వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మహారాజా’ కోసం అన్వేషణ వేగవంతం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వాటా విక్రయ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఈ సంస్థను కొనుగోలు చేయాలని అనుకునేవారిని వచ్చే కొన్ని వారాల్లో ఆహ్వానిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే తెలిపారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఏరోస్పెస్ సంయుక్తంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన వింగ్స్ ఇండియా 2018 విమానాల పండుగను ఆయన గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్ ఇండియాతోపాటు పవన్ హన్స్‌లో వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించారు. ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసే సంస్థకోసం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు, అత్యంత వేగవంతంగా ఈ పనిని పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

భారత్‌లో మూడేళ్లలో 20% చొప్పున పెరుగనున్న ప్రయాణికులు

భారత్‌లో మూడేళ్లలో 20% చొప్పున పెరుగనున్న ప్రయాణికులు

రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంస్థను ప్రైవేటీకరించడానికి గతేడాది జూన్‌లో కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ కోసం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. గత మూడేళ్ల కాలంలో భారత్‌లో విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య 20 % చొప్పున పెరుగుతున్నా, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భగ్గుమనడంతో ఈ ఏడాది వృద్ధి 17.5 శాతానికి పరిమితం కానున్నదని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్ఎన్ చౌబే తెలిపారు.

6 - 8 నెలల్లో అందుబాటులోకి మళ్లీ విమానాశ్రయాలు

6 - 8 నెలల్లో అందుబాటులోకి మళ్లీ విమానాశ్రయాలు

ముడి చమురు బ్యారెల్ ఇంధన ధర 80 డాలర్ల కంటే తక్కువగా ఉంటే వచ్చే 20 ఏళ్లలో యేటా విమానయాన రంగం 15 శాతం వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉన్నది. ప్రాంతీయంగా విమాన సేవలు అందించే ఉద్దేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉడాన్ స్కీంను ప్రవేశపెట్టిందని పౌర విమానయాన శాఖ కార్యదర్శి చౌబే అన్నారు. ఈ స్కీం కింద గత రెండేళ్లలో 56 నూతన విమానాశ్రయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ పథకం అమలు చేయడం వల్ల వచ్చే 6-8 నెలల్లో మరిన్ని విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చే వీలు ఉన్నది.

 కేంద్రం రాయితీలను రాష్ట్రప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోవాలి

కేంద్రం రాయితీలను రాష్ట్రప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోవాలి

ఇటీవల చిన్న స్థాయి నగరాలకు సైతం విమాన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోంది. అయితే అందుకు అవసరమైన నిధులను రాష్ట్రప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర పౌర విమాన యాన శాఖ కార్యదర్శి ఆర్ఎన్ చౌబె సూచించారు. తాము మార్గనిర్దేశం మాత్రమే చేయనున్నామని, తుది నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

భారీగా భారతీయ విమానయాన రంగం వృద్ధికి చాన్స్

భారీగా భారతీయ విమానయాన రంగం వృద్ధికి చాన్స్

ప్రాంతీయంగా చౌక ధరకే విమాన సేవలు అందించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ ఉడాన్ స్కీంను ప్రవేశపెట్టింది. అలాగే అంతర్జాతీయ రూట్లలో సేవలు అందించడానికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకోవాలని, లేకపోతే రుణాల రూపంలో సమకూర్చనున్నట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్ ఎన్ చౌబే చెప్పారు. దీన్ని ఉడాన్ ఇంటర్నేషనల్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపారు. భారత్‌లో విమానయాన రంగం భారీ వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, దీంతో వచ్చే ఐదు నుంచి ఆరేళ్లకాలంలో 8 వేల నుంచి 10 వేల మంది విమాన చోధకులు అవసరమవుతారని ఆయన పేర్కొన్నారు.

