వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2018 బడ్జెట్‌లో రైల్వే: అన్ని స్టేషన్లలోనూ ఇక ఎస్కలేటర్లు, లిఫ్టులు

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రైల్వే శాఖలోనూ పరిస్థితులకు అనుగుణంగా క్రమంగా మార్పు వస్తోంది. అర్బన్, సబ్ అర్బన్ రైల్వే స్టేషన్ల పరిధిలోనూ ఎస్కలేటర్లు, లిఫ్టులను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని రైల్వేశాఖ నిర్ణయానికి వచ్చింది. ఇందుకోసం ఇటీవలే రైల్వేశాఖ తన ప్రమాణాలను, మార్గదర్శకాలను సవరించుకున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం రైల్వేశాఖ తన పరిధిలోని అన్ని మార్గాల్లో ప్రయాణికులకు భద్రత కల్పించడంతోపాటు మౌలిక వసతుల కల్పన దిశగా అడుగులేస్తున్నది. దేశవ్యాప్తంగా అన్ని మేజర్ అర్బన్, సబర్బన్ రైల్వేస్టేషన్ల పరిధిలో 1100 లిఫ్టులు, మూడువేల ఎస్కలేటర్ల ఏర్పాటుకు రూ.3400 కోట్లను ఖర్చు చేయాలని ప్రతిపాదించినట్లు అంచనా.
తద్వారా రైల్వే స్టేషన్ల వద్ద వయోవ్రుద్ధులు, దివ్యాంగులతోపాటు ప్రయాణికులంతా సజావుగా ముందుకు కదిలేందుకు వెసులుబాటు కలుగుతుంది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలోని కండీవాలీ, మాతుంగ, బంద్రా, చర్చ్ గేట్, దాదర్, ఎల్ఫిన్ స్టోన్ రోడ్డు, మహాలక్ష్మి, జోగీశ్వరి ప్రాంతాల్లోని అన్ని రైల్వేస్టేషన్ల పరిధిలో 372 ఎస్కలేటర్లతోపాటు దేశవ్యాప్గంగా మిగతా రైల్వేస్టేషన్ల పరిధిలో 2589 ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేశాఖ అధికారి తెలిపారు.

2019లో ఏర్పాట్లపై ఇప్పటికే నిర్ధారణ పూర్తి

2019లో ఏర్పాట్లపై ఇప్పటికే నిర్ధారణ పూర్తి

భారీస్థాయిలో ఎస్కలేటర్లను, లిఫ్టులను ఏర్పాటు చేయడం వల్ల ఖర్చు తగ్గుముఖం పడుతుందని సమాచారం. ఒక ఎస్కలేటర్ ఖరీదు రూ.కోటి, ఒక లిఫ్టు ఖరీదు రూ.40 లక్షలు ఉంటుందని అంచనా. ఏ యేటికాయేడు ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేసేందుకు దేశవ్యాప్తంగా 25 వేల కేంద్రాలను గుర్తించారని సమాచారం. వాటి ఏర్పాటుకు రూ.8 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. అదే సమయంలో రైల్వేల్లో భద్రతకు పెద్దపీట వేస్తున్నది. మౌలిక వసతుల కల్పనకు కూడా ప్రాధాన్యం ఇస్తున్న రైల్వేశాఖ.. ఈ మేరకు 2018 - 19లో ఎస్కలేటర్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో నిర్ధారణైందని అధికార వర్గాలు తెలిపాయి.

మహిళా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట

మహిళా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట

రైల్వే భద్రతకు ఈసారి బడ్జెట్‌లో పెద్దపీట వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మోదీ ప్రభుత్వం రైళ్లలో మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యం కల్పించవచ్చని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. మహిళలు ప్రయాణించేందుకు రైళ్లను అత్యంత సురక్షితంగా తయారు చేయాలని భావిస్తున్నారు. దీంతోపాటు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపైనా అత్యధికంగా ఖర్చుచేయవచ్చని అంచనా. రైళ్లలోని మహిళల బోగీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పచ్చజెండా ఊపవచ్చు. దీనికోసం నిర్భయ నిధులను వినియోగించే అవకాశం ఉంది. తొలుత సబర్బన్‌ రైళ్లలోని కోచ్‌ల్లో వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మహిళల భద్రత కోసం ఇప్పటికే 182 నెంబర్‌ను ఏర్పాటు చేశారు. 344 ప్రధాన స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు మహిళల బోగీల్లో లైట్లు కచ్చితంగా పని చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు.

2020 నాటికి కాపలాలేని లెవల్ క్రాసింగ్‌ల తొలగింపు

2020 నాటికి కాపలాలేని లెవల్ క్రాసింగ్‌ల తొలగింపు

ప్లాట్‌ఫామ్‌లపై మరుగుదొడ్ల సంఖ్యను పెంచనున్నారు. ప్రతి ప్లాట్‌ఫామ్‌పై కనీసం రెండు మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనా పరిశీలనలో ఉంది. 2019 నాటికి అన్ని బోగీల్లో బయో టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నదీ ప్రభుత్వం లక్ష్యం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 1,115 బోగీల్లో వచ్చే ఏడాది నాటికి వీటిని ఏర్పాటు చేయాలనీ సంకల్పం. ఇందుకు బడ్జెట్‌లో కేటాయింపులు ఉండవచ్చు. ఈసారి కూడా రాష్ట్రీయ రైల్వే సంరక్ష కోశ్‌ (ఆర్ఆర్‌ఎస్‌కే‌) కు రూ.20వేల కోట్లను కేటాయించనున్నారు. ఈ నిధులతో మరిన్ని రక్షణ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా భద్రత లేని లెవెల్‌క్రాసింగ్‌లను తొలగించడం..రైల్వే ట్రాక్‌ల ఆధునికీకరణ, సిగ్నళ్ల వ్యవస్థను మెరుగుపర్చడం వంటివి చేయనున్నారు. ఇక దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 185 కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌లు ఉన్నాయి. వీటిని 2020 నాటికి పూర్తిగా తొలగించాలి. ఈసారి వీటికి కేటాయింపులు ఉంటాయని ఆశించవచ్చు.

English summary
Railways recently revised the criteria for making urban and suburban stations eligible for installation of escalators. With the aim of providing better amenities, Railways will make a budget provision of Rs 34 billion for installing about 3,000 escalators and 1,000 lifts at all major urban and suburban stations across the country. This will facilitate smooth movement of passengers, including old and physically-challenged people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X