వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఫిచ్’ నెగిటివ్ అన్నా నో ప్రాబ్లం: పీఎన్బీకి పరిస్థితులు సానుకూలమేనన్న నొమురా

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ముంబై: నకిలీ లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్స్ (ఎల్వోయూ)తో సూరత్ వజ్రాల వ్యాపారి చేసిన కుంభకోణంతో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఒత్తిడికి లోనవుతున్నాయి. రూ.11,400 కోట్ల మేరకు హవాలా లావాదేవీలు జరిపిన నీరవ్ మోదీ.. కేసు బయటపడే సమయానికి విదేశాలకు చెక్కేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వ్యవస్థ, నియంత్రణ, ఆడిటింగ్ వ్యవస్థలో లోపాలు బయటపడ్డా.. రేటింగ్స్ సంస్థ 'నొమురా' మాత్రం పాజిటివ్ రేటింగ్ ఇచ్చింది.
పీఎన్బీతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లకూ పాజిటివ్ రేటింగ్ ఇచ్చింది. కానీ మరో అంతర్జాతీయ సంస్థ 'ఫిచ్' మాత్రం కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రత్యేకించి పీఎన్బీకి నెగిటివ్ రేటింగ్ ఇచ్చింది.

ఆర్బీఐ గైడ్‌లైన్స్‌తో పరిస్థితిలో మార్పు వస్తుందన్న నొమురా

ఆర్బీఐ గైడ్‌లైన్స్‌తో పరిస్థితిలో మార్పు వస్తుందన్న నొమురా

ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ పరపతి దారుణంగా ఉన్నా.. కొన్ని బ్యాంకుల ప్రత్యేకించి బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక వ్యాపార పురోగతి మరింత ముందుకు సాగుతుందని పేర్కొన్నది. కుంభకోణాలు వెలుగు చూస్తున్నా కొద్దీ ప్రభుత్వ రంగ బ్యాంకులపై నమ్మకం, విశ్వాసం సన్నగిల్లే అవకాశం కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకు మొండి బకాయిల వసూళ్లపై ఆర్బఐ జారీ చేసిన మార్గదర్శకాలతో సమీప భవిష్యత్తులో వాటి పనితీరు మెరుగవుతుందని నొమురా అంచనా వేసింది.

పీఎన్బీని వెంటాడనున్న నీరవ్ - గీతాంజలి మొండి బకాయి

పీఎన్బీని వెంటాడనున్న నీరవ్ - గీతాంజలి మొండి బకాయి

వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎస్బీఐ, బీవోబీ నిర్వహణ మరింత మెరుగు పడుతుందని తెలిపింది. పీఎన్బీ కేపిటల్ అవసరాలు రూ.100 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని, 2019 - 20లో మాత్రం 15 - 25 శాతం తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నది. మోదీ, గీతాంజలి జ్యువెల్లరీస్ వల్ల 70 నుంచి 130 బిలియన్ డాలర్ల రుణం మొండి బకాయి కింద చేర్చాల్సి ఉంటుందని నొమురా పేర్కొన్నది.

మొండి బకాయి నిబంధనల ప్రభావం స్వల్పకాలమేనన్న ఫిచ్‌

మొండి బకాయి నిబంధనల ప్రభావం స్వల్పకాలమేనన్న ఫిచ్‌

మొండి బకాయిల వ్యవస్థలను ప్రక్షాళించడం కోసం ఆర్‌బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనల వల్ల స్వల్పకాలంలో బ్యాంకింగ్‌ రంగ ఆదాయాలపై ప్రభావం పడొచ్చని రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ పేర్కొంది. అయితే మొండి బకాయిల సమస్యను పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలకు తోడు.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన పునర్నిర్మాణ పథకం ప్రకటించడంతో, ఈ రంగం మధ్యకాలంలో పుంజుకునేందుకు అవకాశాలున్నాయని ఫిచ్‌ వివరించింది. ఆర్‌బీఐ కొత్త నిబంధనల ప్రకారం.. వారం వారీ ప్రాతిపదికన బ్యాంకులు పెద్ద ఖాతాదార్లు ఎగవేసే రుణాల గురించి తెలపాల్సి ఉంటుంది. దీని వల్ల మొండి బకాయిలను సునిశితంగా పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుందని ఫిచ్‌ అభిప్రాయపడింది.

గడువు దాటితే దివాలా కోర్టుకు సమస్య విన్నవించడమే

గడువు దాటితే దివాలా కోర్టుకు సమస్య విన్నవించడమే

మొండి బకాయిల పరిష్కారానికి 180 రోజుల గడువు ఇవ్వడం.. ఆ గడవు లోపల పరిష్కారం జరగకపోతే దివాలా కోర్టుకు సమస్యను విన్నవించడం అనేది సానుకూలంగా ఉన్నదని ఫిచ్ తెలిపింది. ఇక మొండి బకాయిలను గుర్తించి, పరిష్కారాన్ని చూపడం వంటివి వేగంగా చేయడానికి కొత్త నిబంధనలు ఉపకరిస్తాయి దీని ప్రకారం దివాలా కోర్టులకు మరిన్ని ఖాతాలు వెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన రూ.2.11 లక్షల కోట్ల పెట్టుబడి, మొండి బకాయిల పరిష్కారానికి సంబంధించిన నష్టాలు తగ్గించుకోవడానికి ఉపయోగపడొచ్చు. కాబట్టి ఆస్తుల వృద్థి తక్కువగానే ఉండొచ్చు. ఆర్థిక ఫలితాలు ఒత్తిడిలోనే ఉండొచ్చు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)ని ‘రేటింగ్‌ వాచ్‌ నెగటివ్‌' విభాగంలో ఉంచామని భవిష్యత్‌లో రేటింగ్‌ తగ్గే అవకాశం ఉంది.

English summary
PSU banks came under pressure after Nirav Modi alleged scam came to light for a staggering Rs 11,300 crore. The alleged fraud highlights apparent flaws in PNB’s systems, controls as well as audit systems but it still remains a buy call along with SBI and Bank of Baroda, Nomura said in a report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X