వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏటీఎం ఇబ్బందులపై ఎస్‌బీఐ శుభవార్త! నో క్యాష్‌కు కారణం ఇదీ!!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ముంబై/అమరావతి: ఏటీఎంలలో నగదు కొరతపై ఎస్పీఐ స్పందించింది. గత 24 గంటలుగా ఎటీఎంలలో క్రమంగా ఇక్కట్లు తొలగిపోతున్నాయని చెప్పారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఏటీఎంలలో డబ్బులు రావడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై ఎస్బీఐ స్పందించింది. నోట్ల రద్దు నాటి పరిస్థితులను ప్రజలు ఎదుర్కొంటున్నారు.

ఎక్కడ చూసినా డబ్బులు లేవు అనే బోర్డులు కనిపిస్తున్నాయి. ఏటీఎంలలో నగదు కొరత తాత్కాలికమేనని, సమస్యను సత్వరం పరిష్కరిస్తున్నామని కేంద్ర మంత్రి జైట్లీ చెప్పారు. అసలు పెద్దనోట్లను ముద్రించడానికి ఆర్బీఐ వద్ద కరెన్సీ పేపర్‌ కొరత తీవ్రంగా ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

ఆర్బీఐ వద్ద కరెన్సీ పేపర్‌ కొరత తీవ్రంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీని ప్రభావం రూ.2000, రూ.500, రూ.100 నోట్ల ప్రింటింగ్‌పై పడినట్లు తెలుస్తోంది. పేపర్‌ దిగుమతి తగ్గిందని, అదే సమయంలో దేశీయ ఉత్పత్తిదారులు డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేయలేకపోతున్నారని చెబుతున్నారు.

ATM cash crunch, cash situation at ATMs improving, says SBI

కరెన్సీ పేపర్‌ దిగుమతులు 30 శాతం తగ్గాయని, నోట్ల రద్దు అనంతరం కొత్త నోట్ల ముద్రణకు దాదాపు 20 వేల టన్నులకు పైగా పేపర్‌ అవసరముందని, ఇప్పటికీ పేపర్‌ కొరత ఎక్కువగా ఉందని, ఈ కారణంగానే ప్రస్తుత పరిస్థతి నెలకొందని చెబుతున్నారట. నోట్ల రద్దుకు ముందే పేపర్ దిగుమతులు తగ్గిపోయాయని చెబుతున్నారు. వారం రోజుల్లో పరిస్థితి మెరుగుపడుతుందని అంటున్నారు.

రూ.2000 నోట్ల మాయం వెనుక కుట్ర

రూ.2000 నోట్ల మాయం వెనుక కుట్ర దాగి ఉందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నోట్ల రద్దుకు ముందు రూ.15 లక్షల కోట్ల విలువైన కరెన్సీ చలామణిలో ఉండేదని, ఆ తర్వాత రూ.16.50 లక్షల కోట్లకు పెరిగిందని, కానీ రూ.2000 నోట్లు మాత్రం మార్కెట్లో కనిపించడం లేదన్నారు.

రోజుకు 500 కోట్ల రూ.500 నోట్లను ముద్రిస్తున్నామని, అయిదు రెట్లు ఉత్పత్తి పెంచేలా చర్యలు తీసుకున్నామని, అంటే రోజుకు 2500 కోట్ల రూ.500 నోట్ల సామర్థ్యం ముద్రణకు సామర్థ్యం పెరుగుతుందని, ఒక నెలలో రూ.75,000 కోట్ల నోట్లు చలామణిలోకి వస్తాయన్నారు.

English summary
India's largest lender SBI said today that cash availability at its ATMs has increased in the past 24 hours following reports of currency shortages and ATMs running dry from different parts of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X