 రెండేళ్లలో అమెరికాకు ‘విస్తారా' సేవలు

రెండేళ్లలో అమెరికాకు ‘విస్తారా' సేవలు

దేశీయ రూట్లలో విమాన సేవలు అందిస్తున్న విస్తారా..ఇకపై అంతర్జాతీయ రూట్లపై దృష్టి సారించింది. ప్రస్తుత సంవత్సరం రెండో అర్ధభాగం నుంచి ఆగ్నేయాసియా దేశాలకు సర్వీసులను నడుపనున్నట్లు కంపెనీ సీఈవో లెస్లీ థంగ్ తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ‘వింగ్స్ ఇండియా 2018' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 19 విమానాలతో సేవలు అందిస్తుండగా, ఈ నెలాఖరు నాటికి మరో ఎయిర్‌క్రాఫ్ట్ అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. టాటా, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు కలిసి ఈ విమానయాన సంస్థను ఏర్పాటు చేశాయి. మరో రెండు ఏ320 నియో విమానాలను లీజ్‌కు తీసుకున్నామని, మే, జూన్ నాటికి వచ్చే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ విస్తరణలో భాగంగా వచ్చే రెండేళ్లలో అమెరికాకు కూడా విమానాలు నడుపాలనుకుంటున్నట్లు తెలిపారు.

 అంతర్జాతీయ విమాన మార్కెట్‌లో భారత్‌కు మూడోస్థానం

అంతర్జాతీయ విమాన మార్కెట్‌లో భారత్‌కు మూడోస్థానం

జెట్ ఎయిర్‌వేస్ మరిన్ని చిన్న విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల చివరిలోగా 75 చిన్న తరహా విమానాలను ఆర్డర్ చేయనున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వినయ్ దూబే తెలిపారు. ఈ నెల 31వ తేదీలోగా ఖరారుకానున్న ఈ ఒప్పందంపై విమానయాన తయారీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. పెద్ద విమానాలకే ఎక్కువగా డిమాండ్ ఉన్నదని రోల్స్‌ రాయిస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆంటోని జఫ్రెంక్‌ తెలిపారు. ‘భారత్‌ మాకు అత్యంత కీలక మార్కెట్‌. ఇక్కడ విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఏటా దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 15-20% చొప్పున, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య 10-12% చొప్పున పెరుగుతున్నారు. ఈ లెక్కన 2025నాటికి ప్రయాణికుల పరంగా అమెరికా, చైనా తర్వాత భారత్‌ మూడో అతి పెద్ద మార్కెట్‌ అవుతుంది' అని అన్నారు.

 నీవీ, ఈప్లెట్‌లతో జత కట్టిన ఎయిర్‌బస్

నీవీ, ఈప్లెట్‌లతో జత కట్టిన ఎయిర్‌బస్

భారత్‌కు చెందిన రెండు స్టార్టప్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూరప్‌ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ ప్రకటించింది. టెక్నాలజీ రంగంలో ఎదురైతున్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో నీవీ, ఈఫ్లైట్ స్టార్టప్‌లతో జతకట్టినట్లు ఎయిర్‌బస్ బిజ్‌ల్యాబ్ హెడ్ బ్రూనో తెలిపారు. తొమ్మిది దేశాల నుంచి 137 దరఖాస్తులు రాగా, వీటిలో ఐదింటిని గతేడాది ఎంపిక చేసింది. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్‌లో రెండింటితో ఒప్పందం కుదుర్చుకున్నది.

 ‘ఉడాన్'లో రాష్ట్రప్రభుత్వాలకు రాయితీలు ‘నో'

‘ఉడాన్'లో రాష్ట్రప్రభుత్వాలకు రాయితీలు ‘నో'

ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్‌పోర్ట్ ఆథార్టీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. వచ్చే నాలుగేళ్లలో వ్యాపారాన్ని భారీగా విస్తరించడానికి, విమానాశ్రయాలను ఆధునీకరించడానికి రూ.18 వేల కోట్ల స్థాయిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్ఎన్ చౌబే ప్రకటించారు. ఏఏఐ సవరణ బిల్లుపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ బిల్లు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోగానీ, ఆ తర్వాత జరిగే సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకోసం త్వరలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు, ఈ సవరణ బిల్లు మోక్షం లభించాలంటే కనీసం ఆరు నెలలు పట్టవచ్చన్నారు. ఉడాన్ స్కీం కింద రాష్ట్ర ప్రభుత్వాలకు రాయితీలు ఇచ్చే అవకాశాలు లేవని చౌబే స్పష్టంచేశారు.

English summary
The government is committed to expediting the process of Air India's disinvestment and is likely to invite Expressions of Interest (EoIs) from interested parties in the next few weeks, an official said. Speaking here at the inaugural ceremony of the four-day aviation event 'Wings India 2018', Civil Aviation Secretary R N Choubey said a revised EoI for disinvestment in Pawan Hans is also expected to be floated around the same time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X