 2015 as many as 4,000 millionaires shifted base.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X