వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర బడ్జెట్‌లో బంపరాఫర్, నేరుగా రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.6వేలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నేడు (ఫిబ్రవరి 1వ తేదీ) కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సార్వత్రిక ఎన్నిలకు ముందు మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ మధ్యంతర బడ్జెట్‌లో.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఏం చేస్తారనేది ఆసక్తికరం. 2014లో గెలిచిన ఎన్డీయేకు.. ఈ టర్మ్‌కు ఇది చివరి బడ్జెట్. మరో నాలుగు నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు.. ఈ నాలుగు నెలలకు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ రోజు మోడీ సర్కార్ ప్రకటించే వరాలపై చర్చ సాగుతోంది.

 Budget 2019 LIVE: What sops will Modi sarkar dole out?

Newest First Oldest First
3:30 PM, 1 Feb

ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యూటీ మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20లక్షలకు పెంపు
1:42 PM, 1 Feb

ద్రవ్యోల్భణాన్ని 3.4 శాతానికి కట్టడి చేస్తామని చెప్పారు.
12:39 PM, 1 Feb

నల్లధనాన్ని అరికట్టేందుకు చేసిన దాడుల్లో 50వేల కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లు తెలిపారు. 6900 కోట్ల బినామీ ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
12:31 PM, 1 Feb

రానున్న అయిదేళ్లలో మన ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని అందుకుంటుందని పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
12:31 PM, 1 Feb

బ్రహ్మపుత్ర ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు.
12:26 PM, 1 Feb

2030 నాటికి డిజిటల్ ఇండియాలోకి భారతీయులు వస్తారని చెప్పారు. 2022 నాటికి అంతరిక్షంలోకి భారత వ్యోమగాములు వెళ్తారని తెలిపారు.
12:24 PM, 1 Feb

2019 జనవరిలో జీఎస్టీ వసూల్లు ఒక లక్ష కోట్లు దాటాయని గోయెల్ తెలిపారు.
12:23 PM, 1 Feb

డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు 2013-14లో 6.38 లక్షల కోట్లు ఉండగా, ఇఫ్పుడు 12 లక్షల కోట్లకు పెరిగాయని చెప్పారు. 2017-18లో 18 శాతం పెరిగిందని చెప్పారు. ట్యాక్స్ పరిధిలోకి 1.06 మంది వచ్చారని తెలిపారు. ప్రస్తుతం కోటి మందికి పైగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఎక్కువ మంది మొదటిసారి ఫైల్ చేస్తున్నారని చెప్పారు.
12:18 PM, 1 Feb

వచ్చే అయిదేళ్లలో ఒక లక్ష డిజిటల్ విలేజీలు నిర్మిస్తామని గోయల్ చెప్పారు.
12:14 PM, 1 Feb

పీఎం కౌషల్ యోజన కింద కోటి మందికి ఉపాధి శిక్షణ అని చెప్పారు. సినిమా నిర్మాణానికి సింగిల్ విండో అనుమతులు ఇస్తామని చెప్పారు. సినిమా థియేటర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు.
12:12 PM, 1 Feb

24 గంటల్లోనే ఐటీఆర్ ప్రాసెస్, రీఫంట్ ఉంటుందని తెలిపారు. ప్రస్తుత రిజర్వేషన్ పద్ధతిని మార్చి నిరుపేదలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని పీయూష్ గోయల్ తెలిపారు.
12:07 PM, 1 Feb

సోలార్ విద్యుత్త్ ఉత్పత్తిలో 10 శాతం పెరిగిందని చెప్పారు. గ్రాట్యుటిటీ లిమిట్ రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచినట్లు పీయూష్ గోయల్ తెలిపారు.
12:06 PM, 1 Feb

డైరెక్ట్ ఇన్‌కం ట్యాక్స్ వసూళ్లు గతంలో కంటే ఎక్కువగా పెరిగాయని పీయూష్ గోయల్ చెప్పారు. 2013-14లో రూ.6.38 లక్షల కోట్లు ఉండగా, ఇప్పుడు అది 12 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. ట్యాక్స్ బేస్ 3.79 నుంచి 6.85కు పెరిగిందని చెప్పారు.
12:05 PM, 1 Feb

ప్రధానమంత్రి ఉజ్వల బీమ్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో 8 కోట్ల ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ఇందులో 6 కోట్ల కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు.
12:03 PM, 1 Feb

ఇప్పుడు దేశంలో మనుషులు లేని రైల్వే క్రాసింగ్‌లు ఒక్కటి కూడా లేదని పీయూష్ గోయల్ చెప్పారు. బ్రాడ్ గేజీలో కాపలా లేని గేట్లను తొలగించినట్లు తెలిపారు. రైల్వేల చరత్రలో ఇది ప్రమాదాలు తక్కువగా ఉన్న ఏడాది అని చెప్పారు. రైల్వేలకు 64.57వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు.
12:00 PM, 1 Feb

భారత దేశంలో 70 శాతం మంది రైతులకు 5 ఎకరాలక కంటే తక్కువ భూమి ఉంది. కాబట్టి ఈ పథకం ద్వారా ముప్పావు వంతు మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
11:54 AM, 1 Feb

