వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్రరాజ్యం ముందు మరో ‘ఆర్థిక’ మాంద్యం: ట్రంప్‌పై భగ్గుమన్న చమురు పరిశ్రమ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందట. 2008లో ఎదుర్కొన్న సంక్షోభం మాదిరే మళ్లీ తలెత్తే అవకాశాలు ఉన్నాయని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ తెలిపారు. ఇటీవల జరిగిన ''ఆస్క్‌ మి ఏనీథింగ్‌'' అనే కార్యక్రమంలో బిల్‌గేట్స్‌ ఈ సంగతి తెలిపారు. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం లాంటిది సమీప భవిష్యత్‌లో తలెత్తే అవకాశం ఉన్నదా? అని ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు బిల్‌గేట్స్ పై విధంగా సమాధానం ఇచ్చారు. అవునని చెప్పడం కష్టమైనా అలాంటి సంక్షోభం తలెత్తడం తథ్యమని హెచ్చరికలు జారీచేశారు.
సరిగ్గా దశాబ్ద కాలం క్రితం తలెత్తిన ఆర్థిక మాంద్యం దారుణమైందని పలువురు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇరకాటంలో కూరుకుపోయింది. దాదాపు 88 లక్షల మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు.

 ఇన్నోవేషన్, క్యాపిటలిజం మెరుగైతే మాంద్యం నుంచి బయటపడొచ్చు

ఇన్నోవేషన్, క్యాపిటలిజం మెరుగైతే మాంద్యం నుంచి బయటపడొచ్చు

అమెరికన్ల నికర సంపద కూడా 19 ట్రిలియన్‌ డాలర్లకు పైగా (19 లక్షల కోట్ల డాలర్లు) హరించుకుపోయింది. గృహ వసతి లేని వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని గేట్స్‌ చెప్పినప్పటికీ, ఇన్నోవేషన్, క్యాపిటలిజం మరింత మెరుగైతే దాన్ని నుంచి బయటపడటం సాధ్యమవుతుందని గేట్స్‌ చెప్పారు.

రష్యా, ఒపెక్ దేశాలకే ఉపయోగపడుతుందన్న షెల్ పరిశ్రమ

రష్యా, ఒపెక్ దేశాలకే ఉపయోగపడుతుందన్న షెల్ పరిశ్రమ

దేశీయ స్టీల్‌ పరిశ్రమను ప్రోత్సహించాలని ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం ఇప్పడు మరో రూపంలో ఇబ్బందికరంగా మారింది. అమెరికాలో అత్యంత కీలకమైన షెల్‌‌ ఇంధన పరిశ్రమకు గుదిబండగా మారనుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్టీల్‌పై 25% సుంకం విధించాలని ఆయన నిర్ణయించారు. కానీ ఈ నిర్ణయం ఒపెక్‌, రష్యాలకు ఉపయోగపడుతుంది కానీ దేశానికి ఏమాత్రం ఉపయోగపడదని షెల్‌ పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

డకోటా పైపులైన్ ప్రాజెక్టుపై తీవ్ర ప్రభావం ఇలా

డకోటా పైపులైన్ ప్రాజెక్టుపై తీవ్ర ప్రభావం ఇలా

ఈ నిర్ణయంతో ప్రపంచంలో అమెరికాను అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా తీర్చిదిద్దాలనే కల సాధ్యంకాకపోవచ్చని భావిస్తున్నారు. ఆయిల్‌ సరఫరాకు అమెరికాలో భారీ ఎత్తున పైప్‌లైన్లను నిర్మించాల్సి ఉంది. అమెరికాలోని ఐదు పైప్‌లైన్‌ సంస్థలు వాడే స్టీల్‌లో 77% దిగుమతి చేసుకుందే. ముఖ్యంగా డకోటా పైప్‌లైన్‌ ప్రాజెక్టుల దీని నుంచి తీవ్రంగా ప్రభావితం కానున్నది. ఈ నిర్ణయంతో అమెరికాలోని పలు ప్రాజెక్టుల వ్యయం కూడా పెరగనున్నది. దీంతో ప్రాజెక్టులను మధ్యలోనే ఆపి వేయడమో లేకపోతే.. నిలిపి వేయడమో చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

