• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మెలిక పెట్టినా ‘మూడీస్’దీ ‘ఫిచ్’ మూడ్: అవి రెండు జరిగితే అంతే సంగతులు

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి విత్త మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలపై అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు పరస్పర విభిన్నంగా స్పందిస్తున్నాయి. మౌలిక వసతుల కల్పనకు జరిపిన కేటాయింపులను యథాతథంగా ఖర్చు చేయడం భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి జీవం పోయడమేనని అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ 'మూడీ'స్' పేర్కొన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు, ఆదాయంలో స్వల్ప తేడా ఉన్న స్థూలంగా వ్రుద్ధిరేటుపై చెప్పుకోదగిన ప్రభావం ఏమీ పడదని మూడీ'స్ వైస్ చైర్మన్ విలియం ఫోస్టర్ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 3.3 శాతంగా, 2018 - 19లో 3.5గా అంచనా వేసిన సంగతి తెలిసిందే.

ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సూచనలకు అనుగుణంగా ద్రవ్య నియంత్రణ చర్యల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యం 3.2, వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు మూడు శాతానికి తగ్గించాలని గతంలోనే కేంద్రం నిర్ణయించింది. గతంతో పోలిస్తే సవరించిన ద్రవ్య నియంత్రణ లక్ష్యాల్లో స్వల్ప తేడా ఉన్నా సంప్రదాయంగా భారత్ ద్రవ్య నియంత్రణ వ్యవస్థ పురోగతిపై ఎటువంటి ప్రభావం ఉండబోదని కూడా విలియం ఫోస్టర్ తేల్చి చెప్పారు.

వ్యయం అంచనాలు ఇబ్బందికరంగా ఉన్నాయన్న ‘మూడీ’స్

వ్యయం అంచనాలు ఇబ్బందికరంగా ఉన్నాయన్న ‘మూడీ’స్

మధ్యకాలిక లక్ష్యాల సాధనలో జీడీపీ - రుణ పరపతి రేటును 40 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం కూడా రుణ పరపతిలో దేశ స్వావలంభనకు మద్దతుగానే ఉంటుందన్నారు. స్వల్పంగా ద్రవ్యలోటు తగ్గిముఖం పట్టినా.. మూడీస్ అంచనాలకు అనుగుణంగానే దేశ ఆర్థిక ప్రగతి సజావుగా సాగుతుందని విలియం ఫోస్టర్ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో మౌలిక రంగం, బీమా రంగాలు, కార్పొరేట్ సంస్థలకు ఎక్కువగా మేలు చేకూరుతుందని మూడీస్ మరో ఉపాధ్యక్షుడు, సీనియర్ అనలిస్ట్ జాయ్ రాంకోత్గే వ్యాఖ్యానించారు. నిర్దేశిత అంచనాలకు అనుగుణంగా కేంద్రం ద్రవ్య నియంత్రణ చర్యలను పాటించగలిగితే వచ్చే ఏడాది ద్రవ్యలోటు లక్ష్యాలను చేరుకోగలమని విలియమ్ ఫోస్టర్ పేర్కొన్నారు. వ్యయం అంచనాలు ఇబ్బందికరంగా ఉన్న ఆదాయ సముపార్జన లక్ష్యాలను సజావుగానే చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

జీఎస్టీ వసూళ్లు తగ్గితే ద్రవ్యలోటు పెరిగే ముప్పు

జీఎస్టీ వసూళ్లు తగ్గితే ద్రవ్యలోటు పెరిగే ముప్పు

ఒకవేళ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఎక్కువ నిధులు కేటాయించినా.. జీఎస్టీ వసూళ్లు పెరగకపోయినా తదుపరి దశలో ద్రవ్యలోటు లక్ష్యాలు ఒకింత స్లిప్ అయ్యే అవకాశం ఉన్నదని మూడీస్ తెలిపింది. బడ్జెట్ ప్రతిపాదనల్లో గ్రామీణ ప్రాంతాలకు భారీగా నిధులను ఖర్చు చేస్తున్నామని పేర్కొన్న కార్పొరేట్ పన్ను తగ్గింపునకు చర్యలు తీసుకుంటామని విత్త మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దీనికి తోడు లోయర్ రేటెడ్ కార్పొరేట్ బాండ్లపై పెట్టుబడుల వల్ల రుణపరపతి సానుకూలంగా ఉంటుందని మూడీస్ వివరించింది. నిరంతరాయంగా మౌలిక వసతుల రంగంపై నిధులను ఖర్చు చేయడం వల్ల ప్రత్యేకించి బీమా రంగానికి మేలు చేకూరుతుందని అంచనా వేసింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిష్టాత్మక ‘జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం' పేరిట ప్రారంభించనున్న ‘మోదీ కేర్' కోసం మూడు జాతీయ ఆరోగ్య బీమా పథకాలను విలీనం చేయడం వల్ల అంతర్జాతీయంగా అత్యధిక పేదలకు ఆరోగ్య బీమా పథకం అందుబాటులోకి వస్తుందని అంచనా వేసింది.