ప్రపంచంలోనే భారత దేశం అత్యంత వేగంగా రోడ్లు నిర్మిస్తోందని గోయల్ తెలిపారు. ప్రతి రోజు 27 కిలో మీటర్ల రోడ్డును నిర్మించినట్లు తెలిపారు. దశాబ్దాలుగా ఆగిపోయిన ప్రాజెక్టులను తాము చేపట్టామని చెప్పారు.
11:53 AM, 1 Feb

డిఫెన్స్‌కు రూ.3 లక్షల కోట్లు కేటాయించినట్లు పీయూష్ గోయల్ తెలిపారు. అవసమైతే రక్షణ రంగం బడ్జెట్ పెంచుతామని చెప్పారు.
11:52 AM, 1 Feb

దేశానికి సైన్యం గర్వకారణమని గోయల్ చెప్పారు. నలభయ్యేళ్ల నుంచి వారు అడుగుతున్న వన్ ర్యాంక్ వన్ పింఛన్ స్కీం ప్రారంభించామని చెప్పారు. ఓఆర్ఓపీ కోసం ఇప్పటికే 35వేల కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సైనికులకు ప్రత్యేక అలవెన్సులు ఉంటాయని తెలిపారు.
11:50 AM, 1 Feb

బడ్జెట్‌లో పీయూష్ గోయల్ చెప్పిన కీలక అంశాలు..
11:50 AM, 1 Feb

కార్మిక ప్రమాద బీమా రూ.లక్షన్నర నుంచి రూ.6 లక్షలకు పెంపు. గ్రాట్యుటీ పరిధి రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంపు. కిసాన్ క్రెడిట్ కార్డు కింద రుణాలు ఇవ్వనున్నారు. ప్రకృతి విపత్తు వల్ల పంట నష్టపోయిన వారి రుణాల రీషెడ్యూలింగ్. రీషెడ్యూల్ చేసిన రుణాలపై 2 శాతం వడ్డీ పెంపు.
11:49 AM, 1 Feb

రుణాలు సకాలంలో చెల్లించిన వారికి రాయితీలు ఇచ్చారు. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోయిన వారి రుణాలు రీషెడ్యూలింగ్ చేస్తారు. ముద్ర స్కీం కింద రుణాలకు రూ.7 లక్షల కోట్లు ఇస్తారు. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద 75 శాతం మంది మహిళలకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు.
11:46 AM, 1 Feb

రాష్ట్రీయ గోకుల్ మిషన్‌కు ఏడాదికి రూ.750 కోట్లు కేటాయించనున్నట్లు గోయల్ తెలిపారు.
11:41 AM, 1 Feb

అంగన్ వాడీ సిబ్బంది వేతనం 50 శాతం పెంచనున్నట్లు గోయల్ తెలిపారు. అరవై ఏళ్లు దాటిన అసంఘటిత రంగం కార్మికులకు నెలకు రూ.3వేలు పింఛన్. సంఘటిత కార్మికులు పించన్ కోసం నెలకు రూ.100 జమ చేయాల్సి ఉంటుంది. కొత్త పింఛన్ విధానానికి రూ.500 కోట్లు కేటాయింపు
11:39 AM, 1 Feb

మార్చిలోపు అన్ని ఇళ్లకు కరెంట్ ఇస్తామన్నారు. ఉపాధి హామీకి రూ.60వేల కోట్లు కేటాయించామని చెప్పారు. గత అయిదేళ్లలో ద్రవ్యోల్భణాన్ని తగ్గించామని చెప్పారు.
11:38 AM, 1 Feb

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి ఈ ఏడాదిరూ.75వేలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా 12 కోట్ల రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. డిసెంబర్ 1, 2018 నుంచి ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. పాడి, మత్స్య పరిశ్రమ రైతులకు 2 శాతానికి వడ్డీ ఇస్తామని చెప్పారు.
11:32 AM, 1 Feb

రైతులకు సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. 5 ఎకరాల లోపు (2 హెక్టార్లు) భూమి ఉన్నవారికి సంవత్సరానికి రూ.6వేలు ఇస్తామని గోయల్ తెలిపారు. ఈ అకౌంట్ రాష్ట్రాలతో సంబంధం లేకుండా నేరుగా రైతుల అకౌంట్‌లో మూడు దఫాల్లో పడుతుందని చెప్పారు.
11:30 AM, 1 Feb

ప్రపంచంలోనే ఇప్పటి వరకు రాని ఆయుష్మాన్ భారత్‌ను చేపట్టామని గోయల్ తెలిపారు. దేశంలోని 50 కోట్ల మంది ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. దీని ద్వారా పేదవారికి రూ.3వేల కోట్ల సేవింగ్ అవుతుందని చెప్పారు.
11:29 AM, 1 Feb

గ్రామీణ ప్రాంతాల్లో చురుగ్గా రహదారుల నిర్మాణం జరుగుతోందని గోయల్ చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం పది శాతం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పారు. ఎల్ఈడీ బల్బులతో రూ.50వేల కోట్లు ఆదా చేశామన్నారు.
11:26 AM, 1 Feb

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2014-2018 మధ్య 1.53 లక్షల ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు.
READ MORE

English summary
Finance Minister Piyush Goyal will on 1 February present Narendra Modi government's sixth and final Budget, which will be an interim one, keeping up with established tradition. This will be the last Budget of the BJP-led NDA government ahead of the General Election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X