వాణిజ్య యుద్ధంలో అమెరికాదే విజయమన్న ట్రంప్

వాణిజ్య యుద్ధంలో అమెరికాదే విజయమన్న ట్రంప్

ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా పెంచే సుంకాలు.. అన్ని దేశాలకు వర్తిస్తాయని, మిత్ర దేశాలకు మినహాయింపేమీ లేదని వైట్‌హౌజ్ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. మరోవైపు తన నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు.‘మా దేశ ప్రయోజనాలు, మా కార్మికుల రక్షణకే మేము పెద్దపీట వేస్తాం. అమెరికా వాణిజ్య లోటును అదుపులో పెట్టడానికి సుంకాల పెంపు తప్ప మరో మార్గం కనిపించడం లేదు. గతంలో వందల కోట్ల డాలర్లు నష్టపోయాం. ఈ క్రమంలో ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాల పెంపు.. అమెరికాకు లాభిస్తుంది'అని ట్విట్టర్‌లో ట్రంప్ పేర్కొన్నారు. ఈ వాణిజ్య యుద్ధంలో అమెరికాదే విజయం అని ఆయన ట్వీట్ చేశారు.

 అమెరికాతో సంప్రదింపుల కోసం చైనా ప్రయత్నాలు

అమెరికాతో సంప్రదింపుల కోసం చైనా ప్రయత్నాలు

అమెరికాలోకి ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను పెద్ద ఎత్తున పెంచనున్నామన్న ట్రంప్ నిర్ణయంపట్ల మిత్ర దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఓ వైపు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు మంచివేనని అగ్రరాజ్య అధ్యక్షుడు తన నిర్ణయాన్ని సమర్థించుకుంటుంటే.. మరోవైపు అమెరికా వాణిజ్య భాగస్వాములైన కెనడా, యూరోపియన్ యూనియన్ (ఈయూ), ఆస్ట్రేలియా, మెక్సికో అభ్యంతరం వెలిబుచ్చుతున్నాయి. మరోవైపు ట్రంప్ సర్కార్ నిర్ణయంతో ప్రభావితం అవుతున్న చైనా.. అమెరికాతో చర్చలకు ప్రయత్నిస్తున్నది. అమెరికా ఉక్కు దిగుమతుల్లో చైనాది 11వ స్థానం. దీనిపై అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపాలని చైనా భావిస్తున్నది. కాగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నగా భావించే అమెరికానే.. ఇలాంటి రక్షణాత్మక ధోరణులను అమలుపరుస్తుండటం ఎంతమాత్రం అంగీకారం కాదని ఐఎంఎఫ్ అధికార ప్రతినిధి గెర్రీ రైస్ అన్నారు.

అతలాకుతలం అవుతున్న ప్రపంచ మార్కెట్లు

అతలాకుతలం అవుతున్న ప్రపంచ మార్కెట్లు

డబ్ల్యూటీఓ ట్రేడ్‌ పాలసీ విషయాల్లో జోక్యం చేసుకోవడం చాలా అరుదు. అయినప్పటికీ ట్రంప్‌ చేసిన ప్రకటనతో ట్రేడ్‌ వార్‌ జరిగే ప్రమాదం ఉందంటూ డబ్ల్యూటీఓ ఆందోళన వ్యక్త పరుస్తోంది. ట్రేడ్‌ వార్‌ జరుగాలని ఎవరూ కోరుకోవడం లేదని, పరిస్థితిని డబ్ల్యూటీఓ సునిశితంగా పరిశీలిస్తుందని చెప్పారు. ట్రంప్‌ ప్రకటనపై ఇతరులు ఏ విధంగా స్పందిస్తారో కూడా చూస్తున్నామని తెలిపారు. ట్రేడ్‌ వార్‌ సంకేతాలతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు సైతం అతలాకుతలమవుతున్నాయి. ప్రపంచ కుబేరుల సంపద ఇప్పటికే భారీగా కోల్పోయారు. ఈ ప్లాన్‌ఫై డబ్ల్యూటీఓ కమిటీ విమర్శలు చేసింది. ఈ విషయంపై అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కానీ ట్రంప్‌ టారిఫ్‌ ప్లాన్లు, సిస్టమ్‌కు దారుణమైన ప్రమాదంగా తెలుస్తోంది.

English summary
NEW YORK: Many economists consider the financial crisis of 2008 to be the worst economic downturn since the Great Depression. According to Bill Gates, the US is heading toward another one just like it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X