వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2018లో బడ్జెట్: ఇల్లు కొనుగోళ్లపై రాయితీ ఆప్షన్లు.. ఇలా మెరుపులూ విరుపులూ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

Recommended Video

2018లో బడ్జెట్.. ఇల్లు కొనుగోళ్లపై రాయితీ ఆప్షన్లు..!

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు మరో 11 రోజుల గడువు ఉన్నది. అయితే ఈలోగా వివిధ రంగాలు, పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, నిపుణులు తమకు రాయితీలు కల్పించాలని కోరడం ఆనవాయితీ. అలాగే సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారూ తమకు ఒకింత వెసులుబాటు కల్పించాలని అభ్యర్థిస్తున్నారు.
2018 - 19 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనల్లో సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి ప్రయోజనం చేకూర్చే దిశగా స్వల్ప ఊరటనిచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకు రుణాల ద్వారా కొనుగోలు చేసే ఇళ్లపై వడ్డీ భారం తగ్గించాలన్న అభ్యర్థనలు వెలువడుతున్నాయి.

పన్ను పొదుపునకు ఇలా అవకాశాలు పుష్కలం

పన్ను పొదుపునకు ఇలా అవకాశాలు పుష్కలం

పన్ను చెల్లింపు దారుల్లో సొంతిల్లు కావాలని ఆకాంక్షించే వారు పన్ను పొదుపు చేసుకునే వెసులుబాటు కల్పించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అందునా 2022 నాటికి దేశంలోని ప్రతి పౌరుడి సొంతింటి కల సాకారం కావాలన్నది ప్రధాని నరేంద్రమోదీ ఆశయం మరి. మరెందుకు ఆలస్యం.. 2018 - 19 బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన వెంటనే సొంతిల్లు కొనుక్కోవాలని భావించే వారు హాయిగా కొనుగోలు చేసి లబ్ది పొందొచ్చు మరి.

కొత్తగా ఇంటి రుణాలు తీసుకుంటే అదనపు రాయితీలు

కొత్తగా ఇంటి రుణాలు తీసుకుంటే అదనపు రాయితీలు

సొంతిల్లు కట్టుకున్నవారైనా, కొనుగోలు చేసిన వారైనా ఆదాయం పన్ను చట్టం (ఐటీ యాక్ట్)లోని 80 - సీ నిబంధన కింద పన్ను చెల్లింపులో రూ.50 వేల నుంచి అంతకంటే ఎక్కువ మినహాయింపు పొందొచ్చు. ప్రస్తుతం ఇంటి రుణాలు తీసుకున్న వారికిది వర్తిస్తుంది. కొత్తగా రుణాలు తీసుకున్న రుణాలపై అదనపు రాయితీలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రకారం సొంతిల్లు కొన్న వారు తమ రుణంపై రూ.2 లక్షల వరకు వడ్డీ మినహాయింపు లభిస్తుంది.

ఇంటిని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి వసూళ్లు ప్రారంభం

ఇంటిని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి వసూళ్లు ప్రారంభం

ఉదాహరణకు రూ.40 లక్షల రుణాలపై 15 ఏళ్లకు 8.35 శాతం వడ్డీ వసూలు చేశారు. తొలి రెండేళ్లలో సుమారు రూ.3.28 లక్షలు, రూ.2.90 లక్షల వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి వారికి వడ్డీపై పన్ను రాయితీ ఇచ్చి వారికి వెసులుబాటు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇంటికి రుణం తీసుకున్నట్లైతే నిర్మాణం పూర్తి కాకముందు భాగాన్నిఐదు సమాన భాగాలుగా విభజిస్తారు. ఇందులో ఐదో వంతు వడ్డీరేటును పన్ను నుంచి మినహాయించేందుకు వీలు ఉంది. ఇంటిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి రుణ వసూళ్లు ప్రారంభం అవుతాయి.

బడ్జెట్ ప్రతిపాదనలు వెలువడ్డాకే పన్ను రాయితీపై స్పష్టత

బడ్జెట్ ప్రతిపాదనలు వెలువడ్డాకే పన్ను రాయితీపై స్పష్టత

దీని ప్రకారం ఐదేళ్ల వడ్డీ సుమారు 7.5 లక్షలను ఐదు భాగాలుగా విభజిస్తే రూ.1.5 లక్షల వడ్డీపై పన్ను రాయితీ లభిస్తుంది. దీని ప్రకారం రూ.25 లక్షలకు పైగా ఇంటి రుణం తీసుకున్న వారికి రూ.2 లక్షల వరకు పెంచే అవకాశం ఉన్నది. ఆదాయం పన్ను చెల్లింపుల్లో మినహాయింపుల్లో భాగంగా సొంతిల్లు కొనే వారికి ఐటీ యాక్ట్ 80ఈఈ విభాగాన్ని పున: ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా మరో రూ.50 వేల వరకు పన్ను మినహాయింపు వచ్చే అవకాశం ఉన్నది. దీని ప్రకారం మొత్తం పన్ను మినహాయింపు రూ. 2 లక్షలకే పరిమితం అవుతుందా? మించుతుందా? అన్నది బడ్జెట్ ప్రతిపాదనలు బయటపడితే గానీ తేలదు.

2016 ఏప్రిల్ నుంచి 2017 మార్చిలోపు రుణం మంజూరు కావాలి

2016 ఏప్రిల్ నుంచి 2017 మార్చిలోపు రుణం మంజూరు కావాలి

తొలిసారి ఇల్లు అందునా సొంతిల్లు కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ అదనపు రాయితీలు వర్తిస్తాయి. ఐటీ యాక్ట్ 80ఈఈ కింద ఏటా రూ.50 వేల పన్ను రాయితీ కల్పిస్తారు. ఇక మొత్తం ఇంటి విలువ రూ.50 లక్షలు మించకూడదు. బ్యాంకులో తీసుకునే రుణం రూ.35 లక్షల లోపే ఉండాలి. 2016 ఏప్రిల్ నుంచి 2017 మార్చి 31లోపు రుణం మంజూరై ఉండాలి. ఇప్పటికే రుణం తీసుకున్న వారు 2018 తర్వాత పన్ను రాయితీ ప్రయోజనాలు పొందొచ్చు.

ఏప్రిల్ తర్వాత రియల్ఎస్టేట్‌పై 12 శాతం జీఎస్టీ

ఏప్రిల్ తర్వాత రియల్ఎస్టేట్‌పై 12 శాతం జీఎస్టీ

ఇక వచ్చే ఏప్రిల్ నుంచి వస్తు సేవల పన్ను పరిధిలోకి ‘రియల్ ఎస్టేట్' రంగాన్ని తేవాలని కేంద్రం ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. సొంతిళ్లతోపాటు ఇతర భవన నిర్మాణాలపైనా జీఎస్టీ 12 శాతం అమలులోకి రానున్నది. దీని ప్రకారం ఇప్పటివరకు కట్టిన ఇళ్లతోపాటు ఏప్రిల్‌లోగా కట్టే ఇళ్లతో పోలిస్తే.. తర్వాత నిర్మించే ఇళ్లు మరింత ప్రియం కానున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

English summary
The government may use Budget 2018 to make owning a house slightly more affordable and even rekindle the interest of home buyers. These measures could be in the form of tax sops for home owners and those looking to buy property.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X