వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకులపై ప్రైవేటీకరణ కత్తి?: అసోచామ్‌ బ్యాటింగ్.. అరవింద్ సుబ్రమణ్యం అడ్వైజ్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల్లో కేంద్రం తనకున్న వాటాను 50 శాతం లోపునకు తగ్గించుకోవాలని అసోచామ్‌ సూచించింది. పీఎన్‌బీలో బయటపడిన రూ.11,400 కోట్ల కుంభకోణం వాటా తగ్గింపునకు బలమైన సంకేతంగా పేర్కొంది. వాటాదారులకు జవాబుదారీగా, డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ కోణంలో, ప్రైవేట: బ్యాంకుల మాదిరిగా పనిచేసేలా ప్రభుత్వరంగ బ్యాంకులను అనుమతించాలని అసోచామ్‌ సూచించింది.
'చారిత్రకంగా చూస్తే ప్రభుత్వరంగ బ్యాంకులు ఒక సంక్షోభం తర్వాత ఒక సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. వీటిలో ప్రభుత్వం ప్రధాన వాటాదారుగా ఉన్నప్పటికీ పన్ను చెల్లింపులదారుల డబ్బుతో వీటిని ఒడ్డున పడేసే విషయంలో ఒక పరిమితి ఉంది'అని అసోచామ్‌ తన ప్రకటనలో పేర్కొంది. బ్యాంకుల్లో ఉన్నత పదవులను ప్రభుత్వ ఉద్యోగాలకు కొనసాగింపుగా భావించే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తన వాటాను 50 శాతం లోపునకు తగ్గించుకుంటే, వాటికి మరింత స్వతంత్రతతోపాటు సీనియర్‌ మేనేజ్‌మెంట్‌లో బాధ్యత, జవాబుదారీతనం పెరుగుతాయని అసోచామ్‌ సూచించింది.

ప్రైవేట్ భాగస్వామ్యం పెంపుదలతోనే క్రమశిక్షణ సాధ్యమన్న అరవింద్ సుబ్రమణ్యం

ప్రైవేట్ భాగస్వామ్యం పెంపుదలతోనే క్రమశిక్షణ సాధ్యమన్న అరవింద్ సుబ్రమణ్యం

పీఎన్బీలో వెలుగు చూసిన కుంభకోణం విలువ దాని నికర ఆదాయం రూ.1,320 కోట్లకు ఎనిమిది రెట్లు ఎక్కువ. ఇబ్బందికర అంశాలపై బ్యూరోక్రాట్ల మార్గదర్శకాలు, సూచనల మేరకు బ్యాంకులు, వాటి సీనియర్ మేనేజ్మెంట్లు ఎక్కువగా ద్రుష్టి సారించాయని అసోచాం పేర్కొన్నది. అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు బ్యాంకుల్లో నూతన టెక్నాలజీ అమలులోకి తేవాలని కోరింది. ఆర్థిక వ్యవస్థ ప్రాముఖ్యత ద్రుష్ట్యా.. పారదర్శక, స్వచ్ఛమైన లావాదేవీల నిర్వహణకు బ్యాంకింగ్ వ్యవస్థలో మెరుగైన విధానాలకు మార్గదర్శకాలు రూపొందించాలని ఆర్బీఐని అసోచామ్ ప్రధాన కార్యదర్శి డీఎస్ రావత్ కోరారు. గమ్మత్తేమిటంటే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం కూడా క్రమశిక్షణ, నియంత్రణ, భద్రత కావాలంటే బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని పేర్కొనడం ఆసక్తికర పరిణామం.