వచ్చే ఏడాది ఏడు శాతం వద్దే జీడీపీ స్థిరీకరణ

వచ్చే ఏడాది ఏడు శాతం వద్దే జీడీపీ స్థిరీకరణ

రానున్న ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో జీడీపీ 7.5 శాతం స్థాయిలో వృద్ధి చెందుతుందని, దీనికి తక్కువ బేస్‌ కారణమని, ఆ తర్వాతి ఆరు నెలల్లో ఏడు శాతానికి తగ్గిపోతుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ పేర్కొంది. వృద్ధి రేటు పుంజుకున్నా గానీ, వాస్తవ సామర్థ్యం కంటే ఒక శాతం తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. ‘2017-18లో నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలతో వృద్ధి కనిష్టానికి (తక్కువ బేస్‌) చేరినందున 2018-19 ఏప్రిల్‌-సెప్టెంబర్‌ కాలంలో జీడీపీ 7.5 శాతానికి పుంజుకుంటుంది. రెండో అర్ధభాగంలో 7 శాతానికి తగ్గుతుంది. అయినా పాత జీడీపీ సిరీస్‌ ఆధారంగా మా అంచనాల కంటే ఒక శాతం తక్కువే' అని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ పేర్కొంది.

ద్రవ్య నియంత్రణ హామీ అమలు వాయిదా

ద్రవ్య నియంత్రణ హామీ అమలు వాయిదా

కేంద్ర ప్రభుత్వంపై అధిక రుణభారం దేశ వృద్ధిరేటును నిరోధించే అవకాశముందని ఫిచ్‌ రేటింగ్స్‌ అభిప్రాయపడింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ద్రవ్యలోటు 3.5శాతంగా ఉండే అవకాశముందని అంచనాపై ఫిచ్‌ స్పందించింది. ‘ఈ బడ్జెట్‌తో ప్రభుత్వానికి ఎదురయ్యే రుణభారం దేశ వృద్ధిరేటును నిరోధించే అవకాశాలు కన్పిస్తున్నాయి' అని ఫిచ్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌, భారత ప్రైమరీ సావరీన్‌ అనలిస్ట్‌ థామస్‌ రూక్మేకర్‌ అన్నారు. ద్రవ్యలోటు స్థిరంగా 3శాతం ఉండేలా చూస్తామన్న ప్రభుత్వ నిర్ణయం వాయిదా పడుతూ వస్తోందని థామస్‌ అన్నారు. దీని ప్రభావం వృద్ధిరేటుపై పడే అవకాశముందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

బిట్ కాయిన్ నిషేధించిన రెండు అగ్రదేశాల బ్యాంకులు

బిట్ కాయిన్ నిషేధించిన రెండు అగ్రదేశాల బ్యాంకులు

బిట్‌కాయిన్‌, క్రిప్టోకరెన్సీల కొనుగోలుకు క్రెడిట్‌ కార్డుల వినియోగాన్ని బ్రిటన్‌, అమెరికా బ్యాంకులు నిషేధించాయి. ఒక పక్క బిట్‌కాయిన్ల ధరలు పడిపోతుండటంతో క్రెడిట్‌ కార్డులు వినియోగించి కొన్నవారు తిరిగి చెల్లించే పరిస్థితులు ఉండకపోవచ్చని అనుమానించి బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. లియోడ్స్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ పీఎల్‌సీ ఆదివారం క్రిప్టో కరెన్సీల కొనుగోలుపై నిషేధం విధించాయి. మరోపక్క అమెరికా బ్యాంకింగ్‌ దిగ్గజం జేపీ మోర్గాన్‌, సిటీ గ్రూప్‌లు కూడా ఇటువంటి నిర్ణయాన్నే ప్రకటించాయి. సోమవారం ఒక్కరోజే బిట్‌కాయిన్‌ విలువ 7శాతం కుంగింది. ఇటీవల క్రిప్టోకరెన్సీల కొనుగోలుకు క్రెడిట్‌ కార్డుల వినియోగం పెరిగింది. ఈ విషయాన్ని పేమెంట్‌ నెట్‌వర్క్‌ మాస్టర్‌ కార్డ్‌ కూడా ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో వినియోగదారులు అప్పులు చేసి క్రిప్టోకరెన్సీలు కొనుగోలు చేయకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోపక్క బ్రిటన్‌ ప్రధాని థెరిస్సామే కూడా దీనిపై స్పందించారు. డిజిటల్‌ కరెన్సీలను క్రిమినల్స్‌ వినియోగిస్తున్న తీరుపై చర్యలు తీసుకుంటామన్నారు.

English summary
New Delhi: Global ratings agency Moody's has said that the Union Budget for 2018-19 strikes a balance between fiscal prudence and growth, and a "slight" slippage in fiscal deficit has no material impact on overall economic strength. The government has revised its 2018-19 fiscal deficit projections to 3.3 per cent of GDP and for the current fiscal year to 3.5 per cent of GDP, against original targets of 3 per cent and 3.2 per cent, respectively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X