వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాభ నష్టాలిలా: మోదీ కేర్‌తో కార్పొరేట్లకే మేలు.. మొబైల్ సంస్థలు తరలి రావాల్సిందే!

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాది చివరిలోనే దూసుకొస్తాయన్న సంకేతాలు.. దేశవ్యాప్తంగా అన్నదాతల ఆందోళన.. మేకిన్ ఇండియా పేరిట ఉపాధి కల్పనకు తీసుకున్న చర్యలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన 2018 19 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఉన్నాయి. గురువారం పార్లమెంట్‌కు సమర్పించారు. నిరాశానిస్పృహల్లో చిక్కుకున్న అన్నదాతను ఆదుకునేందుకు, గ్రామీణులకు చేయూతనిచ్చేందుకు పెద్దపీట వేశారు.
వృద్ధిరేటు పెంచడానికి, ఉద్యోగాల కల్పన, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ బడ్జెట్‌లో రైతులు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, హెల్త్‌కేర్ సంస్థలు భారీ లబ్ధిదారులు. బాండ్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయిన వారిలో ఉన్నారు.

అపోలోకు పాజిటివ్.. ఆపిల్‌కు నెగెటివ్ ఇలా

అపోలోకు పాజిటివ్.. ఆపిల్‌కు నెగెటివ్ ఇలా

ప్రధాని నరేంద్రమోదీ, నీతి ఆయోగ్, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం సలహాల మధ్య విత్త మంత్రి అరుణ్ జైట్లీ దాదాపుగా ఎన్నికల బడ్జెట్‌ను ప్రజల ముంగిట్లోకి తెచ్చారన్న అభిప్రాయం వినిపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన ప్రతిష్ఠాత్మక ‘ఆరోగ్య బీమా' పథకం వల్ల దేశవ్యాప్తంగా హాస్పిటల్స్ నెట్ వర్క్ గల ‘అపోలో' గ్రూపుకే ఎక్కువగా లబ్ది చేకూరుతుందన్న విమర్శ ఉంది. ఇక మొబైల్ మార్కెట్‌లో భారత్ మొదటి స్థానంలో ఉన్నదన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరికీ ఇష్టమైన మొబైల్ ఫోన్ ‘ఆపిల్ ఐ ఫోన్'. దీని కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడం. కానీ తాజా బడ్జెట్ ప్రతిపాదనలతో దిగుమతి సుంకం తడిసి మోపెడవుతుంది. దానికి బదులు భారతదేశంలోనే ప్రధాని నరేంద్రమోదీ మేకిన్ ఇండియా పథకం కింద ఉత్పాదక యూనిట్ ఏర్పాటు చేసుకుంటే ఆ సంస్థకూ లాభాల పంటే. లేదంటే ఇక ఆపిల్ ఐ ఫోన్ సంపన్నులకే పరిమితం కానున్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ఇలా మేలు

వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ఇలా మేలు

రైతులు పండించిన పంటలకు 1.5 రెట్లు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పిస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ల నిర్మాణానికి భారీగా పెట్టుబడులు పెడుతామని వాగ్దానం చేశారు. దీనివల్ల నీటి పారుదల, ఆక్వాకల్చర్ ప్రాజెక్టులతోపాటు వివిధ గ్రామీణ పథకాలకు భారీగా నిధులు సమకూరుతాయి. వ్యవసాయ పంప్‌సెట్ల కోసం రైతులు ఏర్పాటు చేసుకున్న సౌర విద్యుత్ యూనిట్ల నుంచి ఉత్పత్తిచేసే అదనపు విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. దీని వల్ల వ్యవసాయ అనుబంధ కంపెనీలు లబ్ధి పొందవచ్చు. శక్తి పంప్స్ ఇండియా, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్, కేఎస్బీ పంప్స్, కిర్లోస్కర్ బ్రదర్స్, అవంతి ఫీడ్స్, వాటర్ బేస్, జేకే అగ్రి జెనెటిక్స్, పీఐ ఇండస్ట్రీస్ వంటి సంస్థలకు లబ్ది చేకూరుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

 మోదీ కేర్ విధి విధానాలు సిద్ధం కావాలి

మోదీ కేర్ విధి విధానాలు సిద్ధం కావాలి

కేంద్ర ప్రభుత్వం నూతనంగా జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రతిపాదించింది. దీని ద్వారా ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం లభిస్తుంది. 10 కోట్ల కుటుంబాల్లోని 50 కోట్ల మందికి లబ్ది చేకూరనున్నది. అయితే ఈ పథకం అమలు తీరు, విధి విధానాలేమిటో ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నది. తద్వారా దేశంలోనే అతిపెద్ద హాస్పిటల్ కంపెనీ అపొలో హాస్పిటల్స్‌తోపాటు ఫొర్టిస్ హెల్త్‌కేర్‌లకు ప్రయోజనం చేకూరవచ్చు.

 ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ సంస్థలకు ఇలా ప్రయోజనాలు

ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ సంస్థలకు ఇలా ప్రయోజనాలు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణులు కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. దీంతో పరిస్థితి తీవ్రతను బీజేపీ నాయకత్వం గుర్తించింది. అందుకు అనుగుణంగా వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో మారుమూల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దీంతో ప్రజల వినియోగ సామర్థ్యం ఎక్కువవుతుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలకు ఎఫ్‌ఎంసీజీ వస్తువులతో కూడిన షాపింగ్ మాల్స్ చేరుకున్నాయి. కనుక ఆయా రోజువారీ ఇంటి వినియోగ వస్తువులకు గిరాకీ పెరిగే అవకాశం పుష్కలంగా ఉన్నది. వాటిల్లో హిందూస్థాన్ యూనీ లీవర్, బ్రిటానియా, మారికో వంటి సంస్థలకు లబ్ది చేకూరడమే కాదు.. ఆయా సంస్థల షాపింగ్ మాల్స్‌లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఆటోమొబైల్ రంగంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ప్రత్యేకించి ట్రాలీలు, ట్రాక్టర్లతో రైతులకు ఎక్కువగా ఉపయోగం. వాటిని తయారు చేస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా, లార్సెన్ టర్బో వంటి సంస్థల ఉత్పత్తులకు డిమాండ్ పెరుగనున్నది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నిధులు ఖర్చు చేయడం వల్ల.. పంటకు కనీస మద్దతు ధర పెంచగలిగితే గ్రామీణుల్లో హీరో మోటో కార్ప్ వంటి ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు లబ్ధి పొందనున్నాయి.

విమానాశ్రయాల నిర్మాణం నిర్ణయంతో జీఎంఆర్, జీవీకేలకు మేలు

విమానాశ్రయాల నిర్మాణం నిర్ణయంతో జీఎంఆర్, జీవీకేలకు మేలు

గ్రామీణ భారతం నుంచే పసిడికి 60 శాతం డిమాండ్ ఉంటుంది. బడ్జెట్‌లో గ్రామీణ, వ్యవసాయ ఆదాయాభివృద్ధిపై దృష్టి పెట్టిన నేపథ్యంలో రైతులకు లభించే ఆదాయం వల్ల దేశంలోని ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థలకు లబ్ధి చేకూరనున్నది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమానాశ్రయాల నిర్మాణాన్ని విస్తరిస్తామని ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి సంస్థలకు ప్రయోజనం లభిస్తుంది.

 యాపిల్, శ్యామసంగ్ భారత్‌కు తరలిరాక తప్పదా?

యాపిల్, శ్యామసంగ్ భారత్‌కు తరలిరాక తప్పదా?

దేశీయ పారిశ్రామిక ఉత్పత్తిని పెంపొందించేందుకు ఆర్థిక మంత్రి జైట్లీ ఊతమిచ్చే చర్యలు చేపట్టారు. ఇందులో మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని 15 నుంచి 20 శాతానికి పెంచారు. దీనివల్ల యాపిల్, సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థల లాభాలు తగ్గుముఖం పట్టనున్నాయి. ప్రపంచంలోనే శరవేగంగా పెరుగుతున్న మొబైల్ ఫోన్ల మార్కెట్ గల భారత్‌లో లాభాలు పొందాలంటే స్థానికంగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. మూడేళ్ల క్రితమే ప్రధాని నరేంద్రమోదీ.. దేశీయంగా పరిశ్రమల ఏర్పాటు కోసం ‘మేకిన్ ఇండియా' నినాదం ఇచ్చారు. దీని స్ఫూర్తిగా మొబైల్ తయారీ సంస్థలు తమ లాభాలు పెంచుకోవాలంటే భారతదేశంలోనే ఉత్పాదక యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే స్థానిక యువతకు ఒకింత ఉపాధి లభించే అవకాశాలు మెండుగా ఉన్నది.