మళ్లీ తెరపైకి సెబీ ప్రతిపాదన

మళ్లీ తెరపైకి సెబీ ప్రతిపాదన

సంచలనం సృష్టించిన పీఎన్‌బీ కుంభకోణం.. స్టాక్ మార్కెట్ సంస్థల రుణాల వ్యవహారంపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీని మరోసారి దృష్టి పెట్టేలా చేస్తున్నది. ఈ స్కాంలతో అమయాక మదుపరులు ఎట్టిపరిస్థితుల్లోనూ నష్టపోకూడదనే ఉద్దేశంతో మార్కెట్ లిస్టింగ్ కంపెనీలు అన్ని రుణ ఎగవేతల వివరాలను ఒక్కరోజులో ప్రకటించాలనే ప్రతిపాదనను సెబీ గతంలోనే తీసుకొచ్చింది. అయితే మార్కెట్ లావాదేవీలను నష్టపరుస్తుందని, బ్యాంకింగ్‌తాజా కుంభకోణం నేపథ్యంలో సెబీ ప్రతిపాదనకు బలం చేకూరుతున్నది. దీంతో మళ్లీ తెరపైకి వస్తున్నది. ఏండ్ల తరబడి వెలుగుచూడని ఈ రూ.11,400 కోట్ల భారీ స్కాం ప్రభావం ఇప్పటికే స్టాక్ మార్కెట్లపై పడుతున్నది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తోపాటు, గీతాంజలి జెమ్స్ షేర్ల విలువ అమాంతం పడిపోతున్న విషయం తెలిసిందే.

పీఎన్బీ స్కాంతో మదుపర్ల సొమ్ము ఆవిరి

పీఎన్బీ స్కాంతో మదుపర్ల సొమ్ము ఆవిరి

పీఎన్బీ కుంభకోణం సూత్రధారి నీరవ్ మోదీతో స్టాక్ మార్కెట్లకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవు. అంటే ఈయన సంస్థలేవీ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కాలేదు. అయినప్పటికీ ఈయనవల్ల మోసపోయిన పీఎన్‌బీ.. స్టాక్ మార్కెట్ లిస్టింగ్ సంస్థ. అలాగే నీరవ్ మామ మెహుల్ చోక్సీ కూడా ఈ కుంభకోణంలో నిందితుడే అవగా, ఆయన ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న గీతాంజలి జెమ్స్ కూడా స్టాక్ మార్కెట్ కంపెనీయే. దీంతో సహజంగా వీటి షేర్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండగా, వీటిల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరుల సంపద ఆవిరైపోతున్నది. ఇతర బ్యాంకుల షేర్లూ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలోనే గతంలో చేసిన ప్రతిపాదనను సెబీ తప్పక అమల్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పరిశీలనలో పీఎన్‌బీ రేటింగ్‌: క్రిసిల్‌

పరిశీలనలో పీఎన్‌బీ రేటింగ్‌: క్రిసిల్‌

రూ.11,400 కోట్ల మోసపూరిత లావాదేవీలు వెలుగుచూసిన పీఎన్‌బీకి రేటింగ్‌ను పరిశీలనలో ఉంచినట్లు రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ ప్రకటించింది. ఈ బ్యాంక్‌ రుణ పథకాలకు క్రిసిల్‌ నుంచి ఏఏఏ, ఏఏ రేటింగ్‌లు ఉన్నాయి. బ్యాంకులో తాజాగా వెలుగుచూసిన మోసపూరిత లావాదేవీలు అనూహ్యమైనవని, ఇందుకు బ్యాంక్‌ బాధ్యత ఎంత అనేది చట్ట ప్రకారం నిర్ణయమవుతుందని సంస్థ పేర్కొంది. బ్యాంక్‌ బాధ్యత, రికవరీకి అవకాశాలు, కేటాయింపులు ఎంత జరపాల్సి వస్తుంది, పెట్టుబడి శాతాలపై ప్రభావం వంటి అంశాల్లో పీఎన్‌బీ యాజమాన్యం నుంచి స్పష్టత కోరినట్లు క్రిసిల్‌ వెల్లడించింది. బ్యాంక్‌ సమాధానం రాగానే రేటింగ్‌ను నిర్థారిస్తామని తెలిపింది.

English summary
New Delhi: In light of the massive Rs 11,300 crore ($1.8 billion) scam allegedly involving jeweller Nirav Modi that has hit state-run Punjab National Bank (PNB), industry chamber ASSOCHAM said that the government should surrender its majority control of banks, which should be allowed to function like private sector lenders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X