• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆధార్ డేటా లీక్ ఇలా: గూగుల్‌లో ‘మేరా ఆధార్ మేరీ పెహచాన్’ అని కొడితే చాలు...

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: ఆధార్ డేటా లీక్‌పై గతంలో ఓ జాతీయ దిన పత్రికలో ప్రచురితమైన వార్తకు సంబంధించి.. ఆ వార్త రాసిన విలేకరిపైనా, దానిని ప్రచురించిన దినపత్రికపైనా యూఐడీఏఐ కేసులు నమోదు చేసింది. అదేమని నిలదీస్తే గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశామని దాటేసింది.

ఓవైపు కేంద్రం ఆధార్ డేటా సురక్షితమని తనను తాను సమర్థించుకోగా మరోవైపు యూఐడీఏఐ .. అసలు ఆధార్‌ డేటా లీకేజీ సాధ్యమేకాదంటూ వాదించింది. అయినా సరే ఆధార్ డేటీ లీకేజీలను పలువురు బయటపెడుతూనే ఉన్నారు.

తాజాగా మరోసారి ఆధార్‌ డేటా లీకేజీపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. గూగుల్‌ సెర్చ్‌లో పలువురి ఆధార్‌ వివరాలు బయటపడటమే దీనికి ప్రధాన కారణం. సింపుల్‌గా గూగుల్‌లో 'మేరా ఆధార్‌ మేరి పెహచాన్‌' ఫైల్‌టైప్‌:పీడీఎఫ్‌ అని సెర్చ్‌ చేస్తే చాలు పలువురు ఆధార్‌ వివరాలు బయటపడుతున్నాయని తెలిసింది.

Another Aadhaar Data Leak Just Google Mera Aadhaar Meri Pehchan

అపరిచితుల డేటా ఇలా ఆవిష్క్రుతం

మేరా ఆధార్‌ మేరీ పెహచాన్‌'ఫైల్‌టైప్‌:పీడీఎఫ్‌ టైప్‌ చేసి, సెర్చ్‌ చేస్తే పలు పీడీఎఫ్‌ ఫైల్స్‌ చూపుతున్నాయని, వాటిని డౌన్‌లోడ్‌ చేస్తే, అపరిచితుల ఆధార్‌ వివరాలన్నీ డెస్క్‌టాప్‌లపై సేవ్‌ అవుతున్నట్టు వెల్లడైంది. ఈ వివరాల్లో ఆధార్‌ కార్డు దారుని పేరు, ఆధార్‌ నంబర్‌, తల్లిదండ్రుల పేర్లు, అ‍డ్రస్‌, పుట్టిన తేదీ, ఫోటోగ్రాఫ్‌ ఉన్నట్టు తెలిసింది. ఇలా ఆధార్‌ కార్డు వివరాలు గూగుల్‌ సెర్చ్‌ ద్వారా బహిర్గతమవుతున్నట్టు తెలిసింది. ఆధార్‌ డేటా లీకేజీపై ట్విటర్‌ యూజర్లు మండిపడుతున్నారు.

డేటా లీకేజీపై నెటిజన్లు ఇలా కామెంట్లు

ఎంత తేలికగా ఆధార్‌ కార్డు యాక్సెస్‌ అవుతోందో, ఎలాదుర్వినియోగం అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మేరా ఆధార్‌ మేరి పెహచాన్‌'ఫైల్‌టైప్‌:పీడీఎఫ్‌ అని టైప్‌ చేయండి చాలు అని ఓ ట్విటర్‌ యూజర్‌ ట్వీట్‌ చేయగా మరో ట్విటర్‌ యూజర్‌ ఈ విషయం సుప్రీంకోర్టుకు తెలుస్తోందా? యూఐడీఏఐ ఆధార్‌ విషయంలో ఎలా విఫలమవుతోందో అని మండిపడుతున్నారు. యూఐడీఏఐ దీనిపై సమాధానం చెప్పాలని, మరోసారి ప్రజల ఆధార్‌ వివరాలను భద్రంగా ఉంచడంలో విఫలమైందని అంటున్నారు.

Another Aadhaar Data Leak Just Google Mera Aadhaar Meri Pehchan

క్రిప్టోకరెన్సీ ప్రకటనలకు గూగుల్‌ షాక్‌

సెర్చింజిన్‌ దిగ్గజం ఆల్ఫాబెట్‌ గూగుల్‌, క్రిప్టోకరెన్సీ ప్రకటనలకు షాకిచ్చింది. క్రిప్టోకరెన్సీలను ప్రమోట్‌ చేసే ఆన్‌లైన్‌ ప్రకటనలు, సంబంధిత కంటెంట్‌పై జూన్‌ నుంచి నిషేధం విధిస్తున్నట్టు గూగుల్‌ పేర్కొంది. గూగుల్‌ తన పాలసీని అప్‌డేట్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. తమ ఈ కొత్త పాలసీ కింద చట్టవిరుద్ద, ఊహాజనిత ఫైనాన్సియల్‌ ప్రొడక్ట్‌లపై నిషేధం విధించాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఇదే రకమైన నిర్ణయాన్ని కూడా ఫేస్‌బుక్‌ గత జనవరిలోనే తీసుకుంది. ఫేస్‌బుక్‌, ఆడియన్స్‌ నెట్‌వర్క్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి తన ప్లాట్‌ఫామ్స్‌లో ఈ పాలసీనే అమల్లోకి తేనున్నట్టు ఫేస్‌బుక్‌ తెలిపింది.

2016లో 320 కోట్లలో రెండింతల ప్రకటనలు తొలగించామన్న గూగుల్

2017లో 3.2 బిలియన్‌ ప్రకటనలు తమ వ్యాపార ప్రకటన పాలసీలను ఉల్లంఘించాయని, 2016లో సుమారు రెండింతల ప్రకటనలను తొలగించినట్టు గూగుల్‌ మరో బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొంది. తమ ప్లాట్‌ఫామ్‌పై హాని కలిగించే ప్రకటనలను తొలగిస్తున్నామని తెలిపింది. కాగా, ప్రస్తుతం బిట్‌కాయిన్‌, మార్కెట్‌ విలువ పరంగా అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఉంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In yet another revelation that raises worries about the privacy of your Aadhaar data, it has been found that a simple Google search will lead you to the Aadhaar details of several individuals. These details, including their name, address, Aadhaar number, date of birth and photograph, have been made publicly accessible on the internet for no clear reason.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more