వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిట్ కాయిన్ల కష్టాలివి: 159 దేశాల్లో సమస్యాత్మకంగా విద్యుత్ వినియోగం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బిట్‌కాయిన్లను వినియోగించడం వల్ల రమారమీ 159 దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇంతకుముందు బిట్‌కాయిన్ల వినియోగంతో కిడ్నాప్‌లు, ఆయుధ ఒప్పందాలు‌, బలవంతపు వసూళ్లు పెరిగిపోయాయి. దీంతో పాటు నిశ్శబ్ధంగా మరో సమస్య ప్రపంచాన్ని పీడిస్తోంది. అదే విద్యుత్ వినియోగం. ఒక బిట్‌కాయిన్‌ లావాదేవీ జరగాలంటే అమెరికాలో 10 ఇళ్లు ఒక రోజు వినియోగించుకునేంత విద్యుత్ కావాలి.
4000 వీసా కార్డుల లావాదేవీలకు సరిపడా కరెంట్‌ను మింగేస్తుంది. ఇక నిత్యం జరిగే లక్షలాది బిట్‌కాయిన్‌ లావాదేవీలకు ఎంత విద్యుత్ అవసరం అవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. బిట్‌కాయిన్లకే ఒక దేశం ఉంటే అత్యధికంగా విద్యుత్ వినియోగించే దేశాల్లో 61వ స్థానంలో ఉండేది.

Recommended Video

Bizarre : Man Bit Off A Snake’s Head, Watch Video
 ఆయా దేశాల్లో కష్టాల కడలిలో విద్యుత్ వినియోగం

ఆయా దేశాల్లో కష్టాల కడలిలో విద్యుత్ వినియోగం

గతేడాది అంతర్జాతీయంగా డిసెంబర్‌లో బిట్‌కాయిన్‌ ధర పతాకస్థాయికి చేరింది. దీంతో జనం వీటి కోసం ఎగబడ్డారు. ఫలితంగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోయింది. నవంబర్‌లో దీంతో 30శాతం విద్యుత్ వినియోగం పెరిగింది. ప్రపంచంలో వినియోగించే విద్యుత్‌లో 0.13శాతం బిట్‌కాయిన్లే వినియోగించుకుంటున్నట్లు సమాచారం. బిట్‌కాయిన్ల వినియోగం పెరిగిపోతే విద్యుత్ వినియోగంలో 2019 జులైనాటికి అమెరికాను దాటేస్తుందని లెక్కలు చెబుతున్నాయి. 2020 నాటికి ప్రపంచలో అత్యధిక విద్యుత్‌ను బిట్‌కాయిన్లే వినియోగించుంటాయి.

 నైజీరియా అవసరాల కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగం

నైజీరియా అవసరాల కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగం

ప్రస్తుతం బిట్‌కాయిన్లు 32 టెరావాట్‌ అవర్స్‌ విద్యుత్ వినియోగిస్తున్నాయి. ఇది సెర్బియా దేశం వినియోగించుకునే విద్యుత్‌తో సమానం. ఆఫ్రికాలో పెద్దదేశమైన నైజీరియా కంటే ఎక్కువ. బ్లాక్‌ చైన్‌ లావాదేవీలను పబ్లిక్‌ లెడ్జర్‌కు అనుసంధానించడానికి వర్క్‌ స్టేషన్లు పనిచేస్తాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లలో ఏకకాలంలో ఉండే గణిత సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. పదినిమిషాల్లో దీనిని పరిష్కరించాక.. మళ్లీ అటువంటి సమస్యే మళ్లీ ఉత్పన్నమవుతుంది. ఇలా క్రమంగా జరుగుతుండటంతో తలెత్తే సమస్యలు జఠిలంగా మారతాయి. ఫలితంగా కంప్యూటర్లు ఎక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటాయి. ప్రపంచంలోని 500 అత్యంత వేగవంతమైన కంప్యూటర్లు వినియోగించుకునే విద్యుత్ కంటే బిట్‌కాయిన్‌ నెట్‌వర్క్‌ లక్ష రెట్లు అధికంగా వినియోగించుకుంటుంది. ఫలితంగా బిట్‌కాయిన్లను మైనింగ్‌ చేసే దేశాల్లో విద్యుత్ కొరత ఏర్పడి కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 బిట్ కాయిన్ల స్వర్గం చైనా

బిట్ కాయిన్ల స్వర్గం చైనా

ఒకప్పుడు చైనా బిట్‌కాయిన్ల మైనింగ్‌ స్వర్గం వంటిది. ఇక్కడ బొగ్గును మండించి అత్యంత చౌకగా విద్యుత్తును ఉత్పత్తి చేసేవారు. కానీ విద్యుత్ వినియోగం పెరిగిపోయి ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడటంతో చైనా బిట్‌కాయిన్‌ మైనర్లు, ఎక్స్‌ఛేంజిలపై విరుచుకుపడుతోంది. మరోపక్క చైనా కర్బన ఉద్గారాలు కూడా భారీగా పెరిగిపోయాయి. చాలా మంది బిట్‌కాయిన్‌ మైనర్లు చైనాలోని మారుమూల ప్రదేశాల్లో మైనింగ్‌ కార్యకలాపాలను మొదలుపెట్టారు. వీరు ప్రధాన విద్యుత్ గ్రిడ్‌ నుంచి కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారులతో ఒప్పందం చేసుకొని కరెంటు కొనుగోలు చేస్తున్నారు. ఇది చైనా నిబంధనలకు విరుద్ధం.

 ఐస్ లాండ్, కెనడాల నుంచి బిట్ కాయిన్ మైనింగ్ ఇలా

ఐస్ లాండ్, కెనడాల నుంచి బిట్ కాయిన్ మైనింగ్ ఇలా

మరో పక్క ప్రపంచంలోని మూడొంతుల మంది బిట్‌కాయిన్‌ మైనర్లు చైనాలోనే చేరారు. జింగ్‌యాంగ్‌, ఇన్నర్‌ మంగోలియా, సిచ్‌హుఆన్‌, యున్నాన్‌లో ఎక్కవగా మైనింగ్‌ చేస్తున్నారు. దీంతో చైనా వీరిపై పోలీసులతో దాడులు చేయిస్తోంది. భారీగా పన్నులు విధిస్తోంది. ఫలితంగా ఇప్పుడు బిట్‌కాయిన్‌ మైనర్లు ఆ దేశం నుంచి శీతల ప్రదేశాలైన ఐస్‌లాండ్‌, తూర్పుయూరోప్‌, రష్యా, కెనడాలకు వెళ్లి అక్కడ మైనింగ్‌ బిట్‌కాయిన్‌ మైనింగ్ ప్రారంభించడం గమనార్హం.

English summary
Bitcoin has become the world’s premier virtual currency, and although it exists only online, it runs up enormous energy costs in the real world. Verifying bitcoin transactions is so energy intensive the currency tops 159 individual countries in energy consumption, according to data consultant Alex de Vries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X