వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2018లో బడ్జెట్: వేతన జీవులకు గుడ్ న్యూస్!.. 80-సీ కింద రూ.2 లక్షలకు మినహాయింపు పెంపు?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రతియేటా మార్చి, ఏప్రిల్ నెలల్లో వేతన జీవులు తమ వేతనాలపై చెల్లించాల్సిన ఆదాయం పన్ను.. మినహాయింపులు పొందే అవకాశాలను ఒకసారి పరిశీలించుకుంటారు. ఐటీ చట్టం 80 - సీ సెక్షన్ కింద వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో మినహాయింపులు పెంచే దిశగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయపన్ను చట్టం-1961లోని సెక్షన్‌ 80సీ కింద ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచనున్నట్లు భావిస్తున్నారు. ఇంతకుముందు 2014లో రూ. లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇది 80సీలోని ఒకట్రెండు పన్ను ఆదా అంశాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
సెక్షన్‌ 80సీ పరిమితిని రూ.2 లక్షలకు పెంచితే అదనంగా ఆదా అయ్యే మొత్తం రూ.2,575 (10%), రూ.10,300 (20%), రూ.15,450 (30%)గా ఉండనున్నది. తద్వారా 2016 నవంబర్ ఎనిమిదో తేదీన నోట్ల రద్దు, గతేడాది జూలైలో జీఎస్టీ అమలులోకి తేవడంతో ఆర్థిక వ్యవస్థలో మందగమనం సాగుతున్నట్లు ప్రభుత్వం ఒప్పుకున్నట్లే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఐటీ చట్టంలోని 80 - సీ ప్రకారం మినహాయింపు పరిమితి పెంచడం వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం ఆదాయం పన్ను రూపేణా వచ్చే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గుముఖం పడుతుందని విశ్లేషకుల అంచనా. దీని నుంచి తప్పించుకునేందుకు ఆర్తిక మంత్రి అరుణ్ జైట్లీ ట్యాక్స్ బేస్ ను విస్త్రుత పరిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Budget 2018: For income tax returns payment relief, common man eyes Section 80C hike by FM Arun Jaitley

ప్రస్తుతం ఎల్ఐసీ, ఈక్విటీ పొదుపు, టైం డిపాజిట్లకే 80 - సీ పరిమితి వర్తింపు
ప్రస్తుతం సెక్షన్‌ 80-సీ కింద జీవితబీమా, ఈక్విటీ అనుసంధాన పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌), ఐదేళ్ల తపాలా టైమ్‌ డిపాజిట్లు, వయోవృద్ధుల పొదుపు పథకం(ఎస్‌సీఎస్‌ఎస్‌), సుకన్య సమృద్ధి ఖాతా, ప్రజాభవిష్యనిధి (పీపీఎఫ్‌), జాతీయ పొదుపు పత్రం (ఎన్‌ఎస్‌సీ), ఐదేళ్ల పన్ను ఆదా బ్యాంకు డిపాజిట్లు, ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌) తదితర పెట్టుబడులు, వ్యయాలపై స్థూల మొత్తం ఆదాయంలో ఏటా రూ.1.5 లక్షల దాకా డిడక్షన్‌కు అవకాశం ఉంది. ఎవరైనా రూ.1.5 లక్షల్ని ఇందులో ఏదైనా ఒక పథకంలోగానీ, వేర్వేరుగాగానీ పెట్టవచ్చు. బోధన రుసుములు, గృహ రుణాల చెల్లింపులు వంటి వ్యయాల ద్వారా కూడా ప్రయోజనం పొందవచ్చు.

Budget 2018: For income tax returns payment relief, common man eyes Section 80C hike by FM Arun Jaitley

గృహరుణాల ముందస్తు చెల్లింపునకు రూ.50 వేల రాయితీ
మోదీ ప్రభుత్వం గృహ నిర్మాణ రంగాన్ని భారీగా ప్రోత్సహించేందుకు యత్నిస్తున్న క్రమంలో ఇళ్ల కొనుగోలుదారులకు కొన్ని ప్రోత్సాహకాలు గృహరుణంలో అసలు మొత్తం చెల్లింపులో అదనంగా రూ.50 వేలదాకా ప్రయోజనం దక్కొచ్చు. ప్రస్తుతం గృహరుణం ఉన్న వారు ముందస్తు చెల్లింపు ద్వారా ప్రయోజనాన్ని, కొత్తగా ఇళ్లు కొనుగోలు చేసేవారు గృహ రుణాల ద్వారా అదనపు ప్రోత్సాహకాల్ని పొందే అవకాశం ఉంది. గృహరుణం కాకుండా సెక్షన్‌ 80సీ కింద మినహాయింపు పరిమితి పెంపుదలను ఈఎల్‌ఎస్‌ఎస్‌ పెట్టుబడులకు పరిమితం చేసే అవకాశం ఉంది. ఇవి మూడేళ్ల కాలవ్యవధితో, పన్ను ప్రయోజనాల్ని అందించే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు. దేశంలో ఈక్విటీ పెట్టుబడుల సంస్కృతి ఆశావహంగా ఉండటంతో ప్రభుత్వం దీనిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. 2018 బడ్జెట్‌లో టెర్మ్‌ బీమా పథకాల కోసం సెక్షన్‌ 80సీ మినహాయింపు పరిమితి పెంచేట్లయితే బీమా కవరేజీ పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్జిత వ్యక్తి మరణిస్తే కుటుంబ సభ్యుల జీవనప్రమాణాలు పడిపోకుండా సాగే అవకాశముంది.

English summary
Budget 2018 is just a couple of weeks away and the most common expectation of the common man is the increase in the Section 80C deduction limit by Finance Minister Arun Jaitley. More because the Section 80C deduction limit was revised last time in the Budget 2014 and any revision in it now will provide some relief to the aam aadmi, reeling under rising inflation and higher prices for a long time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X