వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ అప్ స్వింగ్ ‘బిట్‌కాయిన్’! అప్పుడే 10 వేల డాలర్ల పైకి..!!

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ముంబై: వివిధ దేశాల ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థల నియంత్రణలతో గణనీయంగా తగ్గుముఖం పట్టిన క్రిప్టో కరెన్సీ 'బిట్ కాయిన్' విలువ మళ్లీ పుంజుకుంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ బ్యాంక్, జేపీ మోర్గాన్స్ లాయిడ్స్ వంటి బ్యాంకులతోపాటు అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, భారత్ అధికారికంగా బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై నిషేధం ప్రకటించాయి. భారతదేశంలో బిట్ కాయిన్ కొనుగోళ్లకు తమ క్రెడిట్ కార్డులు వాడొద్దని సిటీ బ్యాంక్ గ్రూపు ఆదేశించింది. తాజాగా ఎస్బీఐ కార్డు కూడా అదే బాటలో పయనించనున్నది. అయినా గురువారం లక్సెంబర్గ్ కేంద్రంగా నడుస్తున్న బిట్ స్టాంప్ ధర గణనీయంగా పెరిగింది. దీని దారిలోనే బిట్ కాయిన్ కూడా తన విలువ పెంచుకుంటుందని అంచనా. 12 శాతం వ్రుద్ది సాధించిన బిట్ కాయిన్ 10 వేల అమెరికా డాలర్లకు చేరువలో ఉన్నది. సరిగ్గా వారం క్రితం బిట్ స్టాంప్ విలువ రెండు రోజుల్లోనే 8259 అమెరికా డాలర్ల నుంచి 8560 డాలర్లకు ఎగబాకింది.

ఈ నెల 12న 8899 అమెరికా డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ ధర బుధవారం 9490 డాలర్లకు.. గురువారం రాత్రి 8.48 గంటలకు 9831 డాలర్లకు చేరుకున్నది. శుక్రవారం 10వేల డాలర్లను దాటి 10,037.51 డాలర్లకు చేరుకున్నది. శుక్రవారం ఉదయం నుంచి అంతర్గత ట్రేడింగ్ లో 500 డాలర్లు పెరగడం గమనార్హం. గతేడాది డిసెంబర్ 20 వేల డాలర్లకు చేరుకుని బిట్ కాయిన్ పతనమైన తర్వాత తిరిగి ఇలా పుంజుకోవడం ఇదే మొదటి సారి. అయితే బిట్ కాయిన్ ట్రేడింగ్‌లో అనిశ్చితికి కారణాలను తెలుసుకుందాం..

Bitcoin Price Tops $10K Across Major Exchanges

గణనీయంగా మెరుగు పడిన క్రిప్టో కరెన్సీల విలువ
బిట్ కాయిన్ ధర 9875.27 అమెరికా డాలర్లుగా ఉన్నప్పుడు దాని మొత్తం మార్కెట్ కేపిటల్ సుమారు 166 బిలియన్ డాలర్లు.. ఇది బుధవారంతో పోలిస్తే అత్యధికం. బుధవారం బిట్ కాయిన్ మార్కెట్ కేపిటలైజేషన్ 145 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో బిట్ కాయిన్ సగటు ధర విలువ 8266 డాలర్లు ఉండగా అత్యల్పంగా దాని మార్కెట్ కేపిటల్ 128 బిలియన్ డాలర్ల స్థాయికి పతనమైంది. భారత క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీలో బిట్ కాయిన్ 6.25 లక్షల రూపాయలకు కొనుగోలుచేస్తే 6.17 లక్షల రూపాయలకు విక్రయించారు. యూనోకాయిన్‌లో బిట్ కాయిన్ రూ.6.48 లక్షలకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. రెండు వారాల క్రితం క్రిప్టో కరెన్సీ (బిట్ కాయిన్) విలువ 9170 అమెరికా డాలర్లయితే దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ 170 బిలియన్ డాలర్లు. మూడు వారాల క్రితం కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో దాని విలువ 11,259 డాలర్లుగా ఉన్నది. అంతర్జాతీయంగా సగటున బిట్ కాయిన్ ధరలు గణనీయంగానే మెరుగు పడ్డాయి. కేవలం బిట్ కాయిన్ ధరలు మాత్రమే కాక ఇతర ప్రజాదరణ పొందిన క్రిప్టో కరెన్సీల విలువ శరవేగంగా పెరుగుతున్నది. ఈథరియం ఆరు శాతం పెరిగితే, రిపిల్ ఏడు శాతం, బిట్ కాయిన్ నగదు విలువ ఆరు శాతం, లిట్ కాయిన్ ఎకాఎకినీ 20శాతం పెరిగింది.

బిట్ కాయిన్ కొనుగోళ్లపై నిషేధం
కొన్ని రోజుల క్రితం సిటీ బ్యాంక్ తన ఖాతాదారులు.. తమ క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి బిట్ కాయిన్లు కొనుగోలు చేయొద్దని నిషేధాన్ని విధించింది. ఇదే బాటలో ఎస్బీఐ కార్డు కూడా పయనించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై వీసా, మాస్టర్ కార్డు యాజమాన్య ప్రతినిధులతో సంప్రదిస్తున్నట్లు ఎస్బీఐ కార్డు ఎండీ అండ్ సీఈఓ హర్దయాళ్ ప్రసాద్ చెప్పారు. క్రిప్టో కరెన్సీతో సంబంధం ఉన్న లావాదేవీలకు తమ కార్డుల వాడకాన్ని నివారించే విషయమై చురుగ్గా వ్యవహరిస్తున్నామన్నారు. నిరంతరం మాస్టర్, వీసా కార్డుల లావాదేవీలపైనా నిఘా పెట్టామని తెలిపింది. ఆర్బీఐ ఆంక్షల మేరకు తమ డెబిట్, క్రెడిట్ కార్డుల నుంచి క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ కొనుగోళ్లను నిషేధించినట్లు సిటీ బ్యాంక్ యాజమాన్యం కూడా ధ్రువీకరించింది. గత నెలలోనే క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై బ్యాంకులను ఆర్బీఐ హెచ్చరించింది కూడా. ఆయా సంస్థల బ్యాంకుల లావాదేవీలను సునిశితంగా తనిఖీ చేస్తామని ఆర్బీఐ పేర్కొన్నది.

English summary
Bitcoin prices have been under significant pressure on regulatory crackdown. Recently, four major banks, Bank of America, Citi Bank, JP Morgan and Lloyds, prohibited their customers from buying the cryptocurrency via credit cards
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X