వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2018లో రైల్వే బడ్జెట్‌: జీఎస్టీతో తగ్గిన వసూళ్లు.. ఒత్తిడితో తప్పని నిధుల కోత

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దాదాపు ఏడు నెలల క్రితం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో ప్రభుత్వానికి పరోక్ష పన్నుల రూపేణా ఆదాయం తగ్గుముఖం పట్టింది. దీంతో వివిధ శాఖల నిధులను కేటాయించడంలో ఆర్థిక శాఖ ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. ఇదే ఒత్తిడి రైల్వేశాఖకు కూడా వర్తిస్తుందని అంటున్నారు. ఇటీవల రైల్వేశాఖ మంత్రి ఒక సమావేశంలో మాట్లాడుతూ స్థూల బడ్జెట్ మద్దతు (జీబీఎస్‌) లేకున్నా రైల్వేలు సమర్థంగా సేవలు అందించగలవని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ కేటాయింపులపై ఆధారపడే పరిస్థితి నుంచి రైల్వేలను బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందనడానికి గోయల్‌ వ్యాఖ్యలే నిదర్శనం. దీని ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్ల బడ్జెట్ కోత విధించే అవకాశం ఉన్నది.
ఇలా రైల్వే మంత్రి గోయల్‌ అన్నారో లేదో ఆర్థిక శాఖ రైల్వేలకు కేటాయించే జీబీఎస్‌లో కోత విధించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవసరమైన మొత్తం లోటును పూడ్చుకునేందుకు ఆస్తుల విక్రయం, అప్పులు వంటి ఇతర మార్గాలను ఆశ్రయించాల్సి ఉంటుంది.

గతేడాది అంచనాలు ఇలా రూ.1.31 లక్షల కోట్లు

గతేడాది అంచనాలు ఇలా రూ.1.31 లక్షల కోట్లు

గత ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన రూ.1.31లక్షల కోట్ల మూలధన వ్యయంలో ప్రభుత్వ వాటా (జీబీఎస్‌) కింద సవరించిన అంచనాల ప్రకారం రూ.55వేల కోట్లను ఇచ్చేందుకు ఆర్థిక శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ, ప్రభుత్వానికి రావాల్సిన పరోక్ష పన్నుల ఆదాయం తగ్గిపోవడంతో ఆర్థిక శాఖ తీవ్ర ఒత్తడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రైల్వేకు ప్రకటించిన జీబీఎస్‌లో దాదాపు 27శాతం అంటే రూ.15వేల కోట్లకు కోత విధించవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సారి రైల్వేలు కేవలం రూ.40వేల కోట్లను మాత్రమే ఆర్థిక శాఖ నుంచి పొందనున్నట్లు సమాచారం. ఇదీ 2016 - 17లో సవరించిన అంచనాల ప్రకారం కేటాయించిన రూ.46.35 వేల కోట్ల కంటే తక్కువే. ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బడ్జెట్ మద్దతు తగ్గించడానికి కారణం రైల్వేలను లాభాల బాట పట్టించే మార్గాలు కనిపించకపోవడమేనని తెలుస్తున్నది.

సంస్థాగత మదుపర్ల నుంచి నిధుల సమీకరణ

సంస్థాగత మదుపర్ల నుంచి నిధుల సమీకరణ

రైల్వే రక్షణ ప్రాజెక్టులకు నిధులను అందించే మార్గాల్లో జీబీఎస్‌ ఒక మార్గం మాత్రమే. జీబీఎస్‌లో కోతతో ఏర్పడ్డ లోటును అదనపు బడ్జెట్ వనరుల (ఈబీఆర్) మార్గంలో పూరించుకోవచ్చు అని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. దీంతో ప్రస్తుతం అప్పులు పొందడం, ఆస్తుల బదలాయింపు, మార్కెట్‌ నుంచి సొమ్మును తెచ్చుకోవడం, సంస్థాగత మదుపుదారుల ద్వారా నిధులు వంటి అంశాలను రైల్వేశాఖ పరిశీలిస్తోంది. లాభదాయక, ఆదాయాలు దృష్టిలో పెట్టుకొని ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షించడం కొంత కష్టమైన పనిగా మారుతుంది.

రూ. 60 వేల కోట్ల బడ్జెట్ మద్దతు

రూ. 60 వేల కోట్ల బడ్జెట్ మద్దతు

వచ్చే ఏడాది రూ.1.46లక్షల కోట్ల వ్యయ ప్రణాళికలు ఉన్నట్లు సమాచారం. దీనిలో ప్రభుత్వం నుంచి రూ.60వేల కోట్లు అందుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే రైల్వేశాఖ రక్షణపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో పురాతన సిగ్నలింగ్‌ వ్యవస్థను సమూలంగా మార్చివేయవచ్చు. దీనికి సుమారు రూ.60వేల కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టును బడ్జెట్‌లో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. రూ.10వేల కోట్లతో 8,000 కిలోమీటర్ల పాత ట్రాక్‌లను ఆధునికీకరించవచ్చు.

రైల్వేలకు క్రమంగా తగ్గనున్న నిధుల మద్దతు

రైల్వేలకు క్రమంగా తగ్గనున్న నిధుల మద్దతు

ఐదేళ్లలో మొత్తం రూ.8.56లక్షల రైల్వే ప్రణాళికల్లో్ కేవలం 30శాతం మాత్రమే ప్రభుత్వం నుంచి జీబీఎస్‌గా అందవచ్చని భావిస్తున్నారు. 28శాతం రుణాల రూపంలో పొందాల్సి ఉంటుంది. అంతర్గత వనరుల ద్వారా 15శాతం పొందే అవకాశం ఉంది. ఈ ప్రణాళికలో అత్యధికంగా కొత్త మార్గాల అనుసంధానికి వెచ్చించనున్నారు. దీంతో పాటు విద్యుదీకరణ, రక్షణకు కూడా భారీగానే ఖర్చుపెట్టనున్నారు.

English summary
New Delhi: Budgetary support to the Indian Railways may be cut by at least Rs 150 billion or 27 percent in the upcoming Union Budget 2018. It is no secret that the railways is finding it hard to maintain a profit, due to several conditions and factors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X