 లక్ష్యాన్ని చేరుకోని ద్రవ్యలోటు

లక్ష్యాన్ని చేరుకోని ద్రవ్యలోటు

ఊహించిన దానికంటే ప్రభుత్వ వ్యయ పరిమితి తక్కువగా ఉన్న నేపథ్యంలో బాండ్ ఇన్వెస్టర్లకు ఈసారి బడ్జెట్‌లో స్వల్ప ఊరటే లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యం 3.2 శాతాన్ని అందుకోవడం కష్టతరంగా మారిన నేపథ్యంలో బాండ్ల ఇన్వెస్టర్లకు ఆశించిన స్థాయిలో లాభాలు చేకూరే అవకాశాలు లేవు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల వంటి భారీ బాండ్ ఇన్వెస్టర్ల ఆదాయం ప్రభావితం కానున్నది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు జారీ చేసే బాండ్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ పెంపుతో ఇలా భారం

హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ పెంపుతో ఇలా భారం

ఈక్విటి ఇన్వెస్ట్‌మెంట్లలో దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్ను (క్యాపిటల్ గెయిన్స్ టాక్స్) విధించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఆర్థిక సేవల సంస్థల్లో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బ తినే అవకాశం ఉన్నది. దీనివల్ల ఐడీఎఫ్‌సీ లిమిటెడ్, రిలయన్స్ క్యాపిటల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ వంటి మ్యూచువల్ ఫండ్ సంస్థలు.. ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండ్డర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలపై ప్రతికూల ప్రభావం పడనున్నది. దీనికితోడు కోట్ల మంది పేదలకు చౌకగా ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ ఆకాంక్షలతో కూడిన ఆరోగ్య పథకాలు అమలు చేసేందుకు అవసరమైన నిధులు సేకరించేందుకు ‘హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లెవీ'ని మూడు శాతం నుంచి నాలుగు శాతానికి పెంచేసింది. ఇది అన్ని వస్తువుల కొనుగోళ్లకు, సేవల వినియోగానికి వర్తిస్తుంది. దీంతో ప్రతి ఒక్క వస్తువు కొనుగోలు, సేవల ప్రక్రియ ఒకింత వ్యయభరితం కానున్నది.

రక్షణకు జీడీపీలో 1.58 శాతం కేటాయింపులు మాత్రమే

రక్షణకు జీడీపీలో 1.58 శాతం కేటాయింపులు మాత్రమే

ఆర్థిక మంత్రి జైట్లీ సైనిక బలగాలను ప్రశంసించారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కోసం పారిశ్రామిక స్నేహపూర్వక విధానాన్ని అమలులోకి తెస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రక్షణ శాఖ బడ్జెట్ దాదాపు 7.81శాతం అధికం కాగా మొత్తం బడ్జెట్ విలువ (రూ.24, 42, 213కోట్లు)లో 12.1శాతం భాగంగా ఉన్నది. స్థూల జాతీయోత్పత్తి రేటు (జీడీపీ)లో మాత్రం రక్షణ బడ్జెట్ 1962 చైనా యుద్ధం తర్వాతి కంటే చాలా తక్కువ శాతం నిధులను కేటాయించారు. 1962 అక్టోబర్‌లో చైనా యుద్ధం ముగిసిన అనంతరం 1963లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రక్షణ శాఖ బడ్జెట్ జీడీపీలో 2.3శాతం కాగా గురువారం నాటి కేటాయింపులు జీడీపీలో 1.58 శాతమే ఉండటం గమనార్హం. రక్షణ రంగ వ్యయం కోసం భారీగా నిధులు కేటాయిస్తున్న సంకేతాలేమీ లేవు. దీనివల్ల భరత్ ఫొర్జ్ వంటి సంస్థలు లబ్ది పొందే అవకాశం లేదు.

 బిట్ కాయిన్ల భరతం పడతామన్న జైట్లీ

బిట్ కాయిన్ల భరతం పడతామన్న జైట్లీ

వ్యాపార లావాదేవీల రికార్డుల నిర్వహణకు బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడే విషయాన్ని పరిగణనలకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినా.. బిట్ కాయిన్లను చట్టబద్ధమైన కరెన్సీగా పరిగణించబోమని తేల్చి చెప్పింది. దీని ప్రకారం బిట్ కాయిన్ లావాదేవీలను కొనసాగించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకునే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. అదే జరిగితే బిట్ కాయిన్ లావాదేవీలు నిర్వహిస్తున్న వ్యాపారులు, ఎక్స్చేంజ్ లు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవల బిట్‌కాయిట్ లాంటి క్రిప్టోకరెన్సీలు ప్రపంచవ్యాప్తంగా హల్‌చల్ సృష్టించాయి. దీంతో భారత్‌లోనూ వర్చువల్ కరెన్సీ పట్ల ఆసక్తి పెరిగింది. ఇప్పటికే చాలా మంది బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్బీఐ కూడా హెచ్చరికలు జారీ చేసింది. బిట్ కాయిన్ లావాదేవీల పట్ల జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించింది. బిట్ కాయిన్‌ని రూపుమాపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

English summary
With national polls looming next year -- and possibly as early as late 2018 -- Finance Minister Arun Jaitley has rolled out a budget designed to help distressed farmers and rural areas while boosting growth, jobs and private investment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X