వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2018లో బడ్జెట్: చక్కెర మిల్లులకు చేయూత.. ఎస్డీఎఫ్ నిధికి రూ.500 కోట్లు?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చెరకు నుంచి చక్కెర ఉత్పత్తి చేసే చక్కెర మిల్లులను ఆదుకునేందుకు షుగర్ డెవలప్ ఫండ్ (ఎస్డీఎఫ్) ఏర్పాటు చేసింది. ఈ దశలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టే బడ్జెట్ ప్రతిపాదనల్లో చక్కెర మిల్లుల యాజమాన్యాలకు ఊరటనిచ్చే చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018 - 19 బడ్జెట్‌లో చక్కెర అభివ్రుద్ధి నిధి (ఎస్డీఎఫ్) కింద కేటాయింపులు రూ.500 కోట్లకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఎస్డీఎఫ్‌ను ఆహార వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్వహిస్తున్నది. దీని ద్వారా చక్కెర మిల్లులకు తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తారు. గతేడాది వరకు చక్కెర మిల్లుల నుంచి వసూలు చేసిన సెస్‌ను ఈ ఎస్డీఎఫ్‌లో జమ చేశారు.

షుగర్ సెస్ స్థానే ఎస్డీఎఫ్ నిధి
గతేడాది జూలై ఒకటో తేదీ నుంచి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి రానుండటంతో షుగర్ సెస్ రద్దయి పోయింది. దీన్ని ద్రుష్టిలో పెట్టుకుని ముందస్తుగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.496 కోట్ల మేరకు ఎస్డీఎఫ్ నిధికి ముందే కేటాయించారు. ఆర్థిక శాఖ అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎస్డీఎఫ్ నిధిని స్వల్పంగా రూ.500 కోట్లకు పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Budget 2018 May Allot Rs. 500 Crore For Sugar Development Fund

1982లో ఎస్డీఎఫ్ ఏర్పాటు
రివాల్వింగ్ ఫండ్ అయిన ఎస్డీఎఫ్ నుంచి తీసుకున్న రుణం సంబంధిత చక్కెర మిల్లు యాజమాన్యం చెల్లిస్తే, ఇతర చక్కెర మిల్లులకు రుణ పరపతి కల్పిస్తారు. అదీ కూడా నిధుల లభ్యతను బట్టి రుణాలు మంజూరు చేయనున్నారు. ఎస్డీఎఫ్‌ను 1982 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దేశంలోని చక్కెర పరిశ్రమను అభివ్రుద్ధి చేసేందుకు ఆర్థిక సాయం చేయడానికి ఎస్డీఎఫ్ ఏర్పాటు చేసింది.

Budget 2018 May Allot Rs. 500 Crore For Sugar Development Fund

చక్కెర పరిశ్రమలో సంక్షోభ నివారణకు ఎస్డీఎఫ్
ఎస్డీఎఫ్ నిధిని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చక్కెర మిల్లులు, పరిశ్రమలకు సుమారు రూ.7500 కోట్లు మంజూరు చేశారు. ఇటీవలి కాలంలో చక్కెర పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రతి సంక్షోభాన్ని అధిగమించేందుకు ఎస్డీఎఫ్ నిధిని ఆద్యంతం వినియోగిస్తోంది కేంద్రం. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఎ) సవరించిన అంచనాల ప్రకారం 2017 - 18 సంవత్సరంలో చక్కెర ఉత్పత్తిని 261 లక్షల టన్నులకు పెంచాలని నిర్ణయించింది. తొలుత దీన్ని 251 లక్షల టన్నులుగా ఐఎస్ఎంఎ నిర్ధారించింది.

English summary
NEW DELHI: The government may marginally raise the corpus for Sugar Development Fund (SDF) to Rs 500 crore in the upcoming Budget for 2018-19. SDF, managed by the food ministry, is used for lending money to mills at lower interest rates. Till last fiscal, the cess - collected from sugar mills - was deposited in it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X